Best Mileage Bikes-e-Scooters : తక్కువ ఖర్చు.. ఎక్కువ మైలేజ్! పండగ వేళ బెస్ట్ బైక్స్, ఎలక్ట్రిక్ స్కూటర్లు ఇవే!
Best Mileage Bikes-e-Scooters : పండగ వేళ తక్కువ ధరకు ఎక్కువ మైలేజ్ ఇచ్చే హీరో స్ప్లెండర్, టీవీఎస్ స్టార్ సిటీ, హోండా SP125 బైక్స్‌తో పాటు ఓలా, ఎథర్, టీవీఎస్, బజాజ్ ఎలక్ట్రిక్ స్కూటర్ల రేంజ్, ఛార్జింగ్ ఖర్చులు, వారంటీ వివరాలివే..
- Sreehari A
- Published on- November 2, 2026 / 10:46 AM IST
Best Mileage Bikes-e-Scooters
- లీటర్‌కు 70 కి.మీ మైలేజ్.. ఈ స్కూటర్ల రేంజ్ కూడా అదుర్స్
- పెట్రోల్ ఖర్చుకు చెక్ పెట్టండి.. బెస్ట్ మైలేజ్ ఇచ్చే బైక్స్, ఈవీ స్కూటర్లు
- బైక్ కావాలా? స్కూటర్ కావాలా? ఫెస్టివ్ వీకెండ్లో బెస్ట్ ఛాయిస్ ఇవే
Best Mileage Bikes-e-Scooters : అసలే పండగ సీజన్.. ఈ పండగ వేళ కొత్త బైక్ లేదా ఎలక్ట్రిక్ స్కూటర్ కొనాలనుకుంటున్నారా? అయితే, మీకోసం అద్భుతమైన బైకులు, స్కూటర్లు అందుబాటులో ఉన్నాయి. మీకు మంచి మైలేజ్ ఇచ్చే పెట్రోల్ బైక్స్, లాంగ్ రేంజ్ ఇచ్చే ఎలక్ట్రిక్ స్కూటర్లలో మీకు నచ్చిన మోడల్ ఇంటికి తెచ్చుకోవచ్చు.. తెలుగు రాష్ట్రాల్లో కొనుగోలుదారులను ఆకట్టుకుంటున్న కొన్ని బెస్ట్ మోడల్స్ ఎలా ఉన్నాయో ఓసారి చూద్దాం..
బెస్ట్ మైలేజ్ ఇచ్చే పెట్రోల్ బైక్స్ :
తక్కువ ఖర్చుతో లాంగ్ డ్రైవ్ చేసేవారికి హీరో స్ప్లెండర్ ప్లస్ XTEC అద్భుతమైన ఆప్షన్. రియల్ వరల్డ్‌లో లీటరుకు సుమారు 65 కి.మీ నుంచి 70 కి.మీ మైలేజ్ ఇస్తుంది. ARAI ప్రకారం.. 70–73 కి.మీ మైలేజ్ ఉంటుంది.
టీవీఎస్ స్టార్ సిటీ ప్లస్ కూడా సుమారు 70 కి.మీ మైలేజ్ ఇస్తుందని అంటున్నారు. హోండా SP125 విషయానికి వస్తే.. 60 కి.మీ నుంచి 63 కి.మీ వరకు మైలేజ్ అందిస్తుంది. స్ప్లెండర్, స్టార్ సిటీ ప్లస్ మోడళ్లు E20 పెట్రోల్‌కు కూడా సపోర్ట్ చేస్తాయి. బైక్ కొంటే బెటరా? స్కూటర్ కొంటే బెటరా? అనేది ఇప్పుడు చూద్దాం..
ఎలక్ట్రిక్ స్కూటర్ల రేంజ్ అదుర్స్ :
ఎలక్ట్రిక్ స్కూటర్లలో ఒలా S1 ప్రో జెన్2 (4 kWh) నార్మల్ మోడ్‌లో సుమారు 130 కి.మీ నుంచి 150 కి.మీ రేంజ్ ఇస్తుంది. ఇంటి వద్ద ఫుల్ ఛార్జ్ కోసం దాదాపు 6.5 గంటలు పడుతుంది. టీవీఎస్ ఐక్యూబ్ ఎస్టీ లాంగ్ డ్రైవ్ చేసేమంచి బెస్ట్ ఆప్షన్.. ఎథర్ 450X సుమారు 100 కి.మీ నుంచి 110 కి.మీ రేంజ్ ఇవ్వగా, బజాజ్ చేతక్ ప్రీమియమ్ రియల్ వరల్డ్‌లో 110 కి.మీ నుంచి 115 కి.మీ వరకు అందిస్తుందని అంచనా.
ఛార్జింగ్ ఖర్చులు.. వారంటీ ఎంతంటే? :
ఎథర్ పబ్లిక్ ఛార్జింగ్ నెట్‌వర్క్‌లో నిమిషానికి 1.5 కి.మీ వరకు రేంజ్ అందిస్తుంది. ఒలా హైపర్చార్జర్లో 15 నిమిషాలకు 50 కి.మీ రేంజ్ పొందవచ్చు. ముంబైలో ఛార్జీ నిమిషానికి రూ. 2.5 వరకు ఉంది. ఇంట్లో ఛార్జింగ్ చేస్తే కిలోమీటరుకు సుమారు రూ. 0.25 నుంచి రూ.0.40 ఖర్చవుతుంది.
వారంటీ విషయానికి వస్తే..
ఒలా S1 సిరీస్‌కు 3 ఏళ్ల బేసిక్ వారంటీ ఉండగా, ఎక్స్టెండెడ్ ఆప్షన్‌తో 8 ఏళ్లు లేదా 70వేల నుంచి రూ. 80వేల కి.మీ వరకు పొందవచ్చు. టీవీఎస్ ఐక్యూబ్ బ్యాటరీ, మోటార్, కంట్రోలర్, ఛార్జర్‌పై 3 ఏళ్లు లేదా 50వేల కి.మీ వారంటీ ఇస్తుంది. ఎథర్ ఎయిట్70 ప్రోగ్రామ్ ద్వారా 8 ఏళ్ల బ్యాటరీ వారంటీ అందిస్తోంది.
పెట్రోల్ బైక్‌లకు ఆయిల్ ఛేంజ్, చైన్ మెయింటెనెన్స్ మస్ట్.. ఈవీలను వీలైనంత వరకు ఇంట్లోనే ఛార్జ్ చేస్తే ఖర్చు తగ్గుతుంది. కొనుగోలు ముందు షోరూమ్‌లో ధర, వారంటీ, కలర్ స్టాక్, డెలివరీ టైమ్ అన్ని తెలుసుకోవడం బెటర్..
