iPhones : ఆపిల్ ప్లాన్ అదిరింది.. 3 రోజుల్లోనే 5 విమానాల్లో అమెరికాకు ఐఫోన్లు ఎలా ఎగిరివెళ్లాయో తెలుసా?
iPhones : ఏప్రిల్ 9 నుంచి కొత్త దిగుమతి సుంకం అమల్లోకి రానుంది. ఈ సుంకాల భారం నుంచి తప్పించుకునేందుకు ఆపిల్ కంపెనీ భారత్ నుంచి అమెరికాకు 5 విమానాల్లో నిండా ఐఫోన్లు తరలించింది

iPhones
iPhones : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కొత్త దిగుమతి సుంకాలు ఏప్రిల్ 9 నుంచి అమల్లోకి రానున్నాయి. ఈ నేపథ్యంలో అమెరికాలో ఆపిల్ ఐఫోన్లు భారీ ఖరీదైనవిగా మారనున్నాయి. ఐఫోన్ ధరల పెరుగుదలను తాత్కాలికంగా నివారించేందుకు ఐఫోన్ తయారీదారు ఆపిల్ ముందు జాగ్రత్త చర్యలు చేపట్టింది.
భారత్ నుంచి అమెరికాకు ఏకంగా 5 విమానాల్లో ఐఫోన్లను ఫుల్‌గా లోడ్ చేసి మరి పంపేసింది. ఐఫోన్లతో పాటు ఇతర ఆపిల్ ప్రొడక్టులను కూడా ప్యాక్ చేసి పంపింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్‌పై టారిఫ్స్ విధించనున్న నేపథ్యంలో ఆపిల్ ఈ దిశగా నిర్ణయం తీసుకుంది. భారత్ నుంచి కేవలం 3 రోజుల్లోనే, 5 కార్గో విమానాల్లో ఐఫోన్లు, ఇతర ఆపిల్ ప్రొడక్టులను అమెరికాకు తరలించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.
Read Also : Google Pixel 9 : కొత్త ఫోన్ కావాలా? ఈ గూగుల్ పిక్సెల్ 9పై ఏకంగా రూ.12వేలు తగ్గింపు.. డోంట్ మిస్!
ట్రంప్ టారిఫ్స్ భారత్‌పై 26శాతం, చైనాపై 52శాతం, తైవాన్‌పై 32శాతం సుంకాలు విధించారు. ఐఫోన్ అమెరికన్ కంపెనీ అయినప్పటికీ.. చాలా ఐఫోన్లు, వాటి స్పేర్ పార్ట్స్ భారత్, తైవాన్, చైనాలలో తయారు అవుతున్నాయి. అందువల్ల, ఈ 3 దేశాల నుంచి ఎగుమతి అయ్యే ఐఫోన్‌లు ఖరీదైనవిగా మారనున్నాయి.
ప్రస్తుతానికి, ఈ ధరల పెరుగుదలను నియంత్రించేందుకు ఆపిల్ భారత్‌లో తయారైన ఐఫోన్లను అమెరికాకు 5 విమానాల్లో లోడ్ చేసి పంపింది. ఈ ఐఫోన్లలన్నింటిని అమెరికాలోని ఒక వేర్ హౌస్‌లో స్టోర్ చేస్తారు. ఏప్రిల్ 9వ తేదీకి ముందు షిప్ చేసిన ఆపిల్ అన్ని ప్రొడక్టులపై పాత పన్ను మాత్రమే వర్తిస్తుంది. ప్రస్తుతానికి కొత్త పన్నును తప్పించుకోవచ్చని ఆపిల్ భావిస్తోంది.
ఐఫోన్లను స్టాక్‌ఫిల్‌తో ఆపిల్‌కు లాభమేంటి? :
ఆపిల్ ప్రస్తుత ఐఫోన్ ధరలను తాత్కాలికంగా కొనసాగించడానికి వీలు కల్పిస్తాయని నివేదిక చెబుతోంది. తక్కువ సుంకంతో అమెరికా చేరిన ఐఫోన్లపై పన్ను రేట్లు చాలా తక్కువగా ఉంటుంది. కొత్త షిప్‌మెంట్‌లకు చెల్లించాల్సినంతగా పన్ను రేట్లను తప్పించుకోవచ్చు అనమాట. ఆపిల్ యూఎస్ వేర్‌హౌస్‌లలో రాబోయే చాలా నెలల పాటు ఐఫోన్లు స్టోర్ చేసి ఉంటాయని సమాచారం.
అమెరికా మార్కెట్‌కు మాత్రమే కాదు.. భారత్ సహా కీలకమైన ప్రపంచ ప్రాంతాలలో ఇలాంటి చర్యలే తీసుకోవాల్సి ఉంటుంది. ఆపిల్ తయారీ ప్రదేశాలలో వివిధ టారిఫ్ విధానాలు ఎలా ప్రభావితం చేస్తాయో కూడా కంపెనీ విశ్లేషిస్తోంది. అమెరికాలో ఆపిల్ ఉత్పత్తులకు కీలకమైన మార్కెట్‌గా ఉంది. పెరిగిన ఖర్చుల భారం వినియోగదారులపై పడకుండా ఉండేందుకు ఆపిల్ ఈ దిశగా ప్రయత్నిస్తోంది.
ఐఫోన్ తయారీకి కీలక స్థానంగా భారత్ :
ట్రంప్ టారిఫ్స్ ఏప్రిల్ 9 నుంచి అమల్లోకి రానున్నాయి. భారత్‌పై 26శాతం పరస్పర సుంకాలను కూడా ప్రకటించారు. ఆపిల్ తయారీ వ్యూహాన్ని తీవ్రంగా ప్రభావితం చేయనుంది. ఆపిల్ కంపెనీ చైనా నుంచి ఎక్కువ ఐఫోన్ల తయారీని భారత్‌కు షిప్ట్ చేస్తోంది. ఈ క్రమంలో భారత్ ఆపిల్ ప్రపంచ ఉత్పత్తి నెట్‌వర్క్‌లో ముఖ్యమైన పాత్ర పోషించే అవకాశం ఉంది.
ప్రస్తుతం భారత మార్కెట్లో ఐఫోన్, ఎయిర్‌పాడ్ ఉత్పత్తిపై దృష్టి సారించగా సుంకాల నుంచి ఆపిల్ ప్రయోజనం పొందనుంది. భారతీయ ఎగుమతులు చైనా వస్తువులపై విధించే 54శాతంతో పోలిస్తే.. అమెరికాకు 26శాతం పరస్పర సుంకాన్ని ఎదుర్కొంటున్నాయి.
ఈ వ్యత్యాసంతో ఆపిల్ భారత్‌లోనే తయారీ వేగవంతంగా సురక్షితంగా ఉంటుందని భావిస్తోంది. భారత్ అమెరికాకు దాదాపు 9 బిలియన్ డాలర్ల స్మార్ట్‌ఫోన్ ఎగుమతులను చేస్తోంది. ఇందులో ఆపిల్ నుంచే ఎక్కువ భాగాన్ని కలిగి ఉంది. అయినప్పటికీ, ప్రొడక్టుల మార్పులు వివిధ దేశాలతో అమెరికా సుంకం నిబంధనలపై ఆధారపడి ఉంటాయి.