Bank of Baroda FD : సీనియర్ సిటిజన్లకు పండగే.. ఈ బ్యాంకులో 444 రోజుల FDపై ఎంత వడ్డీ వస్తుందో తెలుసా?
Bank of Baroda FD : బ్యాంక్ ఆఫ్ బరోడా సాధారణ పౌరులతో పోలిస్తే సీనియర్ సిటిజన్లకు FD ఖాతాలపై 0.50 శాతం అధిక వడ్డీని అందిస్తుంది.. పూర్తి వివరాలివే..
- Sreehari A
- Published on- September 5, 2026 / 07:24 PM IST
Bank of Baroda FD
- సీనియర్ సిటిజన్ల FDలపై 0.50 శాతం అధిక వడ్డీ
- గరిష్టంగా 10 ఏళ్ల కాలపరిమితితో FD ఖాతా ఓపెన్
- 444 రోజుల FDపై 6.45 శాతం నుంచి 7.05 శాతం
Bank of Baroda FD : బ్యాంక్ ఆఫ్ బరోడా (BoB) కస్టమర్లకు పండగే.. ఫిక్స్‌డ్ డిపాజిట్ ఖాతాలపై ఈ ప్రభుత్వ రంగ బ్యాంకు భారీగా వడ్డీ రేట్లను అందిస్తోంది. రూ. 3 కోట్ల లోపు FD ఖాతాలపై బ్యాంక్ ఆఫ్ బరోడా 3.50శాతం నుంచి 7.35శాతం వరకు వడ్డీ రేట్లను అందిస్తోంది. బ్యాంక్ ఆఫ్ బరోడాలో కనీసం 7 రోజుల టెన్యూర్ FD ఖాతాను కూడా ఓపెన్ చేయొచ్చు.
అదనంగా, ఈ ప్రభుత్వ రంగ బ్యాంకులో గరిష్టంగా 10 ఏళ్ల కాలపరిమితితో FD ఖాతాను ఓపెన్ చేయొచ్చు. బ్యాంక్ ఆఫ్ బరోడాలో 444 రోజుల టెన్యూర్ FD ఖాతాలపై ఎంత వడ్డీ చెల్లిస్తోంది? అలాగే, బ్యాంక్ ఆఫ్ బరోడా FDలో గరిష్టంగా ఎంత మొత్తాన్ని డిపాజిట్ చేయొచ్చో ఇప్పుడు తెలుసుకుందాం..
444 రోజుల FDపై వడ్డీ ఎంతంటే? :
బ్యాంక్ ఆఫ్ బరోడా 444 రోజుల FD పథకంపై 6.45 శాతం నుంచి 7.05 శాతం వరకు బంపర్ వడ్డీని అందిస్తోంది. 59 ఏళ్ల వయస్సు వరకు ఉన్న కస్టమర్లందరికీ బ్యాంక్ ఆఫ్ బరోడా 444 రోజుల FD ఖాతాలపై 6.45 శాతం వడ్డీని అందిస్తోంది. అంతేకాదు.. ఈ ప్రభుత్వ బ్యాంకు 60 ఏళ్లు ఆపై ఎక్కువ వయస్సు ఉన్న సీనియర్ సిటిజన్లకు 444 రోజుల FD పథకంపై 6.95 శాతం వడ్డీని అందిస్తోంది.
Read Also : HMD 106 2G Price : స్మార్ట్‌ఫోన్ పక్కన పెట్టండి.. HMD 106 2G కొత్త ఫీచర్ ఫోన్‌తో మళ్లీ సింపుల్ లైఫ్!
అంతేకాదు.. ఈ ప్రభుత్వ బ్యాంకు 80 ఏళ్లు, అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న సూపర్ సీనియర్ సిటిజన్లకు 444 రోజుల FD పథకంపై 7.05 శాతం అత్యధిక రాబడిని అందిస్తోంది. ఈ పథకంలో కస్టమర్లు గరిష్టంగా రూ. 3 కోట్లు పెట్టుబడి పెట్టవచ్చు.
సీనియర్ సిటిజన్లకు బెనిఫిట్స్ :
బ్యాంక్ ఆఫ్ బరోడా సాధారణ పౌరులతో పోలిస్తే సీనియర్ సిటిజన్లకు ఎఫ్‌డీ ఖాతాలపై 0.50 శాతం అధిక వడ్డీ రేట్లను అందిస్తుంది. అంతేకాదు.. ఈ ప్రభుత్వ రంగ బ్యాంకు, ఎంపిక చేసిన టెన్యూర్ వంటి ఎఫ్‌డీ ఖాతాలపై సీనియర్ సిటిజన్లతో పోలిస్తే సూపర్ సీనియర్ సిటిజన్లకు 0.10 శాతం అధిక వడ్డీ రేట్లను అందిస్తుంది.
బ్యాంక్ ఆఫ్ బరోడా ఈ ఏడాది జూన్‌లో ఎఫ్‌డి వడ్డీ రేట్లను సవరించింది. అన్ని బ్యాంకులు, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిర్దేశించిన రెపో రేటు ఆధారంగా ఎఫ్‌డి వడ్డీ రేట్లలో మార్పులు చేస్తాయి.
