×
Ad

Top 5 Best Bikes : కొంటే ఇలాంటి బైకులు కొనాలి.. రూ. 2 లక్షల బడ్జెట్ లోపు టాప్ 5 అద్భుతమైన బైకులు.. ఫీచర్లు, ధర, మైలేజీ ఎంతంటే?

Top 5 Best Bikes : రూ. 2 లక్షల వరకు బడ్జెట్‌లో టాప్ 5 బైకులు మార్కెట్లో లభ్యమవుతున్నాయి. ఆకట్టుకునే ఫీచర్లు, మంచి డిజైన్‌ సహా అద్భుతమైన మైలేజీని అందిస్తాయి. ఇందులో మీకు నచ్చిన బైక్ కొనేసుకోవచ్చు.

Top 5 Best Bikes in India

  • కొత్త బైక్ కొనేవారికి అద్భుతమైన బైకులు
  • రూ. 2లక్షల లోపు టాప్ 5 బడ్జెట్ బైకులు మీకోసం
  • రాయల్ ఎన్‌ఫీల్డ్ నుంచి యమహా వరకు బైక్ మోడల్స్
  • బైకు, మైలేజీ, ఇతర ఫీచర్లతో అద్భుతమైన మైలేజీ ఆప్షన్

Top 5 Best Bikes : కొత్త బైక్ కొనేందుకు ప్లాన్ చేస్తున్నారా? స్పోర్ట్ బైక్ కొనాలని అనుకుంటే ఈ వార్త మీకోసమే. ప్రస్తుతం మార్కెట్లో రూ. 2 లక్షల వరకు బడ్జెట్ ధరలో అద్భుతమైన బైకులు అందుబాటులో ఉన్నాయి.

మీ బడ్జెట్‌లో 5 టాప్ బైక్‌లు ఆకట్టుకునే ఫీచర్లు, మంచి డిజైన్‌తో ఆకర్షణీయంగా ఉన్నాయి. అందులో రాయల్ ఎన్‌ఫీల్డ్ హంటర్ 350 నుంచి యమహా R15 V4 వరకు అనేక మోడల్ బైకులు ఉన్నాయి. టాప్ 5 బైకులలో ఏది మీకు నచ్చిందో ఎంచుకుని ఇంటికి తెచ్చుకోవచ్చు. ఏ మోడల్ బైక్ ధర ఎంత ఉంది? ఎలా కొనుగోలు చేయాలో ఇప్పుడు చూద్దాం.

రాయల్ ఎన్‌ఫీల్డ్ హంటర్ 350 :
మీరు క్లాసిక్, రెట్రో లుక్ బైక్ కోసం చూస్తున్నారా? రాయల్ ఎన్ఫీల్డ్ హంటర్ 350 అద్భుతమైన ఆప్షన్. ఈ బైక్ మంచి టార్క్ అందించే జే-సిరీస్ ఇంజిన్‌ అందిస్తుంది. ధరల వారీగా పరిశీలిస్తే.. రాయల్ ఎన్‌ఫీల్డ్ హంటర్ 350 ధర రూ. 1.38 లక్షల నుంచి రూ.1.67 లక్షల (ఎక్స్-షోరూమ్) వరకు ఉంటుంది.

మీరు ఈ బైక్‌ను మీ బడ్జెట్‌లో రూ. 2 లక్షల వరకు ఈజీగా కొనేసుకోవచ్చు. రాయల్ ఎన్‌ఫీల్డ్ హంటర్ 350 సుమారు 36.2kmpl ఏఆర్ఏఐ మైలేజీని అందిస్తుంది. వాస్తవ ప్రపంచ పరిస్థితులలో సుమారు 30-34kmpl మైలేజీని ఇస్తుందని అంచనా.

