Apple iPhone 16e : ఆఫర్ బాగుంది బ్రో.. ఐఫోన్ 16eపై అద్భుతమైన డిస్కౌంట్.. ఇంత తక్కువ ధరకు మళ్లీ జన్మలో రాదు..!

Apple iPhone 16e : ఐఫోన్ కొంటున్నారా? కొత్త ఐఫోన్ 16e సరసమైన ధరకే సొంతం చేసుకోవచ్చు. విజయ్ సేల్స్‌‌లో ఈ ఐఫోన్ మోడల్ అతి తక్కువ ధరకే లభ్యమవుతోంది.

Apple iPhone 16e : ఆఫర్ బాగుంది బ్రో.. ఐఫోన్ 16eపై అద్భుతమైన డిస్కౌంట్.. ఇంత తక్కువ ధరకు మళ్లీ జన్మలో రాదు..!

Apple iPhone 16e with Rs 7,000 discount

Updated On : April 8, 2025 / 10:20 AM IST

Apple iPhone 16e : కొత్త ఐఫోన్ కొనేవారికి గుడ్ న్యూస్.. ఆపిల్ ఐఫోన్ 16e అతి తక్కువ ధరకే అందుబాటులో ఉంది. మీరు కొత్త ఐఫోన్ కొనేందుకు చూస్తుంటే ఇదే బెస్ట్ టైమ్. ఐఫోన్ కొనుగోలుపై మీ డబ్బు ఆదా చేసుకోవచ్చు. భారత్‌లోని పాపులర్ ఎలక్ట్రానిక్స్ రిటైలర్లలో ఒకటైన విజయ్ సేల్స్ ప్రస్తుతం ఆపిల్ ఐఫోన్ 16eపై అద్భుతమైన డీల్‌ను అందిస్తోంది.

Read Also : iPhone 16 Price : ఆపిల్ ఐఫోన్ 16పై క్రేజీ డీల్.. బ్యాంకు ఆఫర్లతో చౌకైన ధరకే కొనేసుకోండి.. ఇంతకన్నా బెటర్ డీల్ దొరకదు!

ఆసక్తిగల కొనుగోలుదారులు ఈ రిటైలర్ వెబ్‌సైట్ నుంచి నేరుగా ఈ కొత్త ఐఫోన్ మోడల్‌పై రూ.7వేలు డిస్కౌంట్ పొందవచ్చు. ఐఫోన్‌లపై డీల్స్ చాలా అరుదుగా ఉంటుంది. ముఖ్యంగా కొత్త ఐఫోన్ మోడళ్ల విషయానికి వస్తే.. ఇలాంటి సమయంలోనే ఐఫోన్ కొనేసుకోవడం బెటర్. ఈ ఆకర్షణీయమైన ఆఫర్ అసలు మిస్ చేసుకోవద్దు.. ఇంతకీ ఐఫోన్ 16e డీల్ ఎలా పొందాలో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.

ఆపిల్ ఐఫోన్ 16e డీల్ :
భారత మార్కెట్లో ఐఫోన్ 16e మోడల్ రూ.59,900 ప్రారంభ ధరకు లాంచ్ అయింది. ప్రస్తుతం విజయ్ సేల్స్ వెబ్‌సైట్‌లో ఈ స్మార్ట్‌ఫోన్ రూ.56,900కి అందుబాటులో ఉంది. రిటైలర్ ఐఫోన్ 16eపై నేరుగా రూ.3వేల తగ్గింపును అందిస్తోంది. ధర ఇంకా తగ్గాలంటే.. మీరు బ్యాంక్ ఆఫర్‌లతో తక్కువ ధరకే ఐఫోన్ కొనేసుకోవచ్చు.

ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డ్, AXIS బ్యాంక్ క్రెడిట్ కార్డ్, కోటాక్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ లావాదేవీలపై అదనంగా రూ. 4వేలు డిస్కౌంట్ పొందవచ్చు. ప్రత్యామ్నాయంగా, HDFC బ్యాంక్ క్రెడిట్/డెబిట్ కార్డ్ హోల్డర్లు EMI లావాదేవీలపై రూ. 3,500 డిస్కౌంట్ పొందవచ్చు.

ఐఫోన్ 16e స్పెసిఫికేషన్లు, ఫీచర్లు :
ఆపిల్ ఐఫోన్ 16e ఫోన్ 60Hz రిఫ్రెష్ రేట్‌తో 6.1-అంగుళాల OLED డిస్‌ప్లేను కలిగి ఉంది. అల్యూమినియం డిజైన్, ఫేస్ ఐడీ సపోర్ట్ ఉంది. హుడ్ కింద, ఈ హ్యాండ్‌సెట్ ఆపిల్ A18 చిప్‌సెట్ ద్వారా పవర్ పొందుతుంది. 8GB ర్యామ్ కలిగి ఉంటుంది. ఆపిల్ ఇంటెలిజెన్స్ ఫీచర్లకు కూడా సపోర్టు ఇస్తుంది.

Read Also : Google Pixel 10 Launch : పిక్సెల్ ఫోన్లు అంటే మజాకా.. గూగుల్ పిక్సెల్ 10 సిరీస్ భలే ఉందిగా.. లాంచ్‌‌కు ముందే అన్నీ లీక్..!

ఫోటోగ్రఫీ విషయానికి వస్తే.. ఐఫోన్ 16e 2x ఆప్టికల్ జూమ్‌తో కూడిన 48MP మెయిన్ కెమెరా, 12MP ఫ్రంట్ కెమెరాను కలిగి ఉంది. ఇంకా, ఈ ఐఫోన్ ఇమేజ్ క్లీనప్ టూల్, ఇమేజ్ ప్లేగ్రౌండ్, ChatGPT ఇంటిగ్రేషన్, రైటింగ్ టూల్స్ వంటి ఏఐ టూల్స్‌తో వస్తుంది. అలాగే, ఐఫోన్ 16e USB-C పోర్ట్‌తో వస్తుంది. IP68 సర్టిఫికేట్ కూడా పొందింది.