Home Loan Buyers : 100 శాతం హోం లోన్ రాదా? డౌన్ పేమెంట్ లేకుండా ఇల్లు కొనలేమా? ఆర్బీఐ రూల్స్ తెలిస్తే షాకవుతారు!
Home Loan Buyers : ఈ రోజుల్లో ఇల్లు కొనడం కష్టమే. ఇళ్ల ధరలు, బ్యాంకు కొత్త రూల్స్ సొంతంటి కలను దూరం చేస్తున్నాయి. ఆర్బీఐ రూల్స్ ప్రకారం వంద శాతం గృహ రుణం పొందడం అసాధ్యమే. మందుగా డౌన్ పేమెంట్ అనేది తప్పనిసరి..
Home Loan Buyers ( Image Credit AI )
Home Loan Buyers : సొంతిల్లు.. మధ్యతరగతికి సొంత ఇల్లు అతిపెద్ద కల.. ప్రస్తుత రోజుల్లో కొత్త ఇల్లు కొనడం అనేది సామాన్యులకు చాలా కష్టంగా మారింది. అయితే, పెరుగుతున్న ఆస్తి ధరలు, బ్యాంకు నిబంధనల కారణంగా ఇల్లు కొనాలనే కల కలగానే మిగిలిపోతోంది. చాలా మంది గృహ రుణాల ద్వారా ఇళ్లను కొనుగోలు చేస్తుంటారు.
అందరిలో ఒకటే ప్రశ్న తలెత్తుతోంది.. ఇంతకీ డౌన్ పేమెంట్ లేకుండా మొత్తం ఇంటిని రుణంపై కొనుగోలు చేయలేమా? అంటే ఎక్స్‌పర్ట్స్‌ను అడిగినా కూడా స్పష్టమైన ఆన్సర్ రాదనే చెప్పాలి. కొత్త ఇల్లు కొనాలంటే ఏం చేయాలి? డౌన్ పేమెంట్ లేకుండా ఎలా ఇల్లు కొనొచ్చు అనేది ఇప్పుడు పూర్తి వివరాలతో తెలుసుకుందాం..
లోన్ పరిమితిపై ఆర్బీఐ నిబంధనలు :
గృహ రుణాలకు సంబంధించి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) స్పష్టమైన మార్గదర్శకాలను జారీ చేసింది. ఒక ఆస్తి విలువ రూ. 40 లక్షల వరకు ఉంటే.. బ్యాంకు గరిష్టంగా 90శాతం రుణం మంజూరు చేస్తుంది. అయితే, ఇంటి వాల్యూ రూ. 45 లక్షల నుంచి రూ.75 లక్షల మధ్య ఉంటే.. లోన్ లిమిట్ 80శాతంగా ఉంటుంది.
రూ. 75 లక్షల కన్నా ఎక్కువ విలువైన ఆస్తులకు బ్యాంకులు 75శాతం వరకు రుణాన్ని మాత్రమే అందిస్తాయి. అంటే.. మీకు వంద శాతం గృహ రుణం సాధ్యం కాదనే చెప్పాలి. అందుకే కొనుగోలుదారులు డౌన్ పేమెంట్ చేసేందుకు తప్పనిసరిగా ఎంతో కొంత డబ్బులు దగ్గర ఉంచుకోవాలి.
అడ్వాన్స్ పేమెంట్ :
మీ ఇంటి వాల్యూ ఎక్కువ లేదా తక్కువగా ఉన్నా గృహ రుణం ఎప్పుడూ భారంగానే ఉంటుంది. ఉదాహరణకు.. మీరు రూ. 40 లక్షల విలువైన ఇంటిని కొనుగోలు చేస్తే.. ఆ మొత్తం తొందరగా క్లియర్ చేయొచ్చుని అనిపించవచ్చు.
అయితే, కాలక్రమేణా వడ్డీ, ఈఎంఐ వంటివి మొత్తం భారీగా మారుతాయి. ఇంకా, ఆస్తి విలువ తగ్గితే బ్యాంకు రుణాన్ని పొందడం చాలా కష్టమవుతుంది. అందుకే బ్యాంకు, కస్టమర్ ఇద్దరికి ఇబ్బందిలేకుండా ఆర్బీఐ రుణ పరిమితులను నిర్ణయించింది.
డౌన్ పేమెంట్ చేయడం ఎలా? :
మీ దగ్గర డౌన్ పేమెంట్ చేసేందుకు తగినంత డబ్బు లేదా? అయితే మీకోసం సింపుల్ సొల్యుషన్ ఉంది. మీ ఇంటికి ఎంత డౌన్ పేమెంట్ అవసరమో ముందుగా బిల్డర్‌ను అడగండి. ఉదాహరణకు.. బిల్డర్ రూ. 5 లక్షలు అడిగితే.. డౌన్ పేమెంట్ కవర్ చేసేందుకు మీరు రూ. 8 లక్షల పర్సనల్ లోన్ తీసుకోవచ్చు. ఈ పద్ధతిలో హోం లోన్ డౌన్ పేమెంట్ చేయడం ఈజీ అవుతుంది. తద్వారా సొంతిల్లు కల నిజం చేసుకోవచ్చు.
