Apple iPhone 16e : పండగ చేస్కోండి.. అతి తక్కువ ధరకే ఆపిల్ iPhone 16e.. లిమిటెడ్ డీల్.. డోంట్ మిస్..!

Apple iPhone 16e Discount : ఆపిల్ ఐఫోన్ 16e భారీగా తగ్గింది. విజయ్ సేల్స్‌లో ఈ సరికొత్త ఐఫోన్ 16e అతి తక్కువ ధరకే అందుబాటులో ఉంది. రూ.7వేలు డిస్కౌంట్ పొందవచ్చు. ఇంకా తక్కువ ధరకు పొందాలంటే?

Apple iPhone 16e : పండగ చేస్కోండి.. అతి తక్కువ ధరకే ఆపిల్ iPhone 16e.. లిమిటెడ్ డీల్.. డోంట్ మిస్..!

Apple iPhone 16e

Updated On : March 29, 2025 / 4:52 PM IST

Apple iPhone 16e Discount : కొత్త ఆపిల్ ఐఫోన్ కోసం చూస్తున్నారా? విజయ్ సేల్స్‌లో ఆపిల్ ఐఫోన్ 16eపై ఆకర్షణీయమై డీల్ అందుబాటులో ఉంది. మీరు ఈ డీల్ పొందాలంటే ఇదే బెస్ట్ టైమ్ అని చెప్పవచ్చు. విజయ్ సేల్స్ ఆపిల్ లేటెస్ట్ ఐఫోన్ 16eపై ఏకంగా రూ. 7వేలు డిస్కౌంట్ అందిస్తోంది.

Read Also : Vivo V50 5G Price : వివో ఫోన్ క్రేజే వేరబ్బా.. ఫ్లిప్‌కార్ట్‌లో ఈ 5జీ ఫోన్ ధర తగ్గిందోచ్.. ఈ డీల్ అసలు మిస్ చేసుకోవద్దు!

మీ పాత అప్‌గ్రేడ్ చేసుకుంటే ఈ ఐఫోన్ మరింత తక్కువ ధరకే సొంతం చేసుకోవచ్చు. ఈ డీల్ ప్రస్తుతం విజయ్ సేల్స్ అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంది. ఈ డిస్కౌంట్ లిమిటెడ్ ఆఫర్ మాత్రమే. ఈ డిస్కౌంట్ ఎలా పొందాలో ఇప్పుడు తెలుసుకుందాం.

ఐఫోన్ 16e డీల్ :
భారత మార్కెట్లో ఆపిల్ ఐఫోన్ 16e ఫోన్ రూ. 59,900 ప్రారంభ ధరకు లాంచ్ అయింది. ప్రస్తుతం విజయ్ సేల్స్ వెబ్‌సైట్‌లో ఈ ఐఫోన్ రూ. 56,900కు లిస్టు అయింది. అసలు ధర కన్నా రూ. 3వేలు తక్కువగా ఉంది. అదనంగా, మీరు ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డ్, ఎస్బీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డ్, కోటాక్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ లావాదేవీలపై రూ. 4వేలు తగ్గింపు పొందవచ్చు.

ఐఫోన్ 16e స్పెసిఫికేషన్లు, ఫీచర్లు :
ఆపిల్ ఐఫోన్ 16e మోడల్ 60Hz రిఫ్రెష్ రేట్‌తో 6.1-అంగుళాల ఓఎల్ఈడీ డిస్‌ప్లేను కలిగి ఉంది. అల్యూమినియం డిజైన్, ఫేస్ ఐడీ సపోర్ట్ ఉంది. హుడ్ కింద, ఈ స్మార్ట్‌ఫోన్ ఆపిల్ A18 చిప్‌సెట్‌తో అమర్చి ఉంది. 8GB ర్యామ్ కలిగి ఉంది. ఆపిల్ ఇంటెలిజెన్స్ ఫీచర్‌లకు కూడా సపోర్టు ఇస్తుంది.

Read Also : Google Pixel 9 : వావ్.. వండర్‌ఫుల్ ఆఫర్.. గూగుల్ పిక్సెల్ 9పై అద్భుతమైన డిస్కౌంట్.. లిమిటెడ్ ఆఫర్.. ఇంకా ధర తగ్గాలంటే?

ఫోటోగ్రఫీ విషయానికి వస్తే.. ఐఫోన్ 16e హ్యాండ్‌సెట్‌లో 2x ఆప్టికల్ జూమ్‌తో కూడిన 48MP ప్రైమరీ కెమెరా, 12MP ఫ్రంట్ కెమెరా ఉన్నాయి. అలాగే, ఆపిల్ ఇమేజ్ క్లీనప్ టూల్, ఇమేజ్ ప్లేగ్రౌండ్, చాట్‌జీపీటీ ఇంటిగ్రేషన్, రైటింగ్ టూల్స్ వంటి ఏఐ టూల్స్ ఉన్నాయి. ఇంకా, ఆపిల్ ఐఫోన్ 16e మోడల్ USB-C పోర్ట్‌తో వస్తుంది. IP68 సర్టిఫికేట్ కూడా పొందింది.