Bank Holiday : నవంబర్ 9న బ్యాంకులు తెరిచే ఉంటాయా? సోమవారం స్కూళ్లు, ప్రభుత్వ ఆఫీసుల సెలవులపై క్లారిటీ!

Bank Holiday : నవంబర్ 9, 2026న దీపావళి సెలవులు పొడిగించారు.. గుజరాత్, తమిళనాడు, మహారాష్ట్రలో ప్రభుత్వ ఆఫీసులు, స్కూళ్లకు సెలవు ప్రకటించారు. బ్యాంకులు తెరిచే ఉంటాయా? లేదో తెలుసుకుందాం..

November 9 Holiday 2026

  • సోమవారం స్కూళ్లు, ఆఫీసులకు సెలవా ఉందా? లేదా?
  • దీపావళి తర్వాత మరో రోజు సెలవు పొడిగింపు
  • ఈ రాష్ట్రాల్లో బ్యాంకుల పరిస్థితి ఇదే

Bank Holiday : దీపావళి పండుగ సందడి ముగిసినా.. సెలవుల మాత్రం మరికొన్ని ప్రాంతాల్లో పొడిగించారు.. నవంబర్ 9, (సోమవారం) కూడా కొన్ని రాష్ట్రాల్లో ప్రభుత్వ ఆఫీసులు, విద్యాసంస్థలకు సెలవు ప్రకటించడంతో ఉద్యోగులు, విద్యార్థులకు మరో రోజు రెస్ట్ లభించనుంది. అయితే, ఈ సెలవు దేశమంతటా వర్తించదు. రాష్ట్రాన్ని బట్టి హాలిడే నిబంధనలు మారనున్నాయి. అవేంటో ఓసారి తెలుసుకుందాం..

గుజరాత్‌లో ప్రభుత్వ ఆఫీసులకు సెలవు :
గుజరాత్ ప్రభుత్వం దీపావళి సెలవులను పొడిగిస్తూ నవంబర్ 9న ప్రభుత్వ ఆఫీసులకు అదనపు సెలవు ప్రకటించింది. దీనికి బదులుగా నవంబర్ 28, శనివారం వర్కింగ్ డేగా ఉంటుంది. అయితే, ఈ నిర్ణయం ప్రభుత్వ ఆఫీసులకు వర్తిస్తుంది. ప్రైవేట్ సంస్థలకు తప్పనిసరిగా సెలవు ఉండదు..

తమిళనాడులో స్కూళ్లు, కాలేజీలు బంద్ :
తమిళనాడులో నవంబర్ 9న ప్రభుత్వ కార్యాలయాలతో పాటు ప్రభుత్వ రంగ సంస్థలు, స్కూళ్లు, కాలేజీలకు కూడా సెలవు ప్రకటించారు. దీపావళి సందర్భంగా సొంతూళ్లకు వెళ్లిన విద్యార్థులు, ఉద్యోగులు తిరిగి వచ్చేందుకు ఇబ్బంది పడకుండా ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇక్కడ కూడా నవంబర్ 28 వర్కింగ్ డేగా ప్రకటించారు.

Read Also : Happy Diwali 2026 : వాట్సాప్‌లో దీపావళి విషెస్ కొత్తగా చెప్పాలా? ChatGPT, Gemini AIతో మీ ఫొటోలనే స్టిక్కర్లుగా మార్చేయండి!

మహారాష్ట్రలో ఎక్కడ సెలవు? :
మహారాష్ట్రలో రాష్ట్రవ్యాప్తంగా సెలవు లేదు. అయితే, పుణె జిల్లా, ముంబై సిటీ, ముంబై సబర్బన్ ప్రాంతాల్లోని ప్రభుత్వ, సెమీ గవర్నమెంట్ ఆఫీసులకు నవంబర్ 9న లోకల్ హాలిడే ఉంటుంది. థానే, పాల్ఘర్, రాయ్‌గఢ్ జిల్లాలకు ఈ సెలవు వర్తించదు. ప్రైవేట్ స్కూళ్లు, ఆఫీసుల సెలవులు ఆయా సంస్థల నిర్ణయంపై ఆధారపడి ఉంటాయి..

బ్యాంకులకు సెలవు ఉందా? :
బ్యాంకు ఖాతాదారులకు ముఖ్యమైన విషయం ఏంటంటే.. నవంబర్ 9న ముంబైలో బ్యాంకులకు సెలవు లేదు. ఆర్బీఐ క్యాలెండర్ ప్రకారం.. నవంబర్ 10న బలి ప్రతిపద సందర్భంగా ముంబైలో బ్యాంకులకు సెలవు ఉంటుంది.

నవంబర్ 9న బ్యాంకు బ్రాంచులు ఎప్పటిలాగే పనిచేస్తాయి. యూపీఐ, ఏటీఎం, మొబైల్ బ్యాంకింగ్ సేవలు కూడా అందుబాటులో ఉంటాయి. దీపావళి తర్వాత మరో రోజు సెలవు వస్తుందని అనుకోవద్దు.. మీ ప్రాంతం, ఆఫీసు, స్కూల్ హాలిడే క్యాలెండర్‌ను ఓసారి చెక్ చేసుకుని ప్లాన్ చేయడం మంచిది..