Apple iPhone 16e : ఆపిల్ ఐఫోన్ కావాలా? కొత్త ఐఫోన్ 16eపై కళ్లుచెదిరే డిస్కౌంట్.. అమెజాన్‌లో అతి తక్కువ ధరకే..!

Apple iPhone 16e : ఆపిల్ ఐఫోన్ 16e ధర తగ్గిందోచ్.. అమెజాన్‌లో ఏకంగా రూ.10,300 డిస్కౌంట్ అందిస్తోంది. ఈ అద్భుతమైన డీల్ ఎలా పొందాలంటే?

Apple iPhone 16e : ఆపిల్ ఐఫోన్ కావాలా? కొత్త ఐఫోన్ 16eపై కళ్లుచెదిరే డిస్కౌంట్.. అమెజాన్‌లో అతి తక్కువ ధరకే..!

Apple iPhone 16e

Updated On : July 30, 2025 / 11:21 AM IST

Apple iPhone 16e : మీరు కొత్త ఆపిల్ ఐఫోన్ కొంటున్నారా? అయితే, ఇదే బెస్ట్ టైమ్. ప్రస్తుతం ఐఫోన్ 16eపై అమెజాన్ భారీ డిస్కౌంట్ అందిస్తోంది. ఈ ఐఫోన్ (Apple iPhone 16e) మోడల్ కొనుగోలుపై రూ. 10,300 వరకు తగ్గింపు పొందవచ్చు. ప్రస్తుత ఐఫోన్ అప్‌గ్రేడ్ చేస్తున్నా లేదా ఫస్ట్ టైమ్ ఐఫోన్‌కి మారుతున్నా ఈ ఆఫర్‌ అసలు వదులుకోవద్దు. ఈ డీల్ ఎలా పొందాలో ఇప్పుడు చూద్దాం..

అమెజాన్‌లో ఐఫోన్ 16e డీల్ :
భారత మార్కెట్లో ఆపిల్ ఐఫోన్ 16e ప్రారంభ ధర రూ. 59,900తో లాంచ్ అయింది. ప్రస్తుతం, అమెజాన్ ఈ ఐఫోన్‌పై రూ. 6,300 ఫ్లాట్ డిస్కౌంట్ అందిస్తోంది. ధర రూ. 53,600కి తగ్గింది. ఐసీఐసీఐ బ్యాంక్, ఎస్బీఐ లేదా కోటక్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌ అదనంగా రూ. 4వేలు సేవ్ చేసుకోవచ్చు. మీ పాత స్మార్ట్‌ఫోన్‌ ద్వారా ఎక్స్ఛేంజ్ చేసుకుంటే మరింత తగ్గింపు ధరకే పొందవచ్చు.

Read Also : Primebook 2 Neo : స్టూడెంట్స్ కోసం లేటెస్ట్ AI ల్యాప్‌టాప్.. ఈ నెల 31నే లాంచ్.. మీ బడ్జెట్ ధరలోనే వస్తోంది.. డోంట్ మిస్..!

ఆపిల్ ఐఫోన్ 16e స్పెసిఫికేషన్లు, ఫీచర్లు :
ఆపిల్ ఐఫోన్ 16e మోడల్ 60Hz రిఫ్రెష్ రేట్‌తో 6.1-అంగుళాల OLED డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ ఐఫోన్ ఆపిల్ A18 చిప్‌సెట్, 8GB ర్యామ్ కలిగి ఉంది. అల్యూమినియం ఫ్రేమ్‌ కలిగి ఉంది. ఫేస్ ఐడీకి సపోర్టు ఇస్తుంది. IP68 రేటింగ్‌తో వస్తుంది.

ఐఫోన్ 16e ఇమేజ్ ప్లేగ్రౌండ్, జెన్మోజీ, చాట్‌జీపీటీ ఇంటిగ్రేషన్, రైటింగ్ అసిస్టెంట్ టూల్స్ వంటి ఆపిల్ ఇంటెలిజెన్స్ ఫీచర్లకు కూడా సపోర్టు ఇస్తుంది. ఫొటోగ్రఫీ పరంగా ఆపిల్ ఐఫోన్ 16e స్మార్ట్‌ఫోన్‌లో 2x ఆప్టికల్ జూమ్‌తో 48MP మెయిన్ కెమెరా ఉంది. ఫ్రంట్ సైడ్ సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 12MP కెమెరా కూడా ఉంది.