Renault Cars Big Discounts : కొత్త కారు కొంటున్నారా? రెనాల్ట్ కార్లపై భారీ డిస్కౌంట్లు.. ఏకంగా రూ.65వేల వరకు తగ్గింపు..!

Renault Cars Big Discounts : కొత్త కారు కొనేవారికి ఇదే సరైన సమయం.. డిసెంబర్ 31, 2023 వరకు రెనాల్ట్ ఇండియా తమ కార్ల కొనుగోలుపై భారీ డిస్కౌంట్లను అందిస్తోంది. రెనాల్ట్ కిగర్ గరిష్ట తగ్గింపుతో అందుబాటులో ఉంది.

Renault Cars Big Discounts : కొత్త కారు కొంటున్నారా? రెనాల్ట్ కార్లపై భారీ డిస్కౌంట్లు.. ఏకంగా రూ.65వేల వరకు తగ్గింపు..!

Big discounts of up to Rs 65,000 on Renault Kwid, Kiger and more

Renault Cars Big Discounts : కొత్త కారు కొనేందుకు ప్లాన్ చేస్తున్నారా? 2023 సంవత్సరాంతంలో పలు ఆటోమొబైల్ కంపెనీలు తమ కార్లపై భారీ డిస్కౌంట్లను అందిస్తున్నాయి. ఇప్పటికే పలు బ్రాండ్ల కార్లపై ఇయర్ ఎండ్ సేల్ కింద తక్కువ ధరకే కార్లను ఆఫర్ చేస్తున్నాయి. ఇప్పుడు మరో ఆటోమొబైల్ దిగ్గజం రెనాల్ట్ కార్స్ ఇండియా కూడా తమ కార్ల మోడల్స్‌పై ఆకర్షణీయమైన డిస్కౌంట్లను అందిస్తోంది.

Read Also : Kinetic Green Zulu Scooter : భారత్‌కు కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ వచ్చేసిందోచ్.. సింగిల్ ఛార్జ్‌తో 104కి.మీ దూసుకెళ్తుంది..!

ఈ తగ్గింపులు అనేవి క్యాష్ డిస్కౌంట్, ఎక్స్ఛేంజ్ డిస్కౌంట్, లాయల్టీ బెనిఫిట్స్ అందిస్తోంది. డిసెంబర్ 31, 2023 వరకు ఈ డిస్కౌంట్లు అందుబాటులో ఉంటాయి. రెనాల్ట్ మోడల్ కిగర్ ఇతర కార్ల మోడల్స్ కన్నా గరిష్ట తగ్గింపుతో అందుబాటులో ఉంది. రెనాల్ట్ క్విడ్‌ నుంచి ప్రతి మోడల్ గరిష్టంగా రూ. 50వేల తగ్గింపును అందిస్తోంది. ఇందులో రూ. 20వేల క్యాష్ డిస్కౌంట్, ఎంపిక చేసిన వేరియంట్‌లపై రూ. 20వేల ఎక్స్ఛేంజ్ బెనిఫిట్స్, అదనంగా రూ. 10వేల లాయల్టీ బోనస్ కూడా పొందవచ్చు.

ఎవరెవరు అర్హులు.. ఎంత డిస్కౌంట్? :
హ్యాచ్‌బ్యాక్‌లో రూ. 12వేల వరకు కార్పొరేట్ డిస్కౌంట్ కూడా పొందవచ్చు. రైతులు, సర్పంచ్ గ్రామ పంచాయతీ సభ్యులతో సహా గ్రామీణ కొనుగోలుదారులు రూ. 5వేల తగ్గింపుకు అర్హులు. క్విడ్ ఆర్ఎక్స్‌ఈ వేరియంట్, అర్బన్ నైట్ లిమిటెడ్ ఎడిషన్ ఎలాంటి క్యాష్ డిస్కౌంట్ లేకుండా లాయల్టీ, ఎక్స్ఛేంజ్ బెనిఫిట్స్ మాత్రమే అందిస్తుంది.

Big discounts of up to Rs 65,000 on Renault Kwid, Kiger and more

 Renault Kwid Discounts

రెనాల్ట్ ట్రైబర్ రూ. 50వేల వరకు బెనిఫిట్స్ పొందవచ్చు. ఎంపిక చేసిన వేరియంట్‌లపై రూ. 20వేల క్యాష్ డిస్కౌంట్, రూ. 20వేల ఎక్స్ఛేంజ్ బోనస్, విశ్వసనీయ కస్టమర్లకు అదనంగా రూ. 10వేల క్యాష్ డిస్కౌంట్, క్విడ్ మాదిరిగానే, ట్రైబర్‌లో రూ. 12వేల కార్పొరేట్ డిస్కౌంట్, గ్రామీణ వినియోగదారులకు రూ. 5వేల క్యాష్ డిస్కౌంట్ ఉన్నాయి.

ఎంపిక చేసిన వేరియంట్లపై అదనపు డిస్కౌంట్లు :
రెనాల్ట్ కిగర్ మోడల్ సబ్‌కాంపాక్ట్ ఎస్‌యూవీ గరిష్టంగా రూ. 65వేల బెనిఫిట్స్ కూడా అందిస్తుంది. ఇందులో ఆర్ఎక్స్‌జెడ్‌పై రూ. 20వేల ఆర్ఎక్స్‌టీ ఆర్ఎక్స్‌టీ (ఓ) టర్బో వేరియంట్‌లపై రూ. 25వేల వరకు క్యాష్ బెనిఫిట్స్ ఉన్నాయి. అదనంగా, ఈ మోడల్ విశ్వసనీయ కస్టమర్ల కోసం ఎంపిక చేసిన వేరియంట్‌లపై రూ. 20వేల క్యాష్ ఎక్స్ఛేంజ్ బెనిఫిట్స్ కూడా అందిస్తుంది.

కస్టమర్ ప్రూఫ్ సమర్పణపై అదనపు లాయల్టీ ఆఫర్‌ల అవకాశం కూడా ఉంది. అంతేకాకుండా, కిగర్ కార్పొరేట్ డిస్కౌంట్ రూ. 12వేలు, రూ. 5వేల వరకు రూరుల్ డిస్కౌంట్ అందిస్తుంది. అదనంగా, ఆటోమేకర్ పాత వాహనాలను స్క్రాప్ చేసే యూజర్ల కోసం ఆర్ఈఎల్ఐవీఈ స్క్రాప్‌పేజ్ ప్రోగ్రామ్ కింద రూ. 10వేల డిస్కౌంట్ అందిస్తుంది.

Read Also : Samsung Galaxy F14 5G : అత్యంత సరసమైన ధరకే శాంసంగ్ గెలాక్సీ F14 5జీ ఫోన్.. ఈ డీల్ అసలు మిస్ చేసుకోవద్దు!