టీవీఎస్ రోనిన్ :
టీవీఎస్ మోటార్స్ టీవీఎస్ రోనిన్ కొనేసుకోవచ్చు. అత్యంత స్టైలిష్ మోటార్ సైకిళ్లలో ఇదొకటి. ఈ బైక్ అద్భుతమైన డిజైన్, ఆకట్టుకునే ఫీచర్లతో వస్తుంది. ఇందులో వాయిస్ అసిస్ట్, టర్న్-బై-టర్న్ నావిగేషన్, మల్టీ ఏబీఎస్ మోడ్‌లు వంటి స్మార్ట్ ఫీచర్లు ఉన్నాయి. టీవీఎస్ రోనిన్ ఎక్స్-షోరూమ్ ధర రూ. 1.26 లక్షల నుంచి రూ. 1.60 లక్షల వరకు ఉంటుంది. టీవీఎస్ రోనిన్ ఏఆర్ఏఐ ధృవీకరించిన ప్రకారం సుమారు 42.95 kmpl మైలేజీని ఇస్తుంది.

Read Also : Post Office Scheme : మీకు ఈ నెల జీతం పడిందా? పోస్టాఫీసులో రూ. 2 లక్షలు పెట్టుబడితో ఏకంగా రూ. 90వేలు వడ్డీనే సంపాదించుకోవచ్చు

బజాజ్ పల్సర్ NS400Z :
బజాజ్ ఆటో పల్సర్ సిరీస్ మార్కెట్లో ఫుల్ పాపులర్ అయింది. మీ బడ్జెట్‌లో బజాజ్ పల్సర్ NS400Z కొనుగోలు చేయాలనుకుంటే కొనేసుకోవచ్చు. ఈ బైక్ పవర్‌ఫుల్ 373cc ఇంజిన్‌తో వస్తుంది. హై పర్ఫార్మెన్స్ స్ట్రీట్‌ఫైటర్ కూడా. ట్రాక్షన్ కంట్రోల్, మల్టీ రైడ్ మోడ్స్, క్విక్‌షిఫ్టర్ వంటి అడ్వాన్స్ ఫీచర్లతో వస్తుంది.

బజాజ్ పల్సర్ NS400Z బైక్ ధర రూ. 1.93 లక్షల నుంచి (ఎక్స్-షోరూమ్) ప్రారంభమవుతుంది. బజాజ్ పల్సర్ సాధారణంగా లీటరుకు సుమారు 28 కి.మీ నుంచి 34 కిలోమీటర్ల (kmpl) మైలేజీని ఇస్తుందని అంచనా.

యమహా MT-15 V2 :
మీరు స్పోర్టీ లుక్ బైక్ కోసం చూస్తుంటే.. యమహా MT-15 V2 బైక్ కొనేసుకోవచ్చు. యమహా MT-15 V2 బైక్ ధర రూ. 1.55 లక్షల నుంచి రూ.1.74 లక్షల వరకు (ఎక్స్-షోరూమ్) ఉంటుంది. మీరు స్పోర్టీ లుక్ బైక్ కోసం చూస్తుంటే.. యమహా MT-15 V2 బైక్ కొనేసుకోవచ్చు.

యమహా MT-15 V2 బైక్ ధర రూ. 1.55 లక్షల నుంచి రూ.1.74 లక్షల వరకు (ఎక్స్-షోరూమ్) ఉంటుంది. యమహా ఈ బైకు సగటున సుమారు 47కి.మీ నుంచి 56 కిలోమీటర్ల వరకు మైలేజీని ఇస్తుంది. సిటీలో సుమారు 56.87 kmpl, హైవేలపై 47.94 kmpl మైలేజీని అందిస్తుందని అంచనా.

యమహా R15 V4 :
యమహా R15 V4 బైక్ అనేది భారత మార్కెట్లో అత్యంత పాపులర్, అత్యధికంగా అమ్ముడవుతున్న స్పోర్ట్స్ బైక్‌లలో ఒకటి. మీరు ఈ బైక్‌ను మీ బడ్జెట్ ధరలోనే కొనేసుకోవచ్చు. ఈ బైక్ TFT డిస్‌ప్లే, క్విక్‌షిఫ్టర్, ట్రాక్షన్ కంట్రోల్ వంటి ఫీచర్లను అందిస్తుంది. ధర రూ. 1.66 లక్షల నుంచి రూ.1.74 లక్షల వరకు (ఎక్స్-షోరూమ్) అందిస్తుంది. లీటర్ పెట్రోల్‌కు 45కి.మీ మైలేజీని అందిస్తుంది.