EPFO PF Interest Rules : 45 ఏళ్లకే జాబ్ మానేస్తే PF ఖాతాలో వడ్డీ ఆగిపోతుందా? EPFO క్లారిటీ ఇదే..!
EPFO PF Interest Rules : 45 ఏళ్ల వయసులో జాబ్ మానేస్తే.. మీ PF ఖాతాలో జమ చేసిన మొత్తంపై 58 ఏళ్లు వచ్చే వరకు వడ్డీ వస్తూనే ఉంటుంది. ఉద్యోగాన్ని ముందుగానే మానేసినవారికి పీెఫ్ రూల్స్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..
EPFO PF Interest Rules
- జాబ్ వదిలేసినా PFపై వడ్డీ వస్తుందా? కొత్త ఈపీఎఫ్ఓ రూల్స్ ఏంటి?
- 45ఏళ్లకే రిటైర్ అయితే PF డబ్బు వడ్డీ పెరుగుతుందా? ఆగుతుందా?
- PF వడ్డీపై పెద్ద అపోహ.. ముందుగానే జాబ్ మానేస్తే ఏమవుతుంది?
EPFO PF Interest Rules : పీఎఫ్ ఖాతాదారులకు బిగ్ అలర్ట్.. మీరు ముందుగానే ఉద్యోగం మానేస్తే.. మీ పీఎఫ్ ఖాతా డిపాజిట్లపై వడ్డీ రావడం ఆగుతుందా? లేదా? చాలా మందికి ఈ సందేహం ఉంటుంది.
ఒక వ్యక్తి 45 ఏళ్ల వయస్సులో ఉద్యోగం మానేసినప్పటికీ, 58 ఏళ్లు వచ్చే వరకు సదరు వ్యక్తి పీఎఫ్ ఖాతా డిపాజిట్లపై వడ్డీ వస్తూనే ఉంటుంది. 2016 సవరణ తర్వాత వడ్డీ నిబంధనలు మారాయి. రిటైర్మైంట్ కు ముందుగానే ఉద్యోగం మానేసినవారికి పీఎఫ్ ఖాతాలోని డబ్బుపై వడ్డీ ఆగిపోతుందా? లేదో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..
పీఎఫ్ ఖాతాపై వడ్డీ వస్తుందా? :
పీఎఫ్ ఖాతాకు రిటైర్మెంట్ వయస్సు 58 ఏళ్లు. మీరు అంతకన్నా ముందే ఉద్యోగం మానేసినా లేదా మారినా వడ్డీ నిబంధనలు తప్పక తెలుసుకోవాలి. మూడేళ్ల తర్వాత డిపాజిట్లు డిపాజిట్ ఆగిపోతే పీఎఫ్ అకౌంట్ ఇన్ యాక్టివ్ అవుతుంది. కానీ, ఇప్పుడు అలా కాదు.. కొత్త నిబంధన ప్రకారం.. ఖాతాదారునికి 58 ఏళ్ల వయస్సు వచ్చే వరకు పీఎఫ్ ఖాతాలో జమ చేసిన మొత్తంపై వడ్డీ చెల్లిస్తూనే ఉంటారు.
చాలా మంది తమ ఖాతా మూడేళ్లలో ఇన్ యాక్టివ్ అయిందని, ఉద్యోగం కోల్పోయిన తర్వాత గడువుకు ముందే డబ్బును విత్ డ్రా చేసుకుంటారు. ఖాతాదారునికి 58 ఏళ్ల వయస్సు వచ్చిన తర్వాత ఆ ఖాతా ఇన్ యాక్టివ్ అవుతుంది. అంటే మీ ఖాతాకు ఇకపై వడ్డీ జమ అవ్వదు అనమాట.
జాబ్ మారితే ఏం చేయాలి? :
మీరు ముందుగానే ఉద్యోగం మానేసినా లేదా ఉద్యోగాలు మారినా మీ పీఎఫ్ ఖాతాలోని మొత్తం బ్యాలెన్స్‌ను విత్‌డ్రా చేయాల్సిన పనిలేదు. అయితే, ఉద్యోగం మానేసిన తర్వాత కొద్ది మొత్తాన్ని విత్‌డ్రా చేసుకోవచ్చని నిబంధనలు చెబుతున్నాయి. అయితే, మీరు జాబ్ మారినప్పుడు, కొత్త అకౌంట్ ఓపెన్ చేయకుండా ఈ పీఎఫ్ అకౌంటును ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు.
ఈపీఎఫ్ఓ రూల్స్ ప్రకారం..
మీరు 58 ఏళ్ల వయస్సు రాకముందే ఉద్యోగం మానేసినా లేదా ఉద్యోగాలు మారినా మీ పీఎఫ్ ఖాతాలోని మొత్తం బ్యాలెన్స్‌ను విత్‌డ్రా అవసరం లేదు. మీకు 58 ఏళ్లు వచ్చే వరకు మీ పీఎఫ్ ఖాతాలోని డిపాజిట్లపై వడ్డీ వస్తూనే ఉంటుంది. అంటే.. 45 ఏళ్ల వయస్సులో ఉద్యోగం మానేసినప్పటికీ, మీకు 58 ఏళ్లు వచ్చే వరకు మీ పీఎఫ్ ఖాతాపై వడ్డీ వస్తూనే ఉంటుంది.
