Best Visitor insurance : ఎన్నారైలకు బిగ్ అలర్ట్.. మీ పేరెంట్స్ అమెరికాకు వస్తున్నారా? ఈ ఒక్క ఇన్సూరెన్స్ తప్పక తీసుకోండి..!
Best Visitor insurance : మీ పేరెంట్స్ అమెరికాకు వస్తున్నారా? అయితే, వారి ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండండి. వారికి అనారోగ్య సమస్యలు ఉంటాయి.. అందుకే అమెరికాలో వైద్యం కోసం ముందుగానే విజిటర్ ఇన్సూరెన్స్ ఏదైనా తీసుకోవడం బెటర్..
Best Visitor insurance
- అమెరికాకు వస్తున్న పేరెంట్స్‌కు విజిటర్ ఇన్సూరెన్స్ ఉందా?
- అమెరికాలో వైద్య ఖర్చుల భయం వద్దు.. బెస్ట్ విజిటర్ ఇన్సూరెన్స్ ఎంచుకోండి
- ఒక్క ఇన్సూరెన్స్‌తో లక్షల రూపాయల వైద్య ఖర్చులకు రక్షణ
- విజిటర్ ఇన్సూరెన్స్‌తో వైద్య ఖర్చులకు పూర్తి రక్షణ!
Best Visitor Insurance : అమెరికాలో ఉండే ఎన్నారైలకు బిగ్ అలర్ట్.. భారత్ నుంచి మీ పేరెంట్స్ వస్తున్నారా? అయితే, అన్ని రెడీగా ఉంచుకున్నారా? చాలామంది ఇంట్లో తయారుచేసిన మసాలాలు, ఊరగాయలు, ఇష్టమైన ఆహారాల లిస్టును రెడీ చేస్తారు. విమాన టిక్కెట్లు బుక్ చేసుకోవడం, వీసాలు పొందడం వంటి ఈ హడావిడిలో అత్యంత ముఖ్యమైన విషయాన్ని మర్చిపోతుంటారు. ఒకవేళ అమెరికాలో మీ అమ్మ, నాన్న అనారోగ్యం పాలైతే? ఏం చేస్తారు? దీనిపై ఎవరూ ఆలోచించరు. కానీ, 60 ఏళ్లు పైబడిన తల్లిదండ్రులకు చాలా ముఖ్యం.
అమెరికాలో వైద్యం ఎంత ఖరీదైనదో మనందరికీ తెలుసు. ఒక చిన్న వైద్య చికిత్స లేదా ఆస్పత్రికి వెళ్లినా భారీ మొత్తంలో ఖర్చు అవుతుంది. ఇలాంటి పరిస్థితిలో ప్రతి ఎన్ఆర్ఐ తమ తల్లిదండ్రుల కోసం ‘విజిటర్స్ ఇన్సూరెన్స్’ తీసుకోవడం తప్పనిసరి. ఇది చాలా అవసరం. అందుకే తల్లిదండ్రుల కోసం ఎలాంటి ఇన్సూరెన్స్‌ను ఎలా ఎంచుకోవాలో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..
భారత్ ఆరోగ్య బీమా అమెరికాలో ఎందుకు పనిచేయదు? :
భారత్‌లో మీరు తీసుకున్న ఇన్సూరెన్స్ అమెరికాలో పనిచేస్తుందని చాలా మంది అంటుంటారు. కానీ, వాస్తవానికి చాలా అమెరికా ఆస్పత్రులు విదేశీ ఇన్సూరెన్స్‌ను గుర్తించవు. సరైన ఇన్సూరెన్స్ లేకుండా సాధారణ టెస్టు లేదా ఎమర్జెన్సీ రూమ్ విజిట్ కూడా వేల డాలర్లు ఖర్చు కావచ్చు.
అమెరికాకు అనుగుణంగా రూపొందించిన విజిటర్స్ ఇన్సూరెన్స్ మాత్రమే తీసుకోవాలి. అప్పుడే డాక్టర్ ఫీజులు, ఆస్పత్రి ఖర్చులు, అధిక మందుల బిల్లుల నుంచి కాపాడుతుంది. దీర్ఘకాలిక అనారోగ్యాలను తప్పకుండా చెక్ చేయండి. వయసు పెరిగే కొద్దీ, తల్లిదండ్రులకు రక్తపోటు, మధుమేహం లేదా గుండె జబ్బులకు సంబంధించిన సమస్యలు రావడం సర్వసాధారణం.
కొత్తగా ఇన్సూరెన్స్ తీసుకుంటే మీరు ప్రీ ఎగ్జిస్ట్ అనారోగ్య సమస్యలను వెల్లడించాలి. ఇలాంటి హెల్త్ ఇష్యూలన్నీ కవర్ చేసే ప్లాన్‌ను జాగ్రత్తగా ఎంచుకోవాలి. ఉదాహరణకు. మీ తల్లిదండ్రులకు బీపీ వంటి దీర్ఘకాలిక అనారోగ్యం లేదా ఎమర్జెన్సీ వంటి పరిస్థితులు ఉండి వెంటనే చికిత్స అవసరమైతే పాలసీ మొత్తం ఖర్చును భరిస్తుంది. ఫిక్స్డ్ ప్లాన్ కాకుండా ఎప్పుడూ కాంప్రహెన్సివ్ ప్లాన్ మాత్రమే ఎంచుకోండి.
