Auto Payment Setup : మీ బ్యాంకు ఖాతాలో ఆటో డెబిట్ ఆన్ చేసారా? ఇవి తెలుసుకోకపోతే భారీగా నష్టపోతారు!
Auto Payment Setup : చాలా మంది తమ బిల్లులన్నింటినీ మర్చిపోకుండా పేమెంట్ చేసేందుకు ఆటో పేమెంట్ చేసుకుంటుంటారు. ఒక నిర్ణీత తేదీన ఖాతా నుంచి డబ్బు ఆటోమేటిక్‌గా కట్ అవుతుంది అనమాట.
- Sreehari A
- Updated on- April 25, 2026 / 04:05 PM IST
Auto Payment Setup
- బ్యాంకు అకౌంట్లలో నుంచి ఆటో పేమెంట్ చేస్తున్నారా?
- ఏదైనా బిల్లులు లేదా లావాదేవీలపై ఆటో పేమెంట్ సెట్ చేస్తే జాగ్రత్త
- మీ బ్యాంకు అకౌంట్ బ్యాలెన్స్ చెక్ చేస్తు ఉండాలి
Auto Payment Setup : మీరు బ్యాంకు అకౌంట్లలో ఆటో పేమెంట్ సెట్ చేసుకున్నారా? ప్రతినెలా బిల్లులు ఆటో పేమెంట్ అవుతున్నాయా? అయితే తస్మాత్ జాగ్రత్త. సాధారణంగా చాలామందికి ప్రతినెల ప్రారంభంలో భారీ మొత్తంలో ఖర్చులు ఉంటాయి.
అందులో ఈఎంఐలు, పవర్, వాటర్ బిల్లులు, OTT సబ్‌స్క్రిప్షన్‌లు, బీమా ప్రీమియంలు ఉంటాయి. ఈ బిల్లులను మిస్ కాకుండా ఈజీగా పేమెంట్ చేసేందుకు స్టాండింగ్ ఇన్‌స్ట్రక్షన్‌లు లేదా ఆటోమేటిక్ పేమెంట్‌లను ఉపయోగిస్తారు.
ఈ పద్ధతిలో ఒక నిర్ణీత తేదీన ఖాతా నుంచి డబ్బు ఆటోమేటిక్‌గా కట్ అయి పేమెంట్ అవుతుంది. మీరు ఆటోమేటిక్ పేమెంట్ లేదా స్టాండింగ్ ఇన్‌స్ట్రక్షన్‌లను వాడుతుంటే కొన్ని ముఖ్యమైన విషయాలను తప్పక గుర్తుంచుకోవాలి. దీనికి సంబంధించి పూర్తి విషయాలపై ఓసారి లుక్కేయండి..
పూర్తి సమాచారాన్ని జాగ్రత్తగా చదవండి :
ఏ విధమైన స్టాండింగ్ ఇన్‌స్ట్రక్షన్‌ను ఏర్పాటు చేసేటప్పుడు మొత్తం సమాచారాన్ని జాగ్రత్తగా చదవడం, తొందరపడకుండా ఉండటం ముఖ్యం. మీరు ఎంత మొత్తానికి స్టాండింగ్ ఇన్‌స్ట్రక్షన్ సెట్ చేస్తున్నారో ఎంత మొత్తంలో కట్ అవుతుందో జాగ్రత్తగా చెక్ చేయండి.
ముఖ్యంగా క్రెడిట్ కార్డ్ లేదా విద్యుత్ బిల్లుల వంటి సందర్భాలలో మొత్తం ప్రతిసారీ మారే అవకాశం ఉంది. అందుకే ఒక అంచనా ఉండటం ముఖ్యం. చిన్న జాగ్రత్త కూడా భవిష్యత్తులో ఇబ్బందులు రాకుండా అడ్డుకుంటుంది.
సేఫ్ ప్లాట్‌ఫామ్‌ను వాడండి :
స్టాండింగ్ ఇన్‌స్ట్రక్షన్‌లను సెట్ చేసేందుకు బ్యాంకు అధికారిక యాప్ లేదా ట్రస్ట్ వెబ్‌సైట్‌ను మాత్రమే ఉపయోగించండి. స్టాండింగ్ ఇన్‌స్ట్రక్షన్‌లను సెట్ చేసేందుకు గుర్తుతెలియని వెబ్‌సైట్ లేదా యాప్‌ను వాడొద్దు.
మీ బ్యాంకు ఖాతాపై కన్నేసి ఉంచండి :
ఆటోమేటిక్ పేమెంట్లు జరుగుతున్నంత మాత్రాన మీ అకౌంట్ మానిటరింగ్ ఆపేయాలని కాదు. మీ ఖాతా నుంచి ఎప్పుడు, ఎంత మొత్తం తీస్తున్నారో తెలుసుకునేందుకు క్రమం తప్పకుండా బ్యాలెన్స్‌ను చెక్ చేయండి. నెలకు ఒకసారి మీ లావాదేవీలను తప్పకుండా చెక్ చేయండి. మీరు గమనించని చిన్న లావాదేవీలను కూడా గమనించండి.
ఏదైనా తప్పుగా అనిపిస్తే వెంటనే ఇలా చేయండి :
మీకు తెలియని పేమెంట్ కనిపిస్తే అసలు నిర్లక్ష్యం చేయవద్దు. వెంటనే మీ బ్యాంకును సంప్రదించి స్టాండింగ్ ఇన్‌స్ట్రక్షన్‌ను క్యాన్సిల్ చేయించండి. త్వరగా స్పందిస్తే నష్టాన్ని నివారించవచ్చు. బ్యాంకులు ఈ విషయంలో మీకు హెల్ప్ చేస్తాయి. మీరు ఎంత త్వరగా రిపోర్టు చేస్తే అంత మంచిది.
