Nothing Phone 3 : భారీ ఏఐ అప్‌గ్రేడ్స్‌తో కొత్త నథింగ్ ఫోన్ 3 వచ్చేస్తోంది.. ఫీచర్లు చూస్తే ఫిదానే.. ధర, లాంచ్ ఎప్పుడంటే?
Nothing Phone 3 Launch : నథింగ్ నుంచి సరికొత్త నథింగ్ ఫోన్ 3 లాంచ్ కానుంది. ఈ ఫోన్ ఫీచర్లు, ధర, లాంచ్ తేదీకి సంబంధించి అనేక వివరాలు లీక్ అయ్యాయి. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

Nothing Phone 3 Launch
Nothing Phone 3 Launch : కొత్త నథింగ్ ఫోన్ కోసం చూస్తున్నారా? ప్రపంచ మార్కెట్లలో మరో సరికొత్త నథింగ్ ఫోన్ రాబోతుంది. ఇప్పటికే నథింగ్ ఫోన్ 3a ఫోన్, నథింగ్ 3a ప్రో ఫోన్లు విశేష ఆదరణ పొందాయి. కార్ల్ పీ నేతృత్వంలోని ఈ బ్రాండ్ త్వరలో మరో ఫ్లాగ్‌షిప్ ఫోన్ నథింగ్ ఫోన్ 3 ప్రవేశపెట్టనుంది.
రాబోయే ఈ నథింగ్ ఫోన్ 3 మోడల్ కెమెరా, పర్ఫార్మెన్స్, డిస్‌ప్లే మార్పులతో పాటు కొన్ని భారీ ఏఐ అప్‌గ్రేడ్‌లతో రానుంది. ఈ నథింగ్ ఫోన్ సిగ్నేచర్ గ్లిఫ్ డిజైన్‌ను కలిగి ఉంటుందని, ఎసెన్షియల్ స్పేస్ ఫీచర్‌తో వస్తుందని అంచనా వేస్తున్నారు.
నథింగ్ ఫోన్ 3 కచ్చితమైన వివరాలను కంపెనీ రివీల్ చేయలేదు. కానీ, లీక్‌ల ప్రకారం.. రాబోయే నథింగ్ ఫోన్ 3 లాంచ్, స్పెసిఫికేషన్లు, ఫీచర్లు, ధరకు సంబంధించి అనేక వివరాలు బయటకు వచ్చాయి. అవేంటో ఓసారి లుక్కేయండి.
నథింగ్ ఫోన్ 3 లాంచ్ టైమ్‌లైన్ :
నథింగ్ ఫోన్ 3 కచ్చితమైన లాంచ్ తేదీ ఇంకా రివీల్ చేయలేదు. టిప్‌స్టర్ అభిషేక్ యాదవ్ ప్రకారం.. నథింగ్ ఫోన్ 3 జూలై 2025లో లాంచ్ కావచ్చు. ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ ఫ్లాగ్‌షిప్ ఫోన్ రెండేళ్ల తర్వాత లాంచ్ అవుతోంది. ఇందులో ఒక మెయిన్ ఏఐ ఓవర్‌హాల్ ఉంటుందని భావిస్తున్నారు.
నథింగ్ ఫోన్ 3 కెమెరా, ఫీచర్లు, స్పెసిఫికేషన్లు :
నథింగ్ ఫోన్ 3 మోడల్ 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.77-అంగుళాల 1.5K అమోల్డ్ ఎల్టీపీఓ ప్యానెల్, 3,000 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌ను పొందకపోవచ్చు. ఈ నథింగ్ ఫోన్ స్నాప్‌డ్రాగన్ 8 జనరేషన్ 3 చిప్‌సెట్ నుంచి పవర్ పొందవచ్చు. 12GB ర్యామ్, 512GB స్టోరేజీ వరకు పొందవచ్చు. ఈ నథింగ్ ఫోన్ 50W వైర్డు ఫాస్ట్ ఛార్జింగ్, 20W వైర్‌లెస్ ఛార్జింగ్‌తో 5,000 లేదా 5,300mAh బ్యాటరీని కలిగి ఉంటుంది.
కెమెరా విషయానికొస్తే.. నథింగ్ ఫోన్ 3లో 50MP ప్రైమరీ షూటర్, 50MP అల్ట్రావైడ్ లెన్స్, 50MP ఆప్టికల్ జూమ్‌తో సహా ట్రిపుల్ కెమెరా సెటప్ ఉండవచ్చు. ఫ్రంట్ సైడ్ స్మార్ట్‌ఫోన్ 32MP ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాను అందించవచ్చు.
Read Also : iPhones : ఆపిల్ ప్లాన్ అదిరింది.. 3 రోజుల్లోనే 5 విమానాల్లో అమెరికాకు ఐఫోన్లు ఎలా ఎగిరివెళ్లాయో తెలుసా?
ఫీచర్ల విషయానికొస్తే.. నథింగ్ ఫోన్ 3లో సర్కిల్ టు సెర్చ్, స్మార్ట్ డ్రాయర్, పర్సనలైజ్డ్ ఏఐ అసిస్టెంట్, AI-డ్రైవెన్ ఆటోమేటిక్ ట్రాన్స్క్రిప్షన్ ఉంటాయి. ఎసెన్షియల్ స్పేస్ ఫీచర్‌ను కూడా ఉంటుందని భావిస్తున్నారు.
భారత్‌లో నథింగ్ ఫోన్ 3 ధర (అంచనా) :
నథింగ్ ఫోన్ 3 ధర రూ.45వేల నుంచి రూ.50వేల మధ్య ఉండవచ్చు. గత నథింగ్ ఫోన్ 2 రూ.44,999కి మార్కెట్లోకి ప్రవేశపెట్టింది.