iPhone 16 Price : ఆపిల్ ఐఫోన్ 16పై క్రేజీ డీల్.. బ్యాంకు ఆఫర్లతో చౌకైన ధరకే కొనేసుకోండి.. ఇంతకన్నా బెటర్ డీల్ దొరకదు!
Apple iPhone 16 Price : ఆపిల్ ఐఫోన్ కొంటున్నారా? విజయ్ సేల్స్‌లో అత్యంత సరసమైన ధరకే ఐఫోన్ 16 సొంతం చేసుకోవచ్చు. ఏయే ఆఫర్లు, డిస్కౌంట్లతో ఈ డీల్ ఎలా పొందాలో ఇప్పుడు చూద్దాం..

iPhone 16 Price
iPhone 16 Price : ఆపిల్ అభిమానులకు అదిరిపోయే న్యూస్.. మీరు కొత్త ఐఫోన్ కొనేందుకు ప్లాన్ చేస్తుంటే ఇదే అద్భుతమైన అవకాశం. ఐఫోన్ 16 ధర భారీగా తగ్గింది. మీ పాత ఫోన్ అప్‌గ్రేడ్ చేసుకునేందుకు ఇంతకన్నా బెటర్ టైమ్ ఉండదు. ఐఫోన్‌కు మారాలనుకునే వారు తప్పకుండా ఈ డీల్ సొంతం చేసుకోవచ్చు. బ్యాంక్ ఆఫర్లతో ఐఫోన్ 16 అతి తక్కువ ధరకే లభ్యమవుతుంది.
ప్రస్తుతం విజయ్ సేల్స్‌లో ఈ ఐఫోన్ 16 ధరపై రూ.12,400 వరకు భారీ తగ్గింపుతో అందుబాటులో ఉంది. వాస్తవానికి ఈ ఐఫోన్ 16 అసలు ధర రూ.79,900 వద్ద లాంచ్ అయింది. సూపర్ రెటినా డిస్‌ప్లే, డ్యూయల్ కెమెరా సెటప్, కొత్త డిజైన్, డైనమిక్ ఐలాండ్, టైప్-C పోర్ట్, ఆపిల్ ఇంటెలిజెన్స్ ఫీచర్‌లను పొందవచ్చు. మీరు కొత్త ఐఫోన్ కొనేముందు విజయ్ సేల్స్‌లో ఆపిల్ ఐఫోన్ 16 ధర డీల్ ఎలా ఓసారి తెలుసుకోండి.
విజయ్ సేల్స్‌లో ఆపిల్ ఐఫోన్ 16 ధర :
ప్రస్తుతం విజయ్ సేల్స్ ప్లాట్‌ఫామ్‌లో ఆపిల్ ఐఫోన్ 16 ధర రూ.79,900 నుంచి రూ.71,500కి తగ్గింది. Axis Bank, ICICI, HDFC లేదా Kotak బ్యాంక్ కార్డులతో సహా ఎంపిక చేసిన బ్యాంక్ కార్డులపై కస్టమర్లు అదనంగా రూ.4వేలు డిస్కౌంట్ పొందవచ్చు.
దాంతో ఐఫోన్ 15 ధర ఏకంగా రూ.68వేల కన్నా తక్కువకు లభిస్తుంది. ఆసక్తిగల కస్టమర్లు 24 నెలల పాటు నెలకు రూ.3,467 నుంచి ప్రారంభమయ్యే ఈఎంఐ ఆప్షన్ కూడా పొందవచ్చు. కస్టమర్లు తమ పాత ఫోన్ ఎక్స్ఛేంజ్ చేసుకుని ధరను తగ్గించుకోవచ్చు. ఎక్స్చేంజ్ వాల్యూ పాత ఫోన్ వర్కింగ్ కండిషన్, మోడల్‌పై ఆధారపడి ఉంటుందని గుర్తించుకోవాలి.
ఆపిల్ ఐఫోన్ 16 స్పెసిఫికేషన్లు :
ఐఫోన్ 16 6.1-అంగుళాల సూపర్ రెటినా (XDR) ఓఎల్ఈడీ డిస్‌ప్లేను కలిగి ఉంది. 2,000 నిట్స్ గరిష్ట ప్రకాశంతో వస్తుంది. సూర్యకాంతిలో డిస్‌ప్లే స్పష్టంగా కనిపిస్తుంది. ఆపిల్ కొత్త A18 బయోనిక్ చిప్‌సెట్ ద్వారా పవర్ పొందుతుంది. ఆపిల్ ఇంటెలిజెన్స్ ఫీచర్లు, డిమాండ్ ఆప్షన్లను అందిస్తోంది. ఈ ఫోన్ 4,200mAh బ్యాటరీ పవర్‌తో వస్తుంది. సింగిల్ ఛార్జ్‌పై 30 గంటల వరకు వీడియో ప్లేబ్యాక్‌ను అందిస్తుంది.
ఫోటోగ్రఫీ విషయానికి వస్తే.. 2x ఆప్టికల్ జూమ్‌తో కూడిన 48MP ఫ్యూజన్ మెయిన్ కెమెరా, మాక్రో, ఆటోఫోకస్‌తో కూడిన ప్రత్యేకమైన 12MP అల్ట్రా-వైడ్ లెన్స్‌ను కలిగి ఉంది. 12MP ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా నైట్ మోడ్, 4K వీడియో రికార్డింగ్, డాల్బీ విజన్ HDR సపోర్టు ఇస్తుంది. ఈ ఐఫోన్ IP68 ప్రమాణాలకు డస్ట్, వాటర్ నిరోధకతను కలిగి ఉంది. Wi-Fi 6E, బ్లూటూత్ 5.3 సపోర్టు ఇస్తుంది. స్పీడ్ డేటా ట్రాన్స్‌ఫర్ కోసం USB 3.2 సపోర్టుతో USB-C కలిగి ఉంది.