Apple MacBook Air : కొత్త ల్యాప్‌టాప్ కొంటున్నారా? ఫ్లిప్‌కార్ట్‌లో భారీ తగ్గింపు ధరకే ఆపిల్ మ్యాక్‌బుక్ ఎయిర్.. ఇప్పుడే ఆర్డర్ పెట్టేసుకోండి!
Apple MacBook Air : ఫ్లిప్‌కార్ట్‌లో ఆపిల్ మ్యాక్‌బుక్ ఎయిర్ డిస్కౌంట్ ధరకే లభిస్తోంది. లాంగ్ బ్యాటరీ లైఫ్ ల్యాప్‌టాప్ తగ్గింపుతో పొందాలంటే?

Apple MacBook Air
Apple MacBook Air : ఆపిల్ లవర్స్‌కు అద్భుతమైన ఆఫర్.. ఆపిల్ మ్యాక్‌బుక్ ఎయిర్ భారీ తగ్గింపు ధరతో లభిస్తోంది. స్టూడెంట్స్, ప్రొఫెషనర్లు, కంటెంట్ క్రియేటర్లకు ఆపిల్ మ్యాక్‌బుక్ ఎయిర్ సరసమైన ధరకే లభిస్తోంది. అద్భుతమైన పర్ఫార్మెన్స్, లాంగ్ బ్యాటరీ లైఫ్ అందించే ల్యాప్‌టాప్ కోసం చూస్తుంటే ఈ మ్యాక్ ల్యాప్‌టాప్ కొనేసుకోవచ్చు.
M4 చిప్‌తో కూడిన లేటెస్ట్ మ్యాక్‌బుక్ ఎయిర్ (Apple MacBook Air) ఈ ఏడాది ప్రారంభంలో లాంచ్ అయింది. వివిధ ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ స్టోర్‌లలో అమ్మకానికి అందుబాటులో ఉంది. సరసమైన మ్యాక్‌బుక్ ఎయిర్ కోసం చూస్తుంటే ఈ డీల్ అసలు వదులుకోవద్దు.
ఫ్లిప్‌కార్ట్‌లో 13-అంగుళాల మ్యాక్‌బుక్ ఎయిర్‌ను M2 చిప్‌తో డిస్కౌంట్ ధరకు అందిస్తోంది. ఈ ల్యాప్‌టాప్ ఆపిల్ ఇన్-హౌస్ M2 చిప్‌ను లిక్విడ్ రెటినా డిస్‌ప్లే, స్లిమ్ ఫారమ్ ఫ్యాక్టర్, మాకోస్ మాంటెరీ ఫీచర్‌లతో వస్తుంది. కంప్యూటింగ్ ఎక్స్‌పీరియన్స్ అందిస్తుంది. మీరు డాక్యుమెంట్లపై వర్క్ చేస్తున్నా లేదా ఆన్‌లైన్ క్లాసులకు హాజరవుతున్నా ఫొటోలను ఎడిటింగ్ లేదా కంటెంట్‌ను స్ట్రీమింగ్ చేస్తున్నా మ్యాక్‌బుక్ ఎయిర్ M2 ల్యాప్‌టాప్ అద్భుతమైన పర్ఫార్మెన్స్ అందిస్తుంది. ఈ డీల్ ఎలా పొందాలో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..
ఫ్లిప్‌కార్ట్‌లో మ్యాక్‌బుక్ ఎయిర్‌పై భారీ డిస్కౌంట్ :
ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్ 13-అంగుళాల ఆపిల్ మ్యాక్‌బుక్ ఎయిర్ M2 (8GB ర్యామ్, 256GB SSD) ధర రూ.60,990కు లిస్ట్ అయింది. సాధారణ రిటైల్ ధర కన్నా భారీ తగ్గింపు అందిస్తోంది. అదనంగా, మీరు వివిధ బ్యాంక్ ఆఫర్లతో మరింత తగ్గింపు ధరకే పొందవచ్చు. ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ లేదా ఎస్‌బీఐ క్రెడిట్ కార్డ్ ద్వారా కొనుగోలుదారులు రూ.4వేలు క్యాష్‌బ్యాక్ పొందవచ్చు.
Read Also : OnePlus 13s : ఇది కదా డిస్కౌంట్.. వన్‌ప్లస్ 13s ఆఫర్ అదిరింది.. అమెజాన్‌లో అతి తక్కువ ధరకే.. డోంట్ మిస్!
అదేవిధంగా, యాక్సిస్ బ్యాంక్ ఫ్లిప్‌కార్ట్ డెబిట్ కార్డ్ యూజర్లు కూడా 5 శాతం క్యాష్‌బ్యాక్ పొందవచ్చు. అయితే, కొన్ని షరతులను తప్పక పాటించాలి. అంతేకాదు.. ఫ్లిప్‌కార్ట్ యూజర్లు పాత ల్యాప్‌టాప్ లేదా స్మార్ట్‌ఫోన్‌ను ఎక్స్ఛేంజ్ చేసుకుంటే రూ. 22వేల వరకు తగ్గింపు పొందవచ్చు. దాంతో ఎక్స్ఛేంజ్ బెనిఫిట్స్ కూడా పొందవచ్చు. అందుబాటులో ఉన్న అన్ని ఆఫర్ల కోసం ఫ్లిప్‌కార్ట్ వెబ్‌సైట్‌లో ఓసారి చెక్ చేయండి.
మ్యాక్‌బుక్ ఎయిర్ M2 స్పెషిఫికేషన్లు :
మ్యాక్‌బుక్ ఎయిర్ M2 ల్యాప్‌టాప్ ట్రూ టోన్ టెక్నాలజీతో 13.6-అంగుళాల లిక్విడ్ రెటినా డిస్‌ప్లే కలిగి ఉంది. వర్క్, ఎంటర్‌టైన్మెంట్ రెండింటికీ పవర్‌ఫుల్ కలర్ ఆప్షన్లను అందిస్తుంది. కేవలం 1.24 కిలోల బరువు ఉంటుంది. దాంతో ఈ ల్యాప్‌టాప్ ప్రయాణ సమాయాల్లో క్యారీ చేయడం చాలా ఈజీగా ఉంటుంది. అయితే, బ్యాటరీ లైఫ్ 15 గంటల కన్నా ఎక్కువ సమయం ఉంటుంది.
ఆపిల్ ఇన్-హౌస్ M2 చిప్ ఆధారిత ల్యాప్‌టాప్ పర్ఫార్మెన్స్ అద్భుతంగా ఉంటుంది. ఆఫీస్ వర్క్, ఆన్‌లైన్ మీటింగ్స్ నుంచి ఫొటో ఎడిటింగ్, స్ట్రీమింగ్ వరకు ఈజీగా యాక్సస్ చేయొచ్చు. మ్యాక్OS ఆపరేటింగ్ సిస్టమ్ స్టేజ్ మేనేజర్, ఐఫోన్, ఐప్యాడ్‌తో ఇంటిగ్రేషన్, మల్టీ టాస్కింగ్ వంటి ఫీచర్లతో వినియోగదారులను ఆకట్టుకుంటుంది.