Best 444-Day FD : 444 రోజుల FDలో రూ.5 లక్షలు పెడితే.. ఏ బ్యాంకులో ఎక్కువ వడ్డీ సంపాదించుకోవచ్చంటే?

Best 444-Day FD : రూ.5 లక్షలను 444 రోజుల ఎఫ్‌డీలో పెట్టుబడి పెడితే SBI, PNB, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఎంత వడ్డీ వస్తుంది? ఏ బ్యాంకు అత్యధిక రాబడి ఇస్తుందో పూర్తి లెక్కలివే..

Best 444-Day FD

  • బ్యాంక్ FDలో పెట్టుబడి పెట్టాలనుకుంటున్నారా?
  • రూ.5 లక్షలకు ఏ బ్యాంక్ ఎఫ్‌డీ బెస్ట్?
  • 444 రోజుల్లో ఎక్కడ ఎక్కువ లాభం వస్తుందో తెలుసా?
  • రూ.5 లక్షలపై రూ.33,750 వరకు లాభం..

Best 444-Day FD : చేతిలో రూ.5 లక్షలు ఉన్నాయా? ఆ డబ్బును రిస్క్ లేకుండా కొంతకాలం పాటు దాచుకోవాలనుకుంటున్నారా? అయితే, బ్యాంక్ ఫిక్స్‌డ్ డిపాజిట్ (FD) మంచి ఆప్షన్.. ముఖ్యంగా 444 రోజుల ప్రత్యేక FD పథకాలపై ఓ లుక్కేయండి. ప్రముఖ బ్యాంకులు అందిస్తున్న వడ్డీ రేట్లను కంపేర్ చేస్తే.. మీకు ఎక్కడ ఎక్కువ రాబడి వస్తుందో ఈజీగా తెలుసుకోవచ్చు..

SBI అమృత్ వర్ష ఎఫ్‌డీ :
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) అందిస్తున్న 444 రోజుల అమృత్ వర్ష ఎఫ్‌డీపై 6.45 శాతం వడ్డీ అందిస్తుంది. ఇందులో రూ.5 లక్షలు డిపాజిట్ చేస్తే మెచ్యూరిటీ సమయానికి సుమారు రూ.5,32,350 వస్తాయి. అంటే దాదాపు రూ.32,350 వడ్డీ ఆదాయం సంపాదించుకోవచ్చు..

PNB 444 రోజుల ఎఫ్‌డీ :
పంజాబ్ నేషనల్ బ్యాంక్ (PNB) 444 రోజుల ఎఫ్‌డీపై 6.60 శాతం వడ్డీ అందిస్తోంది. రూ.5 లక్షలు పెట్టుబడి పెడితే సుమారు రూ.5.33 లక్షలు చేతికి వస్తాయి. వడ్డీ రూపంలో దాదాపు రూ.33వేలు లభిస్తుంది.

Read Also : Home Loan Closed : హోమ్ లోన్ తీరిపోయిందా? బ్యాంకు ఈ పత్రాలు ఇవ్వకపోతే మీకు రోజుకు రూ.5,000 కట్టాల్సిందే!

ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ :
ఈ బ్యాంకు కూడా 444 రోజుల ఎఫ్‌డీపై 6.60 శాతం వడ్డీని అందిస్తోంది. రూ.5 లక్షల పెట్టుబడిపై సుమారు రూ.33వేలు వడ్డీ ఆదాయం పొందవచ్చు. మెచ్యూరిటీ మొత్తం దాదాపు రూ.5.33 లక్షలు పొందొచ్చు.

సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా :
ఈ నాలుగు బ్యాంకుల్లో అత్యధికంగా 6.75 శాతం వడ్డీని సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అందిస్తోంది. రూ.5 లక్షలు డిపాజిట్ చేస్తే సుమారు రూ.33,750 వడ్డీ వస్తుంది. మొత్తం రూ.5,33,750 పొందవచ్చు.

ఏ బ్యాంక్ బెస్ట్? :
వివరాల ప్రకారం.. సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అత్యధిక వడ్డీని అందిస్తోంది. అయితే, ఎఫ్‌డీ చేసే ముందు లేటెస్ట్ వడ్డీ రేట్లు, సీనియర్ సిటిజన్ బెనిఫిట్స్, టీడీఎస్, పన్నుల వివరాలు తప్పనిసరిగా తెలుసుకోండి. వడ్డీ చెల్లింపు విధానం, కాంపౌండింగ్ ఆధారంగా వాస్తవ మెచ్యూరిటీ మొత్తం మారవచ్చు.