Car Loans : మీకు కారు లోన్ కావాలా? ఈ 4 బ్యాంకుల్లో తక్కువ వడ్డీకే రుణాలు.. ఏయే బ్యాంకులంటే?
Car Loans : దేశంలోని 4 ప్రభుత్వ బ్యాంకులు తమ కస్టమర్లకు తక్కువ వడ్డీకే కార్లపై రుణాలు అందిస్తున్నాయి. కారు లోన్ వడ్డీ రేట్లకు సంబంధించి పూర్తి వివరాలను ఇప్పుడు వివరంగాతెలుసుకుందాం..
Car Loans ( Image Credit AI )
- తక్కువ వడ్డీ రేటుతో కార్ల లోన్లు
- ఈ 4 బ్యాంకుల్లో కారు లోన్లు తీసుకోవచ్చు
- ప్రభుత్వ బ్యాంకుల్లో కారు లోన్ పొందాలంటే ఎలా?
Car Loans : కొత్త కారు కొనాలని ప్రతిఒక్కరికి ఉంటుంది. కానీ కొంతమంది మాత్రమే ఆ కలను నిజం చేసుకుంటారు. ఎక్కడికైనా దూరప్రాంతాలకు వెళ్లాల్సి వస్తే పబ్లిక్ ట్రాన్స్ పోర్టు అంత సౌకర్యంగా ఉండదు. అందుకే చాలామంది కారు కొనేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఎప్పుడంటే అప్పుడు.. ఎక్కడికైనా వెళ్లొచ్చని భావిస్తుంటారు. మీరు కూడా అలా భావిస్తుంటే ఇప్పుడే మీకు నచ్చిన కారు కొనేసుకోండి.
అయితే, కారు లోన్ పొందడం అందరికి సాధ్యపడకపోవచ్చు. కారు లోన్లు తీసుకునేవాళ్లు ముఖ్యంగా బ్యాంకుల్లో లోన్ తీసుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత మీకు నచ్చిన విధంగా ఏదైనా కారును ఎంచుకోవచ్చు. అంతేకాదు.. కారు లోన్లపై బ్యాంకులు కూడా నెలవారీ ఈఎంఐలు చెల్లించేందుకు వీలుగా వడ్డీ రుణాలను అందిస్తున్నాయి.
మీరు కారు లోన్ తీసుకునేందుకు ప్లాన్ చేస్తుంటే.. మీకు తక్కువ వడ్డీ రేటుకే కారు లోన్లు అందించే బ్యాంకులు చాలా ఉన్నాయి. ముందుగా మీకు ఏ బ్యాంకు తక్కువ వడ్డీతో కారు రుణాలు ఇస్తుందో తెలుసుకోవాలి. ఆ తర్వాత మీరు అతి తక్కువ వడ్డీ రేట్లు కలిగిన బ్యాంకును ఎంచుకోవాలి. దేశంలోని 4 ప్రభుత్వ బ్యాంకులు తమ కస్టమర్లకు తక్కువ వడ్డీకి రుణాలు అందిస్తున్నాయి. కారు లోన్ వడ్డీ రేట్ల గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..
ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ కారు లోన్ :
ప్రభుత్వ యాజమాన్యంలోని బ్యాంకు ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్.. తమ కస్టమర్లకు చాలా సరసమైన వడ్డీ రేటుకు కారు లోన్లను అందిస్తుంది. ఈ బ్యాంక్ కారు లోన్ వడ్డీ రేట్లు 7.60 శాతం నుంచి ప్రారంభమవుతాయి. మీ క్రెడిట్ స్కోర్, లోన్ మొత్తం, అర్హతను బట్టి వడ్డీ రేట్లు మారవచ్చు.
కెనరా బ్యాంక్ కారు లోన్ :
ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ఒకటైన కెనరా బ్యాంక్ కూడా తమ కస్టమర్లకు చాలా తక్కువ వడ్డీ రేట్లకే కారు లోన్లను అందిస్తుంది. కెనరా బ్యాంక్ కార్ లోన్ వడ్డీ రేట్లు 7.695 శాతం నుంచి ప్రారంభమవుతాయి. మీ క్రెడిట్ స్కోర్, లోన్ మొత్తం, అర్హతను బట్టి వడ్డీ రేట్లు మారుతూ ఉంటాయి. బ్యాంకులు మీ ఆదాయం ఆధారంగా వడ్డీ రేట్లను నిర్ణయిస్తాయి.
యూబీఐ కారు లోన్ :
యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో కారు లోన్ తీసుకోవచ్చు. యూబీఐలో కారు రుణ వడ్డీ రేట్లు 7.50 శాతం నుంచి ప్రారంభమవుతాయి. మీ అర్హతను బట్టి ఈ వడ్డీ రేట్లు మారవచ్చు.
బ్యాంక్ ఆఫ్ ఇండియా కారు లోన్ :
బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి కారు లోన్ కావాలంటే.. 7.60 శాతం నుంచి వడ్డీ రేటుతో కారు లోన్లను పొందవచ్చు. మీరు ఈ బ్యాంకు నుంచి కారు లోన్ తక్కువ వడ్డీకే తీసుకోవచ్చు.
