Saudi Arabia Visas : సౌదీ వెళ్లేవారికి బ్యాడ్ న్యూస్.. భారత్ సహా 14 దేశాల వీసాలపై తాత్కాలిక నిషేధం.. ఎందుకంటే?

Saudi Arabia Visas : 2025 హజ్ యాత్రకు ముందు భారత్ సహా 14 దేశాలకు వీసా జారీని సౌదీ అరేబియా తాత్కాలికంగా నిలిపివేసింది. ఉమ్రా, వ్యాపార, కుటుంబ వీసాలను ప్రభావితం చేయనుంది.

Saudi Arabia Visas : సౌదీ వెళ్లేవారికి బ్యాడ్ న్యూస్.. భారత్ సహా 14 దేశాల వీసాలపై తాత్కాలిక నిషేధం.. ఎందుకంటే?

Saudi Arabia Visas

Updated On : April 7, 2025 / 3:19 PM IST

Saudi Arabia Visas : సౌదీ అరేబియా వెళ్తున్నారా? మీకో బ్యాడ్ న్యూస్.. హజ్ 2025 తీర్థయాత్ర సీజన్‌కు ముందు భారత్ సహా 14 దేశాలకు వీసా జారీని సౌదీ అరేబియా తాత్కాలికంగా నిలిపివేసింది. ఇందులో ప్రత్యేకించి ఉమ్రా, బిజినెస్, ఫ్యామిలీ వీసా కేటగిరీలపై తీవ్ర ప్రభావితం చేయనుంది.

Read Also : Nothing Phone 3 : భారీ ఏఐ అప్‌గ్రేడ్స్‌తో కొత్త నథింగ్ ఫోన్ 3 వచ్చేస్తోంది.. ఫీచర్లు చూస్తే ఫిదానే.. ధర, లాంచ్ ఎప్పుడంటే?

ఈ వీసా నిషేధం వచ్చే జూన్ మధ్యకాలం వరకు అమలులో ఉంటుందని భావిస్తున్నారు. సస్పెన్షన్ ప్రభావితమైన దేశాలలో భారత్ సహా పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఈజిప్ట్, ఇండోనేషియా, ఇరాక్, నైజీరియా, జోర్డాన్, అల్జీరియా, సుడాన్, ఇథియోపియా, ట్యునీషియా, మొరాకో, యెమెన్ ఉన్నాయని ఓ నివేదిక తెలిపింది.

ఉమ్రా వీసాలు కలిగి ఉన్నవారు ఏప్రిల్ 13 వరకు సౌదీలోకి ప్రవేశించవచ్చునని అధికారులు స్పష్టం చేశారు. హజ్ సీజన్‌లో యాత్రికుల రాకపోకలను నియంత్రించడానికి, ఉల్లంఘనలను నిరోధించడానికి సౌదీ అధికారులు ఈ దిశగా నిర్ణయం తీసుకున్నారు.

హజ్ సీజన్‌లో దేశంలోకి వ్యాపార లేదా కుటుంబ వీసాలతో చట్టవిరుద్ధంగా తీర్థయాత్ర చేసిన సందర్భాలపై సౌదీ ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేసింది. ఇలాంటి అనధికార ప్రవేశాలతో రద్దీకి దారితీసింది. ఆ సమయంలో అనేక భద్రతా సవాళ్లను ఎదుర్కొంది. కొంతమంది వీసాదారులు అక్రమ ఉపాధి కోసం వలస, కార్మిక చట్టాలను ఉల్లంఘిస్తున్నట్లు అధికారులు గుర్తించారు.

ఈ ఉల్లంఘనలతో హజ్ సీజన్‌‌లో వీసా జారీపై కఠినమైన నియంత్రణ అమల్లోకి తీసుకొచ్చాయి. హజ్ సమయంలో యాత్రికుల భద్రత కోసం వీసా సస్పెన్షన్ విధించించినట్టు సౌదీ విదేశాంగ మంత్రిత్వ శాఖ పేర్కొంది.

కొత్త మార్గదర్శకాలను ఉల్లంఘించిన వారికి ఐదేళ్ల ప్రవేశ నిషేధంతో సహా జరిమానాలు విధించవచ్చు. ప్రయాణికులు నియమాలను పాటించాలని నిషేధిత కాలంలో అనధికారంగా దేశంలోకి రాకుండా ఉండాలని అధికారులు కోరారు.

యాత్రికులకు కోసం డిజిటల్ గైడ్ :
యాత్రికులకు సేవలను అందించేందుకు సౌదీ అరేబియా హజ్, ఉమ్రా మంత్రిత్వ శాఖ ఇటీవల ఉర్దూ, ఇంగ్లీష్, అరబిక్, టర్కిష్, ఇండోనేషియాతో సహా 16 భాషలలో మల్టీలాంగ్వేజీ డిజిటల్ గైడ్‌ను ప్రారంభించింది. మంత్రిత్వ శాఖ అధికారిక వెబ్‌సైట్ ద్వారా ఈ గైడ్ అందుబాటులో ఉంది.

Read Also : Summer AC Sales : సమ్మర్ బిగ్ డిస్కౌంట్.. టాప్ 2.5 టన్ స్ప్లిట్ ఏసీలు ఇవే.. తగ్గింపు ధరకే ఎలా కొనాలంటే?

యాత్రికులు ప్రయాణానికి సిద్ధం కావడానికి PDF, ఆడియో ఫార్మాట్‌లలో అవసరమైన సమాచారాన్ని అందిస్తుంది. హజ్ ఏర్పాట్ల ప్రధాన దశ ముగిసిన తర్వాత జూన్ మధ్యకాలంలో సాధారణ వీసా సేవలు తిరిగి ప్రారంభమయ్యే అవకాశం ఉంది.