Instagram-Facebook Down : ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ డౌన్.. ఏం జరిగింది? ప్రపంచవ్యాప్తంగా యూజర్ల ఫిర్యాదుల వెల్లువ!
Instagram-Facebook Down : ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ సేవలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. వినియోగదారులు ఫీడ్లను లోడ్ చేయడంలో డైరెక్ట్ మెసేజ్‌లను పంపడంలో సమస్యలను ఎదుర్కొంటున్నారు. అంతరాయంపై మెటా ఇంకా స్పందించలేదు.
Instagram-Facebook Down
- వేలాది మంది యూజర్లకు షాక్.. ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ సేవలు నిలిచిపోయాయి
- మెటా యాప్‌లకు భారీ సాంకేతిక సమస్య.. సోషల్ మీడియా యూజర్లకు తలనొప్పి
- ప్రపంచవ్యాప్తంగా మెటా సర్వీసులు డౌన్.. లాగిన్ కాక యూజర్ల ఆందోళన
Instagram-Facebook Down : మీ ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ అకౌంట్లు ఓపెన్ అవుతున్నాయా? చెక్ చేశారా? ఇప్పుడే ఓసారి లాగిన్ అయ్యేందుకు ట్రై చేయండి.. భారత్ పాటు అమెరికా, సింగపూర్ సహా పలు దేశాల్లో ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ సేవల్లో అంతరాయం ఏర్పడింది. భారత్ సహా చాలా దేశాల్లో ఆదివారం (జూలై 19) ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ అకౌంట్లు లోడ్ అవ్వడం లేదు. లాగిన అయిన ఫీడ్ ఓపెన్ అవ్వడం లేదని యూజర్లు ఫిర్యాదులు చేస్తున్నారు.
ముఖ్యంగా ఇన్‌స్టాగ్రామ్‌లో ఫీడ్లు రిఫ్రెష్ కాకపోవడం, డైరెక్ట్ మెసేజ్‌లు పంపలేకపోవడం వంటి సమస్యలను భారతీయ యూజర్లు నివేదించారు. ఫేస్బుక్లో కూడా లాగిన్, వెబ్సైట్ యాక్సెస్‌కు సంబంధించిన అనేక సమస్యలు తలెత్తాయి. ఫేస్ బుక్ అకౌంట్ లాగిన అయ్యాక (Account Temporarily Unavailable) అనే మెసేజ్ కనిపిస్తోంది.
డౌన్‌డిటెక్టర్ రిపోర్టును పరిశీలిస్తే.. :
భారత కాలమానం ప్రకారం.. మధ్యాహ్నం 2:20 గంటల సమయానికి ఇన్‌స్టాగ్రామ్‌పై 1,900కు పైగా, ఫేస్‌బుక్‌పై 600కుపైగా ఫిర్యాదులు నమోదయ్యాయి. అమెరికాలో కూడా ఇదే పరిస్థితి కనిపిస్తోంది.
అక్కడ ఫేస్‌బుక్‌కు సంబంధించి 4,800కు పైగా, ఇన్‌స్టాగ్రామ్‌కు 2,800కు పైగా సమస్యల రిపోర్టులు నమోదయ్యాయి. ఇందులో ఎక్కువమంది ఫేస్బుక్ వెబ్‌సైట్‌ను యాక్సెస్ చేయలేకపోతున్నట్లు ఎక్కువ మంది యూజర్లు చెబుతున్నారు.
మెటా సంస్థ ఇంకా స్పందించలేదు :
సింగపూర్‌లో కూడా ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ సేవులు డౌన్ అయ్యాయి. ఈ రెండు ప్లాట్‌ఫారమ్‌ల సేవలు దాదాపు చాలా దేశాల్లో నిలిచిపోయినట్టు తెలుస్తోంది. అయితే, డౌన్‌డిటెక్టర్ గణాంకాలను పరిశీలిస్తే.. వినియోగదారుల నివేదికల ఆధారంగా అసలు సంఖ్య ఇంకా ఎక్కువగా ఉండే అవకాశం ఉంది.
ఈ అంతరాయంపై మెటా సంస్థ ఇప్పటివరకు అధికారిక ప్రకటన చేయలేదు. సమస్యకు కారణం ఏంటి? సేవలు పూర్తిగా ఎప్పుడు రీస్టోర్ అవుతాయి అనేదానిపై కూడా స్పష్టత లేదు. కొందరికి సేవలు సాధారణంగా అందుబాటులో ఉండగా, మరికొందరికి ఫీడ్లు లోడ్ కాకపోవడం, మెసేజ్ పంపలేకపోవడం వంటి సమస్యలు ఎదురవుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా మెటా సేవలకు అంతరాయం ఏర్పడిందని అంటున్నారు.
