Bharat Taxi Sarathi Didi : మహిళల కోసం మహిళా డ్రైవర్లు, భారత్ టాక్సీ కొత్త ‘సారథి దీదీ’ సర్వీసు.. ఇలా బుక్ చేయండి
Bharat Taxi : మహిళా డ్రైవర్ల కోసం భారత్ టాక్సీ కొత్త సర్వీసును ప్రారంభించింది. ఈ సర్వీసు ద్వారా మహిళలకు మరిన్ని ఉద్యోగ, సంపాదనా అవకాశాలను కూడా సృష్టిస్తుంది.
Bharat Taxi Sarathi Didi service
- మహిళా డ్రైవర్ల కోసం భారత్ టాక్సీ కొత్త సర్వీసు ప్రారంభం
- ఈ సర్వీసుతో మహిళలకు మరిన్ని ఉద్యోగ, సంపాదనా అవకాశాలు రావచ్చు
- భద్రత, గౌరవంతో పాటు డ్రైవర్-ఫ్రెండ్లీ మోడల్ ఫాలో అవుతుంది
Bharat Taxi : మహిళలకు గుడ్ న్యూస్. భారత్ టాక్సీ నుంచి కొత్త సారథి దీదీ సర్వీసు అందుబాటులోకి వచ్చింది. ఈ మేరకు కంపెనీ ప్రకటించింది. ఒంటరిగా ప్రయాణించే మహిళలకు ప్రయాణాన్ని సురక్షితంగా మరింత సౌకర్యవంతంగా అందించేందుకు ఈ ప్రత్యేక సౌకర్యాన్ని అందిస్తోంది. భారత్ టాక్సీ యాప్‌లోని స్పెషల్ విండో ద్వారా మహిళా ప్రయాణీకులు మహిళా సారథి నడిచే రైడ్లను మాత్రమే ఎంచుకోవచ్చు.
మహిళా డ్రైవర్లకు మరిన్ని ఉపాధి అవకాశాలను అందించడమే లక్ష్యమని కంపెనీ చెబుతోంది. కంపెనీ డ్రైవర్లను కార్మికుల మాదిరిగా కాకుండా యజమానులు, భాగస్వాములుగా చూస్తుంది. దాంతో ప్రతి రైడ్ బాధ్యత, పరస్పర గౌరవంతో ఉంటుంది.
సారథి దీదీ సర్వీసు ఏంటి? :
భారత్ టాక్సీ యాప్‌లో సారథి దీదీ సర్వీస్ ఒక స్పెషల్ ఫీచర్. ఒంటరిగా ప్రయాణంచే మహిళల కోసం ఈ కొత్త ఫీచర్ అందుబాటులోకి వచ్చింది. మహిళా ప్రయాణీకులు ఎప్పుడైనా రైడ్ బుక్ చేసుకున్నప్పుడు మహిళా సారథికి ప్రాధాన్యత ఇస్తారు. ఈ సర్వీసు చాలా సేఫ్, ఎంతో సౌకర్యవంతమైన ప్రయాణాన్ని అందిస్తుంది. రాబోయే రోజుల్లో మరింత మంది మహిళలు సారథిలుగా ఈ ప్లాట్ ఫారంలో చేరుతారని కంపెనీ భావిస్తోంది.
మహిళా డ్రైవర్ల కోసం సారథి దీదీతో పాటు ప్లాట్‌ఫామ్ యజమానులు స్కూటీ రైడ్లు వంటి మహిళా-సెంట్రలైజడ్ సర్వీసులను కూడా ప్రవేశపెట్టింది ప్రభుత్వం. దీనివల్ల మహిళలకు కొత్త ఉద్యోగ అవకాశాలు వస్తాయని మహిళలకు తమ పూర్తి సపోర్టు ఉంటుందని కంపెనీ చెబుతోంది.
సహకార నిర్మాణం కింద భారత్ టాక్సీ, సార్తి దీదీతో సహా అన్ని సారథిలను వాటాదారులుగా భావిస్తుంది. ఇంకా, సార్తి దీదీ రైడర్లు కూడా వాటాదారులుగా మారవచ్చు. ముందుగా నిర్ణయం తీసుకునే ప్రక్రియలలో జాయిన్ అవ్వొచ్చు.
‘భద్రత మాత్రమే కాదు.. గౌరవం కూడా’
మహిళా డ్రైవర్ల కోసం సారథి దీదీ అనే గౌరవప్రదమైన గుర్తింపు అందిస్తోంది. ఇకపై మహిళలు కూడా ప్రయాణాల సమయంలో ఈ సర్వీసు వినియోగించుకోవచ్చు. మహిళల తోపాటు పురుషులుక కూడా ఈ సర్వీసును వినియోగించుకోవచ్చు.
- మహిళా డ్రైవర్ మాత్రమే
- ట్రిప్ ట్రాకింగ్ సదుపాయం
- ఎమర్జెన్సీ సపోర్ట్
- 24/7 కస్టమర్ సపోర్ట్
భారత్ టాక్సీ ఎలా పనిచేస్తుంది? :
భారత్ టాక్సీ ఒక మోడల్‌పై రన్ అవుతుంది. ఇందులో డ్రైవర్ల ఆదాయం నుంచి ఎలాంటి కమిషన్ ఉండదు. రైడర్లు తమకు పడిన ఛార్జీని మాత్రమే చెల్లిస్తారు. ఎక్స్ ట్రా ఛార్జీలతో ఆదాయం తగ్గదు. సరైన విచారణ లేకుండా ఏ అకౌంట్ క్లోజ్ చేయదని కంపెనీ క్లారిటీ ఇచ్చింది.
సారథి దీదీ రైడ్ ఎలా బుక్ చేసుకోవాలి :
1.లాగిన్ లేదా రిజిస్టర్ అవ్వండి
భారత్ టాక్సీ వెబ్సైట్, యాప్‌లో మీ మొబైల్ నంబర్‌తో లాగిన్ అవ్వండి.
2. పికప్ అండ్ డ్రాప్ లొకేషన్ ఎంటర్ చేయండి
మీ ప్రయాణం ప్రారంభ లొకేషన్ నుంచి డిస్టినేషన్ ఎంటర్ చేయండి.
3.“సారథి దీదీ సర్వీసు” ఆప్షన్ ఎంచుకోండి
రైడ్ ఆప్షన్లలో మహిళల ప్రత్యేక సేవ ‘సారథి దీదీ’ సెలక్ట్ చేయండి.
4.రైడ్ కన్ఫర్మ్ చేయండి
డ్రైవర్ వివరాలు, వాహనం సమాచారం చూసి బుకింగ్ కన్ఫర్మ్ చేయండి.
5. సురక్షితంగా ప్రయాణించండి
మహిళా డ్రైవర్‌తో భద్రంగా మీ గమ్యానికి చేరుకోండి.
