Aadhaar Card : మీ ఆధార్ ఇంకా అప్‌డేట్ చేయలేదా? ఈ 10 గవర్నెంట్ స్కీమ్ బెనిఫిట్స్ కోల్పోతారు జాగ్రత్త.. ఇప్పుడే ఇలా చేయండి..!

Aadhaar Card : ఆధార్ ఇంకా అప్‌డేట్ చేయలేదా? లేదంటే ఈ 10 ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు కోల్పోతారు జాగ్రత్త..

Aadhaar Card : మీ ఆధార్ ఇంకా అప్‌డేట్ చేయలేదా? ఈ 10 గవర్నెంట్ స్కీమ్ బెనిఫిట్స్ కోల్పోతారు జాగ్రత్త.. ఇప్పుడే ఇలా చేయండి..!

Aadhaar Card

Updated On : June 19, 2025 / 4:33 PM IST

Aadhaar Card : మీ ఆధార్ కార్డు అప్‌డేట్ చేసుకున్నారా? లేదంటే ఇప్పుడే అప్‌డేట్ చేసుకోండి. ఆధార్ అప్‌డేట్ ఉచిత సౌకర్యాన్ని మరో ఏడాది (Aadhaar Card) పాటు (UIDAI) పొడిగించింది.

జూన్ 14, 2026 వరకు ఎలాంటి రుసుము లేకుండా మీ ఆధార్‌ను ఆన్‌లైన్‌లో అప్‌డేట్ చేసుకోవచ్చు. కానీ, మీరు ఇంకా మీ e-KYC లేదా ఆధార్‌లో అడ్రస్ అప్‌డేట్ చేయకపోతే భవిష్యత్తులో అనేక ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు నిలిచిపోతాయి.

Read Also : Best Tablets : స్టూడెంట్స్ కోసం రూ. 25వేల లోపు బెస్ట్ ట్యాబ్స్ ఇవే.. ఫీచర్లు మాత్రం కేక.. ఇప్పుడే కొనడం బెటర్..!

రేషన్ కార్డ్, గ్యాస్ సబ్సిడీ, పెన్షన్, స్కాలర్‌షిప్ లేదా పీఎం కిసాన్ యోజన దేనికైనా ఆధార్ సరిగ్గా ఉండాలి. లేదంటే వెంటనే అప్‌‌డేట్ చేసుకోవాలి. ఆధార్ అప్‌డేట్ చేయకపోతే 10 ముఖ్యమైన ప్రభుత్వ పథకాలను పొందవచ్చు. ఇంట్లో కూర్చొనే మీ ఆధార్‌ను ఉచితంగా అప్‌డేట్ చేసుకోవచ్చు.

1. పీఎం కిసాన్ యోజన :
ఈ పథకంలో 4 నెలల్లో రూ. 2వేలు వాయిదా నేరుగా బ్యాంకు ఖాతాకు బదిలీ అవుతుంది. కానీ, మీ ఆధార్ నంబర్ బ్యాంకు ఖాతాకు లింక్ చేయకపోయినా లేదా EKYC పూర్తి చేయకపోతే వాయిదా నిలిచిపోయే అవకాశం ఉంది.

2. గ్యాస్ సబ్సిడీ :
LPG సిలిండర్‌పై సబ్సిడీ నేరుగా బ్యాంకుకు అందుతుంది. ఆధార్ లింక్ చేయకపోతే సబ్సిడీ లేకుండా మొత్తం బిల్లు చెల్లించాల్సి ఉంటుంది.

3. రేషన్ కార్డు :
NFSA కింద చౌకగా రేషన్ పొందాలంటే ఆధార్‌ను అప్‌డేట్ చేయాలి. పేరు తప్పుగా ఉంటే లేదా మొబైల్ నంబర్‌కు OTP రాకపోతే ఈ సౌకర్యం అందుబాటులో ఉండదు.

4. జాతీయ పెన్షన్ పథకాలు :
వృద్ధులకు పెన్షన్ పొందడానికి ఆధార్ ధృవీకరణ అవసరం. ఏదైనా పొరపాటు జరిగితే పెన్షన్ మొత్తం నిలిచిపోవచ్చు.

