Bank Holiday Update : మహా సప్తమి ఎఫెక్ట్.. అక్టోబర్ 17న బ్యాంకులు బంద్? ఖాతాదారులు తప్పక తెలుసుకోండి..!

Bank Holiday Update : అక్టోబర్ 17, 2026న బ్యాంకులు తెరిచి ఉంటాయా? మహా సప్తమి, దుర్గా పూజ నేపథ్యంలో బ్యాంకు సెలవుల వివరాలు, పశ్చిమ బెంగాల్ హాలిడే అప్‌డేట్, ఖాతాదారులు తెలుసుకోవాల్సిన ముఖ్య విషయాలేంటో చూద్దాం..

Bank Holiday Update

  • ఖాతాదారులకు కీలక అలర్ట్
  • బ్యాంకులకు వెళ్లే ముందు ఇది తెలుసుకోండి..
  • అక్టోబర్ 17 బ్యాంక్ హాలిడే ఉందా? సెలవుపై ఉత్కంఠ..
  • దుర్గా పూజ రోజున బ్యాంకులు పనిచేస్తాయా లేదా?

Bank Holiday Update : అక్టోబర్ 17న బ్యాంకులకు వెళ్లేందుకు ప్లాన్ చేస్తున్నారా? అయితే, మీరు ఈ విషయం తప్పనిసరిగా తెలుసుకోవాలి. మహా సప్తమి, దుర్గా పూజ వేడుకల నేపథ్యంలో అక్టోబర్ 17న బ్యాంకులకు సెలవు ఉంటుందా? లేదా? అనే అంశంపై ఆసక్తి నెలకొంది. ముఖ్యంగా పశ్చిమ బెంగాల్‌లో బ్యాంకు ఉద్యోగులు ఈ రోజున కూడా సెలవు ప్రకటించాలని డిమాండ్ చేస్తుండటంతో ఖాతాదారుల్లో గందరగోళం ఏర్పడింది. పూర్తి వివరాలివే..

అక్టోబర్ 17న బ్యాంకులు పనిచేస్తాయా? :
సాధారణంగా దేశంలో బ్యాంకులు ప్రతి నెల రెండో, నాలుగో శనివారాల్లో మూసివేసి ఉంటాయి. మొదటి, మూడో, ఐదో శనివారాల్లో పనిచేస్తాయి. 2026 అక్టోబర్ 17 మూడో శనివారం కావడంతో ప్రత్యేక సెలవు ప్రకటించనంతవరకు బ్యాంకులు పనిచేయాల్సి ఉంటుంది. అయితే, రాష్ట్రాలవారీగా బ్యాంకు సెలవులు మారవచ్చు. అందుకే మీ ప్రాంతంలోని బ్యాంకు అధికారిక సెలవుల జాబితాను చెక్ చేయడం మంచిది.

Read Also : Samsung Galaxy S25 Ultra 5G : ఏంది మావా ఆఫర్.. ఈ శాంసంగ్ అల్ట్రా 5G ఫోన్ మరి ఇంత తక్కువా.. అమెజాన్‌లో జస్ట్..

మహా సప్తమి కోసం సెలవు డిమాండ్ :
దుర్గా పూజ సందర్భంగా పశ్చిమ బెంగాల్‌లోని బ్యాంకు ఉద్యోగులు అక్టోబర్ 17న సెలవు ఇవ్వాలని కోరుతున్నారు. ఆల్ ఇండియా బ్యాంక్ ఆఫీసర్స్ కాన్ఫెడరేషన్ (AIBOC) పశ్చిమ బెంగాల్ విభాగం ఈ విషయంపై ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసినట్లు సమాచారం. మహా సప్తమి వేడుకల్లో కుటుంబ సభ్యులతో కలిసి పాల్గొనేందుకు సెలవు అవసరమని ఉద్యోగులు పేర్కొంటున్నారు.

కోల్‌కతాలో అక్టోబర్ 19 నుంచి 21 వరకు బ్యాంకు సెలవులు ఉండగా, పశ్చిమ బెంగాల్‌లో అక్టోబర్ 18న కూడా సెలవు ఉంది. త్రిపురలోనూ మహా సప్తమి సందర్భంగా సెలవు ఉండొచ్చు. అయితే, అక్టోబర్ 17న అదనపు సెలవు ప్రకటించారా లేదా అన్నది సంబంధిత రాష్ట్రం, బ్యాంకు అధికారిక ప్రకటన ద్వారా తెలుసుకోవడం బెటర్..

ఆన్‌లైన్ బ్యాంకింగ్ సేవలు :
బ్యాంకు పనులు ఉన్నవారు ముందుగా తమ బ్రాంచుకు ఫోన్ చేసి లేదా అధికారిక బ్యాంకు హాలిడే క్యాలెండర్‌ను తెలుసుకుని వెళ్లడం మంచిది. సెలవు రోజుల్లో సాధారణంగా యూపీఐ, ఏటీఎంలు, మొబైల్ బ్యాంకింగ్, ఇంటర్నెట్ బ్యాంకింగ్ సేవలు అందుబాటులో ఉంటాయి. అయితే, క్యాష్ డిపాజిట్, చెక్కుల క్లియరెన్స్ వంటి సేవలపై ప్రభావం ఉండొచ్చు.