OnePlus Red Rush Days Sale : వన్‌ప్లస్ బిగ్ సేల్.. ఈ స్మార్ట్‌ఫోన్లపై మైండ్ బ్లోయింగ్ డిస్కౌంట్లు.. చౌకైన ధరకే ఇలా పొందొచ్చు!
OnePlus Red Rush Days Sale : వన్‌ప్లస్ రెడ్ రష్ డేస్ సేల్ సందర్భంగా వన్‌ప్లస్ బ్రాండ్ స్మార్ట్ ఫోన్లపై అద్భుతమైన డిస్కౌంట్లను ఆఫర్ చేస్తోంది. ఈ డీల్స్ ద్వారా అతి చౌకైన ధరకే మీకు నచ్చిన ఫోన్ సొంతం చేసుకోవచ్చు.

OnePlus Red Rush Days Sale
OnePlus Red Rush Days Sale : కొత్త స్మార్ట్‌ఫోన్ కోసం చూస్తున్నారా? అయితే, మీకో గుడ్ న్యూస్.. చైనీస్ ఎలక్ట్రానిక్స్ తయారీదారు వన్‌ప్లస్ రెడ్ రష్ డేస్ సేల్‌ను భారత మార్కెట్లో అధికారికంగా ప్రకటించింది. వినియోగదారులు ఇప్పుడు OnePlus 13 సిరీస్, OnePlus 12 సిరీస్, OnePlus Nord సిరీస్‌లపై భారీ డిస్కౌంట్లను పొందవచ్చు.
ఈ డిస్కౌంట్లలో అద్భుతమైన డిస్కౌంట్లు, ప్రత్యేకమైన బ్యాంక్ ఆఫర్లు, EMI ఆప్షన్లు కూడా ఉన్నాయి. కస్టమర్లు ఈ బెనిఫిట్స్ కోసం వన్‌ప్లస్ అధికారిక వెబ్‌సైట్, స్టోర్‌లు, క్రోనా, విజయ్ సేల్స్ వంటి రిటైల్ పార్టనర్ల నుంచి పొందవచ్చు. వన్‌ప్లస్ స్మార్ట్‌ఫోన్‌పై డీల్స్ ఎలా ఉన్నాయో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.
వన్‌ప్లస్ 13 సిరీస్ :
వన్‌ప్లస్ 13 కొనుగోలుదారులు రూ.5వేల ఇన్‌స్టంట్ డిస్కౌంట్‌తో పాటు ఎక్స్ఛేంజ్, నో-కాస్ట్ ఈఎంఐ ఆప్షన్లను పొందవచ్చు. మరోవైపు, వన్‌ప్లస్ 13R కొనుగోలుదారులు రూ.3వేల డిస్కౌంట్, 16GB+512GB వేరియంట్‌పై అదనంగా రూ.2వేలు తగ్గింపు పొందవచ్చు. వన్‌ప్లస్ 13పై రూ.7వేల ఎక్స్ఛేంజ్ బోనస్‌ను పొందవచ్చు. అలాగే, వన్‌ప్లస్ 13Rపై రూ.4వేల ఎక్స్ఛేంజ్ బోనస్‌ను పొందవచ్చు.
వన్‌ప్లస్ 12 సిరీస్ :
వన్‌ప్లస్ 12 సిరీస్ కొనుగోలుదారులు రూ.13వేల వరకు ధర తగ్గింపుతో పాటు రూ.6వేల బ్యాంక్ డిస్కౌంట్ పొందవచ్చు. కస్టమర్లు 6 నెలల నో-కాస్ట్ EMI ఆప్షన్ కూడా పొందవచ్చు.
వన్‌ప్లస్ నార్డ్ 4 :
ఈ పాపులర్ మిడ్-రేంజ్ స్మార్ట్‌ఫోన్‌పై రూ.4,500 బ్యాంక్ డిస్కౌంట్‌తో పాటు అదనంగా రూ.500 తగ్గింపు పొందవచ్చు. ఆసక్తి గల కస్టమర్లు 6 నెలల వరకు నో-కాస్ట్ EMI కూడా పొందవచ్చు.
వన్‌ప్లస్ నార్డ్ CE4, CE4 లైట్ :
వన్‌ప్లస్ నార్డ్ CE4, వన్‌ప్లస్ నార్డ్ CE4 లైట్ రెండింటిపై కూడా భారీ డిస్కౌంట్లను అందిస్తోంది. వన్‌ప్లస్ నార్డ్ CE4 కొనుగోలుదారులు రూ.2వేల బ్యాంక్ డిస్కౌంట్‌తో పాటు అదనంగా రూ.1,000 తగ్గింపును పొందవచ్చు. వన్‌ప్లస్ నార్డ్ CE4 లైట్ ధర రూ.1,500 బ్యాంక్ డిస్కౌంట్‌తో కొనుగోలు చేయవచ్చు. ఈ రెండు ఫోన్లకు 6 నెలల నో-కాస్ట్ ఈఎంఐ ఆప్షన్లు కూడా పొందవచ్చు.
వన్‌ప్లస్ టాబ్లెట్‌లు :
వన్‌ప్లస్ ప్యాడ్ 2పై రూ.2వేల బ్యాంక్ డిస్కౌంట్‌తో పాటు రూ.5వేల ఎక్స్ఛేంజ్ బోనస్ కూడా లభిస్తుంది. విద్యార్థులు అదనంగా రూ.వెయ్యి డిస్కౌంట్ కూడా పొందవచ్చు. కస్టమర్ 9 నెలల నో-కాస్ట్ ఈఎంఐ ఆప్షన్ కూడా పొందవచ్చు.
వన్‌ప్లస్ ప్యాడ్ గో :
వన్‌ప్లస్ ప్యాడ్ గో రూ.2వేల బ్యాంక్ డిస్కౌంట్ అదనంగా రూ.1,000 డిస్కౌంట్ లభిస్తోంది. కస్టమర్లు 6 నెలల వరకు నో-కాస్ట్ ఈఎంఐ ఆప్షన్ ధర రూ.1,000 స్టూడెంట్ డిస్కౌంట్ కూడా పొందవచ్చు.