5. స్కాలర్‌షిప్ :
విద్యార్థులకు ఇచ్చే (Aadhaar Card) స్కాలర్‌షిప్‌ను ఇప్పుడు DBT (డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్‌ఫర్) కింద ఆధార్‌తో లింక్ అయి ఉంటుంది. డాక్యుమెంట్ తప్పు అయితే రావాల్సిన డబ్బులు రావు.

6. MNREGA వేతనాలు :
కార్మికుల వేతన (MNREGA) పేమెంట్ కూడా ఆధార్‌తో లింక్ అయి ఉంటుంది. ధృవీకరణలో పేరు సరిపోలికపోతే పేమెంట్ నిలిచిపోతుంది.

7. జన్‌ధన్ అకౌంట్ బెనిఫిట్స్ :
బీమా, ఓవర్‌డ్రాఫ్ట్‌ వంటి జీరో బ్యాలెన్స్ అకౌంట్లపై బెనిఫిట్స్ ఆధార్ ఆధారంగా ఉంటాయి. ఈ అప్‌డేట్ చేయకపోతే బెనిఫిట్స్ కోల్పోతారు.

8. కిసాన్ క్రెడిట్ కార్డ్ :
ఆధార్, బ్యాంక్ లింకింగ్ (Aadhaar Card) సరిగా ఉంటేనే రైతులు కిసాన్ క్రెడిట్ కార్డుపై రుణాలు, సబ్సిడీలు, బీమా బెనిఫిట్స్ పొందుతారు.

9. ఆయుష్మాన్ భారత్ స్కీమ్స్ :
రూ. 5 లక్షల వరకు బీమా ఉచితం. ఆధార్‌తో వెరిఫికేషన్ అవసరం. పుట్టిన తేదీ లేదా పేరు తప్పు ఉంటే క్లెయిమ్ రిజక్ట్ అవుతుంది.

Read Also : Reliance Jio : జియో యూజర్లకు పండగే.. ఈ 3 ప్లాన్లతో 7 రోజుల ఫ్రీ సర్వీస్.. 200GB వరకు ఎక్స్‌ట్రా డేటా, ఫ్రీగా OTT బెనిఫిట్స్..!

10. ప్రభుత్వ ఉద్యోగాలకు అప్లికేషన్ :
అనేక ప్రభుత్వ నియామకాలలో eKYC, రిజిస్ట్రేషన్ కోసం ఆధార్ తప్పనిసరి. డాక్యుమెంట్లు సరిపోలకపోతే ఫారమ్ రిజక్ట్ కావచ్చు.

ఆధార్‌ ఎలా అప్‌డేట్ చేయాలంటే? :

  • UIDAI సైట్ (https://myaadhaar.uidai.gov.in)కి వెళ్లండి.
  • 12 అంకెల ఆధార్ నంబర్‌ను ఎంటర్ చేయండి.
  • క్యాప్చా ‘Send OTP’పై క్లిక్ చేయండి.
  • రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు వచ్చిన OTPతో లాగిన్ అవ్వండి.
  • ఇప్పుడు ‘Aadhaar Update’ ఆప్షన్‌పై క్లిక్ చేయండి.
  • అడ్రస్ ఎంచుకుని, ‘Proceed to Update Aadhaar’ పై క్లిక్ చేయండి.
  • మీ పాత అడ్రస్ స్క్రీన్‌పై కనిపిస్తుంది.
  • కొత్త అడ్రస్ కోసం సరైన వివరాలను ఎంటర్ చేయండి.
  • పవర్ బిల్లు, పాస్‌పోర్ట్, బ్యాంక్ స్టేట్‌మెంట్, ఓటరు ఐడీ వంటి అడ్రస్ ప్రూఫ్ అప్‌లోడ్ చేయండి.
  • డిక్లరేషన్ బాక్స్‌ను చెక్ చేసి Submit చేయండి.
  • SMS ద్వారా అప్‌డేట్ స్టేటస్ ట్రాక్ చేయండి.