Best AC Deals : కొత్త ఏసీ కావాలా బ్రో.. ఈ సమ్మర్‌లో బెస్ట్ బడ్జెట్ ఫ్రెండ్లీ AC డీల్స్.. మీ ఇల్లంతా కూల్ కూల్..!

Best AC Deals : సరసమైన ధరలో కూలింగ్ కోసం చూస్తున్నారా? వోల్టాస్, హిటాచీ, లాయిడ్ నుంచి భారత మార్కెట్లో బెస్ట్ 1.5-టన్ ఇన్వర్టర్ స్ప్లిట్ ఏసీలు అందుబాటులో ఉన్నాయి. ఫీచర్లు, ఇతర డీల్స్‌ ఇలా పొందండి.

Best AC Deals

  • కొత్త ఏసీ కొనేవారికి అద్భుతమైన ఆఫర్లు, మరెన్నో డిస్కౌంట్లు
  • ఈ సమ్మర్ సీజన్‌లో బెస్ట్ బడ్జెట్ ఫ్రెండ్లీ డీల్స్
  • ఇల్లు కూలింగ్ కోసం ఈ కొత్త ఏసీ ఇంటికి తెచ్చుకోండి

Best AC Deals : కొత్త ఏసీ కొంటున్నారా? అసలే ఎండలు మండిపోతున్నాయి. దేశవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్న నేపథ్యంలో ఎండ వేడిని తట్టుకునేందుకు చాలా మంది వినియోగదారులు బడ్జెట్‌కు ధరలో మంచి ఏసీలను కొనేందుకు ఆసక్తి చూపిస్తున్నారు.

ప్రముఖ బ్రాండ్‌లు 1.5-టన్ ఇన్వర్టర్ స్ప్లిట్ ఏసీలపై ఆకర్షణీయమైన ఆఫర్‌లను అందిస్తున్నాయి. మీ దగ్గర పాత ఏసీలు ఉంటే అప్‌గ్రేడ్ చేసుకునేందుకు ఇదే బెస్ట్ టైమ్. ప్రస్తుతం భారత మార్కెట్లో కొన్ని బెస్ట్ ఏసీ ఆప్షన్లు ఉన్నాయి.

వోల్టాస్ 1.5 టన్ 3 స్టార్ ఇన్వర్టర్ స్ప్లిట్ ఏసీ (183V వెక్ట్రా CAW) :
ఈ వోల్టాస్ మోడల్ 150 చదరపు అడుగుల వరకు గదులకు బెస్ట్ ఏసీ. 4700W కూలింగ్ సామర్థ్యాన్ని అందిస్తుంది.

మెయిన్ ఫీచర్లు :

  • 4-ఇన్-1 అడ్జెస్టబుల్ కూలింగ్ మోడ్
  • కాపర్ కాయిల్స్‌తో R32 రిఫ్రిజెరెంట్
  • 110V–285V వోల్టేజ్ రేంజ్ పనిచేస్తుంది
  • స్వచ్ఛమైన గాలి కోసం డస్ట్ ఫిల్టర్
  • ఇండోర్ సౌండ్ లెవల్ 32–43dB

హిటాచీ 1.5 టన్ 3 స్టార్ ఎక్స్‌పాండబుల్+ ఇన్వర్టర్ స్ప్లిట్ ఏసీ :
హిటాచీ ఏసీ 5000W కూలింగ్‌ అందిస్తుంది. 110–160 చదరపు అడుగుల గదులకు బెస్ట్.

Read Also : Upcoming Smartphones : కొత్త ఫోన్ కొంటున్నారా? ఏప్రిల్‌లో రాబోయే టాప్ స్మార్ట్‌ఫోన్లు ఇవే.. రెడ్‌మి నుంచి ఇన్ఫినిక్స్ వరకు!

మెయిన్ ఫీచర్లు :

  • ఎక్స్‌పాండబుల్+ టెక్నాలజీ లోడ్ ఆధారంగా కూలింగ్‌ అడ్జెస్ట్
  • సింగిల్ కూలింగ్ కోసం 4-వే ఎయిర్ స్వింగ్
  • ఫ్రాస్ట్‌వాష్ సెల్ఫ్-క్లీనింగ్ ఫీచర్
  • లో సౌండ్ (~34 dB)
  • డస్ట్ ఫిల్టర్, మెమరీతో ఆటో-రీస్టార్ట్

లాయిడ్ 1.5 టన్ 3 స్టార్ ఇన్వర్టర్ స్ప్లిట్ ఏసీ :
ఈ లాయిడ్ ఏసీ 150 చదరపు అడుగుల వరకు గదుల కోసం రూపొందించారు. 5000W కూలింగ్ సామర్థ్యాన్ని అందిస్తుంది.

మెయిన్ ఫీచర్లు :

  • 5-ఇన్-1 మార్చగల కూలింగ్ మోడ్‌లు
  • యాంటీ-వైరల్ డస్ట్ ఫిల్టర్
  • ఫాస్ట్ పర్ఫార్మెన్స్ కోసం టర్బో కూలింగ్
  • 100V–280V వోల్టేజ్ రేంజ్
  • సౌండ్ లెవల్ సుమారు 34dB

ఈ ఏసీలు ఎందుకు బెస్ట్ అంటే? :

  • పవర్ సామర్థ్యంతో 3-స్టార్ ఇన్వర్టర్ టెక్నాలజీ
  • మిడ్ రేంజ్ గదులకు బెస్ట్ ఛాయిస్
  • కన్వర్టిబుల్ మోడ్‌లు, ఎయిర్ క్లీనింగ్, తక్కువ శబ్దం వంటి అడ్వాన్స్ ఫీచర్లు
  • వేసవి అమ్మకాల ఆఫర్ల సమయంలో పోటీ ధరలు ఉండటమే