Jio Unlimited Offer : జియో అన్‌లిమిటెడ్ ఆఫర్.. ఐపీఎల్ చూసేవాళ్లకు పండగే.. ‘జియోహాట్‌స్టార్’ 90 రోజులు ఫ్రీగా చూడొచ్చు!
Jio Unlimited Offer : ఐపీఎల్ అభిమానులు, జియో కస్టమర్లు రూ. 299 లేదా అంతకంటే ఎక్కువ ప్లాన్‌తో రీఛార్జ్ చేసుకోవచ్చు. జియోహాట్‌స్టార్‌కు 90 రోజుల ఫ్రీ యాక్సెస్ పొందవచ్చు.

Jio Unlimited Offer
Jio Unlimited Offer : జియో యూజర్లకు గుడ్ న్యూస్.. గత మార్చిలో ఎంపిక చేసిన ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్లపై రిలయన్స్ జియో కొత్త బెనిఫిట్స్ అందిస్తోంది. ఐపీఎల్ క్రికెట్ అభిమానులు 90 రోజుల వరకు జియోహాట్‌స్టార్ ఉచితంగా పొందవచ్చు.
టెలికాం ఆపరేటర్ ఇప్పుడు ఈ ఆఫర్ తేదీని ఏప్రిల్ 15వరకు పొడిగించింది. అన్‌లిమిటెడ్ ఆఫర్‌తో కస్టమర్‌లు రూ. 299 అంతకంటే ఎక్కువ మొబైల్ రీఛార్జ్‌లతో జియోహాట్‌స్టార్‌కు ఫ్రీ సబ్‌స్ర్కిప్షన్ పొందవచ్చు. అలాగే, జియో ఎయిర్‌ఫైబర్, వైర్‌లెస్ బ్రాడ్‌బ్యాండ్ సర్వీస్, జియోఫైబర్ ఫ్రీ ట్రయల్‌ను పొందవచ్చు.
జియో అన్‌లిమిటెడ్ ఆఫర్ పొడిగింపు :
జియో ప్రకారం.. కస్టమర్లు ఏప్రిల్ 15 వరకు అన్‌లిమిటెడ్ ఆఫర్‌ను పొందవచ్చు. వాస్తవానికి, ఈ జియో ఆఫర్ మార్చి 17నే ప్రవేశపెట్టగా.. మార్చి 31 వరకు మొబైల్ రీఛార్జ్‌లకు వ్యాలిడిటీ ఉంది. అయితే,
ప్రస్తుత, కొత్త జియో కస్టమర్లు రూ. 299 లేదా అంతకంటే ఎక్కువ విలువైన ప్లాన్‌తో రీఛార్జ్ చేసుకోవచ్చు. తద్వారా జియోహాట్‌స్టార్‌కు 90 రోజుల ఫ్రీ యాక్సెస్‌ను పొందవచ్చు. మొబైల్ డివైజ్‌లు, స్మార్ట్‌టీవీలలో 4K స్ట్రీమింగ్‌ను యాక్సస్ చేయొచ్చు.
జియోలో ఇప్పటికే ఉన్న యూజర్లు రూ. 299 ప్లాన్‌తో రీఛార్జ్ చేసుకోవచ్చు. అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్, రోజుకు 1.5GB డేటా, రోజుకు 100 SMS అందిస్తుంది. ఇందులో జియోక్లౌడ్, జియోటీవీ వంటి యాప్స్ కూడా యాక్సెస్ పొందవచ్చు.
జియో నెట్‌వర్క్‌కు మారాలనుకునే వినియోగదారులు రూ. 299 లేదా అంతకంటే ఎక్కువ ప్లాన్‌తో కొత్త సిమ్ ద్వారా మరిన్ని బెనిఫిట్స్ పొందవచ్చు. అన్‌లిమిటెడ్ 5G ఇంటర్నెట్ కోసం రోజుకు 2GB లేదా అంతకంటే ఎక్కువ డేటా ప్లాన్‌తో రీఛార్జ్ చేసుకోవాలి.
స్ట్రీమింగ్ సర్వీస్‌కు సబ్‌స్క్రిప్షన్‌తో పాటు జియో 50 రోజుల పాటు జియో ఫైబర్ లేదా జియో ఎయిర్ ఫైబర్ ట్రయల్ కూడా అందిస్తోంది. దాంతో కస్టమర్లు మరిన్ని బెనిఫిట్స్ పొందవచ్చు. Wi-Fi సర్వీస్ ఆఫర్‌లో అన్‌లిమిటెడ్ Wi-Fi డేటా, 800+ ఓటీటీ ఛానెల్స్, 11 కన్నా ఎక్కువ ఓటీటీ యాప్స్ ఉన్నాయి.
మార్చి 17కి ముందు రీఛార్జ్ చేసుకున్న యూజర్లతో పాటు ప్రస్తుతం యాక్టివ్ బేస్ ప్లాన్ కస్టమర్లు రూ. 100 ప్యాక్‌ను ఎంచుకోవచ్చు. వీరికి కూడా అదే బెనిఫిట్స్ వస్తాయి. ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్ కోసం మొత్తం ధర చెల్లించాల్సిన అవసరం లేదు.