iPhone 17 Pro : బిగ్ అప్‌డేట్.. ఆపిల్ ఐఫోన్ 17ప్రో వచ్చేస్తోందోచ్.. కానీ, ఈ డిజైన్ ఉండదట.. కెమెరా ఫీచర్లు ఇవేనా?!
Apple iPhone 17 Pro : కొత్త ఆపిల్ ఐఫోన్ 17ప్రో గురించి బిగ్ అప్‌డేట్ వచ్చేసింది. డ్యూయల్ టోన్ డిజైన్ ఉంటుందో లేదా అనేదానిపై అనేక ఊహాగానాలు వినిపిస్తున్నాయి. పూర్తి వివరాలను ఓసారి లుక్కేయండి.

iPhone 17 Pro
Apple iPhone 17 Pro : కొత్త ఆపిల్ ఐఫోన్ కోసం చూస్తున్నారా? అతి త్వరలో ఆపిల్ ఐఫోన్ 17ప్రో రాబోతుంది. ఎప్పటినుంచో ఈ ఐఫోన్ 17 ప్రో గురించి ఆన్‌లైన్‌లో అనేక పుకార్లు వస్తున్నాయి. అందులో ప్రధానంగా డిజైన్ గురించి ఎక్కువగా వినిపిస్తోంది. ముఖ్యంగా ఆపిల్ డ్యూయల్-టోన్ బ్యాక్‌ను ప్రవేశపెట్టే అవకాశం ఉందంటూ ఊహాగానాలు వినిపించాయి.
అయితే, బ్లూమ్‌బెర్గ్ మార్క్ గుర్మాన్ ప్రకారం.. ఐఫోన్ 17 ప్రో ఫ్రంట్ సైడ్ చూస్తే ఐఫోన్ 16 ప్రో మాదిరిగా కనిపిస్తుంది. 2020లో ఐఫోన్ 12 లాంచ్ అయినప్పటి నుంచి ఆపిల్ ప్రో మోడళ్ల మొత్తం డిజైన్‌ను అలానే ఉంచింది. ఐఫోన్ 13 ప్రో, 14 ప్రో ఒకే డిజైన్ కలిగి ఉన్నాయి.
అయితే, ఐఫోన్ 15 ప్రో టైటానియం బాడీ స్థానంలో అల్యూమినియం బాడీకి మారింది. ఐఫోన్ 16 ప్రోలో ఆపిల్ పెద్దగా మార్పులేం చేయలేదు. కెమెరా కంట్రోల్ బటన్ సహా మరికొన్ని కొత్త కలర్ ఆప్షన్లను చేర్చింది.
ఐఫోన్ 17 ప్రో, ఐఫోన్ 17 ఎయిర్ అతిపెద్ద డిజైన్ అప్‌డేట్‌తో రానుందని పుకార్లు ఉన్నాయి. గుర్మాన్ ప్రకారం.. ఐఫోన్ ఫ్రంట్ సైడ్ గత వెర్షన్ల మాదిరిగానే ఉండే అవకాశం ఉంది. అతిపెద్ద మార్పు బ్యాక్ కెమెరా ప్రాంతంలో కనిపిస్తోంది. ఇటీవలి లీక్‌లు, ఆన్‌లైన్ రెండర్‌ల ఆధారంగా ఐఫోన్ 17 ప్రో ఇప్పటికీ ట్రిపుల్-కెమెరా సెటప్‌ను కలిగి ఉండొచ్చు.
Read Also : Summer AC Sales : సమ్మర్ బిగ్ డిస్కౌంట్.. టాప్ 2.5 టన్ స్ప్లిట్ ఏసీలు ఇవే.. తగ్గింపు ధరకే ఎలా కొనాలంటే?
ఆపిల్ ఐఫోన్ 11 ప్రో తర్వాత కెమెరాలు ఇప్పుడు ఫోన్ బ్యాక్ సైడ్ వైడ్ ప్యానెల్‌పై కనిపిస్తాయి. కొన్ని రెండర్‌లు టూ-టోన్ లుక్ మాదిరిగా ఉండొచ్చు. సిల్వర్ బాడీపై బ్లాక్ కెమెరా సెక్షన్ ఉంటుంది. కానీ, ఆ ఫొటోలు రియల్ కాదని గుర్మాన్ తెలిపారు. ఐఫోన్ 17 ప్రో బ్యాక్ సైడ్ ఒకే కలర్ ఉండే అవకాశం ఉంది. డ్యూయల్-టోన్ డిజైన్ ఉండదని అంటున్నారు.