Primebook 2 Neo : స్టూడెంట్స్ కోసం లేటెస్ట్ AI ల్యాప్‌టాప్.. ఈ నెల 31నే లాంచ్.. మీ బడ్జెట్ ధరలోనే వస్తోంది.. డోంట్ మిస్..!
Primebook 2 Neo : విద్యార్థులు, యువత కోసం సరికొత్త ఏఐ ల్యాప్‌టాప్ రాబోతుంది. ఈ ల్యాప్‌టాప్ . ప్రైమ్‌బుక్ 2 నియో పేరుతో లాంచ్ కానుంది.

Primebook 2 Neo Laptop
Primebook 2 Neo Laptop : కొత్త ల్యాప్‌టాప్ కొంటున్నారా? భారతీయ టెక్ కంపెనీ ప్రైమ్‌బుక్ నుంచి సరికొత్త ఆండ్రాయిడ్ ల్యాప్‌టాప్ రాబోతుంది. ప్రైమ్‌బుక్ 2 నియో ల్యాప్‌టాప్ జూలై 31న లాంచ్ చేయనుంది. ఈ డివైజ్ ప్రారంభ ధర రూ. 15,990గా ఉండనుంది.
ప్రైమ్‌బుక్ 2 నియో ఫ్లిప్‌కార్ట్, అమెజాన్, కంపెనీ అధికారిక వెబ్‌సైట్‌లలో అందుబాటులో ఉండనుంది. ప్రైమ్‌బుక్ 2 నియో ల్యాప్‌టాప్ ప్రత్యేకించి విద్యార్థులు, యువతకు తక్కువ ధరలో అందుబాటులో ఉండనుంది. మంచి ల్యాప్‌టాప్ కోసం చూసేవారికి బెస్ట్ అని చెప్పొచ్చు.. రాబోయే ఈ ల్యాప్‌టాప్ స్పెసిఫికేషన్లు, ధరకు సంబంధించి వివరాలను ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.
ప్రైమ్‌బుక్ 2 నియో ఫీచర్లు :
ప్రైమ్‌బుక్ 2 నియో ల్యాప్‌టాప్ ఆండ్రాయిడ్ 15 ఆధారంగా కస్టమ్ ప్రైమ్OS 3.0 ఆపరేటింగ్ సిస్టమ్‌పై రన్ అవుతుంది. 11.6-అంగుళాల HD IPS డిస్‌ప్లే (1366x768px), మీడియాటెక్ ఆక్టా-కోర్ హెలియో G99 ప్రాసెసర్‌ను కలిగి ఉంది.
6GB LPDDR4X ర్యామ్ కలిగి ఉంది. 128GB UFS 2.2 స్టోరేజ్‌ను కూడా కలిగి ఉంది. మైక్రో SD కార్డ్ సాయంతో 512GB వరకు విస్తరించవచ్చు. ప్రైమ్‌బుక్ ల్యాప్‌టాప్ మల్టీ టాస్కింగ్, స్పీడ్ అప్లికేషన్ లోడింగ్ ఎక్స్‌పీరియన్స్ అందిస్తుంది.
కనెక్టివిటీ విషయానికి వస్తే.. రెండు USB 3.0, రెండు USB-C పోర్ట్‌లు, మైక్రో SD కార్డ్ స్లాట్, Wi-Fi, బ్లూటూత్, డ్యూయల్ స్పీకర్ సిస్టమ్ ఉంటాయి. బ్యాటరీ బ్యాకప్ దాదాపు 8 గంటల నుంచి 10 గంటలు ఉంటుంది. 2MP ఫ్రంట్ కెమెరా, QWERTY కీబోర్డ్ PrimeOS షార్ట్‌కట్‌లతో వస్తుంది. ఈ ల్యాప్‌టాప్ బరువు 990 గ్రాములు ఉంటుంది.
ఏఐ సపోర్టు :
ఈ ల్యాప్‌టాప్‌కు స్పెషల్ యాప్ స్టోర్ ద్వారా 50వేల ఆండ్రాయిడ్ యాప్‌లకు యాక్సెస్ పొందవచ్చు. అలాగే, ఈ రాబోయే ప్రైమ్‌బుక్ 2 నియోలో ఇన్‌బిల్ట్ ఆన్-స్క్రీన్ ఏఐ కంపానియన్ మోడ్ ఉంది. ఈ ఏఐ ఫీచర్ యూజర్లకు పీడీఎఫ్, వెబ్ కంటెంట్, స్టోరీలను వేగంగా ఇతర భాషల్లో సమ్మరీగా చూపిస్తుంది.
ఆపరేటర్ మోడ్ వంటి టూల్స్ కూడా ఉన్నాయి. వినియోగదారులు ఫైల్ మేనేజ్‌మెంట్, షెడ్యూలింగ్, బ్రౌజింగ్ వంటి రోజువారీ టాస్కులకు బెస్ట్. అల్-పవర్డ్ గ్లోబల్ సెర్చ్ ఆప్షన్ కూడా ఉంది. తద్వారా మీ మొత్తం డివైజ్‌లో ఒకేసారి ఫైల్‌లు, యాప్‌లు, సెట్టింగ్‌లు మొదలైన వాటిని సెర్చ్ చేయొచ్చు.
ధర (అంచనా) :
ప్రైమ్‌బుక్ 2 నియో ప్రారంభ ధర రూ.15,990గా ఉండొచ్చు. 64GB, 128GB రెండు స్టోరేజ్ వేరియంట్లలో రానుంది. మైక్రో SDతో స్టోరేజీని 512GB వరకు పెంచుకోవచ్చు.