ఇన్సూరెన్స్ ఎంచుకునేటప్పుడు.. మీకు 2 రకాల ప్లాన్లు కనిపిస్తాయి. ఫిక్స్డ్-బెనిఫిట్, కాంప్రహెన్సివ్. ఫిక్స్డ్ ప్లాన్లు చాలా చౌకగా ఉంటాయి. కానీ, ప్రతి చికిత్సకు వాటికి ఒక లిమిట్ ఉంటుంది. బిల్లు ఆ లిమిట్ మించిపోతే మిగిలిన మొత్తాన్ని మీరే చెల్లించక తప్పదు.
Read Also : EPFO PF Interest Rules : 45 ఏళ్లకే జాబ్ మానేస్తే PF ఖాతాలో వడ్డీ ఆగిపోతుందా? EPFO క్లారిటీ ఇదే..!
మీ తల్లిదండ్రులు వృద్ధులైతే చాలా ప్రమాదకరం. అందుకే ఎప్పుడూ కూడా కాంప్రహెన్సివ్ ప్లాన్‌ను ఎంచుకోండి. ఎందుకంటే.. ప్రారంభ ఖర్చు తర్వాత మిగిలిన బిల్లులో ఎక్కువ భాగాన్ని (పాలసీ లిమిట్ వరకు) ఇన్సూరెన్స్ కంపెనీ భరిస్తుంది. ఇన్సూరెన్స్ కొనుగోలు చేసే ముందు ఈ 5 ప్రశ్నలను మీకే మీరు వేసుకోండి.
మీ తల్లిదండ్రుల వయస్సు ఎంత? :
వయస్సును బట్టి ప్లాన్ రేట్లు, ఆప్షన్లు మారుతూ ఉంటాయి. కొన్ని ప్లాన్లు 99 ఏళ్ల వయస్సు వరకు ఉన్న సీనియర్లను కూడా కవర్ చేస్తాయి.
మీతో ఎంత కాలం ఉంటారు? :
3 వారాలు లేదా 6 నెలలు విదేశాల్లో ఉండాల్సి వస్తే.. ఇన్సూరెన్స్ రిక్వైర్మెంట్స్ వేర్వేరుగా ఉంటాయి. అవేంటో చెక్ చేసుకోవాలి.
మీ కవరేజ్ లిమిట్ ఎంత ఉండాలి? :
యునైటెడ్ స్టేట్స్లో వైద్య చికిత్స ఖర్చును పరిశీలిస్తే.. 50వేల డాలర్ల నుంచి 100,000 డాలర్ల కవరేజ్ లిమిట్ ఉన్న ప్లాన్ తల్లిదండ్రులకు బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు.
మీ డిడక్టిబుల్ ఎంత? :
డిడక్టిబుల్ అంటే.. మీ ఇన్సూరెన్స్ వర్తించే ముందు మీ జేబు నుంచి చెల్లించాల్సిన మొత్తం అనమాట.. అంటే మీ బడ్జెట్‌కు అనుగుణంగా మీ బీమా ప్రీమియం ఎంత కట్టాలో నిర్ణయించుకోండి.
వేర్వేరు పాలసీలు కొనుగోలు చేశారా? :
మీ తల్లిదండ్రులద్దరి కోసం ఎప్పుడూ జాయింట్ పాలసీని తీసుకోవద్దు. ఇద్దరికీ వేర్వేరు వైద్య అవసరాలు ఉంటాయి. అందుకే ఎల్లప్పుడూ ఇద్దరికీ వేర్వేరు పాలసీలను తీసుకోవడం బెటర్.
ఈ తప్పులు చేయొద్దు :
చాలామంది ఎక్కువగా బీమా ప్రీమియం ఎంత ఎందో చూసి తీసుకుంటారు. అత్యంత చౌకైన బీమా పథకాన్ని ఎంచుకుంటారు. సంక్షోభ సమయాల్లో ఈ బీమా ఏమాత్రం ఉపయోగపడదు. మరో పెద్ద సమస్య ఏంటంటే.. హెల్త్ నెట్వర్క్ ఉందో లేదో చెక్ చేయరు. అమెరికాలోని నెట్‌వర్క్‌కు లింక్ చేసినా పథకాన్ని మాత్రమే ఎంచుకోండి. క్యాష్ లెస్ ట్రీట్ మెంట్, ఈజీగా క్లెయిమ్ చేసుకోవచ్చు.
సరైన బీమాను ఎక్కడ? ఎలా పొందాలి? :
ఇన్సూరెన్స్ కంపెనీల వెబ్సైట్లను వెతకడం, ఎలాంటి బెనిఫిట్స్ ఉన్నాయో అర్థం చేసుకోవడం కష్టమైన పనే.. ఎన్ఆర్ఐల కోసం అద్భుతమైన విజిటర్స్ కవరేజ్ వంటి ప్లాట్‌ఫారమ్‌లు అందుబాటులో ఉన్నాయి. 2006లో ప్రారంభమైన ఈ సిలికాన్ వ్యాలీ ఆధారిత కంపెనీ ఎన్నారైలలో బాగా పాపులర్.
మీరు వేలకొద్దీ వేర్వేరు వెబ్సైట్లలో వెతకాల్సిన అవసరం లేదు. మీరు వెబ్సైట్లో టాప్ రేంజ్ కంపెనీల బీమాలతో పక్కపక్కనే పోల్చి చూడవచ్చు. ఏ పథకాలు దీర్ఘకాలిక అనారోగ్యాలను కవర్ చేస్తాయి? ఏ నెట్‌వర్క్‌లు అందుబాటులో ఉన్నాయి? ధర ఎంత ఉందో కూడా మీరు చెక్ చేసుకోవచ్చు.
