Samsung Galaxy F14 5G : అత్యంత సరసమైన ధరకే శాంసంగ్ గెలాక్సీ F14 5జీ ఫోన్.. ఈ డీల్ అసలు మిస్ చేసుకోవద్దు!

Samsung Galaxy F14 5G : కొత్త ఫోన్ కొంటున్నారా? శాంసంగ్ గెలాక్సీ ఎఫ్14 5జీ ఫోన్ అత్యల్ప ధరకు అందుబాటులో ఉంది. ఇదే బెస్ట్ డీల్ అని చెప్పవచ్చు. ఈ డీల్ ఎలా పని చేస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం.

Samsung Galaxy F14 5G : అత్యంత సరసమైన ధరకే శాంసంగ్ గెలాక్సీ F14 5జీ ఫోన్.. ఈ డీల్ అసలు మిస్ చేసుకోవద్దు!

Samsung Galaxy F14 5G gets discount and it looks to be the best phone around Rs 10,000

Samsung Galaxy F14 5G : ప్రముఖ సౌత్ కొరియన్ దిగ్గజం శాంసంగ్ గెలాక్సీ ఎఫ్14 5జీ ఫోన్ అత్యంత సరసమైన ధరకే కొనుగోలు చేయొచ్చు. ఈ డివైజ్ అధిక ధర కలిగిన శాంసంగ్ గెలాక్సీ ఎం14 5జీ స్మార్ట్‌ఫోన్‌తో సమానంగా ఉంటుంది. ఇందులో గెలాక్సీ ఎమ్ సిరీస్ మోడల్‌తో పోలిస్తే.. ఎఫ్ సిరీస్ మోడల్‌లో వెనుకవైపు చిన్న కెమెరా మాత్రమే ఉంది.

Read Also : BMW Cars Price Hike : జనవరి 1 నుంచి భారీగా పెరగనున్న బీఎండబ్ల్యూ కార్ల ధరలు.. అసలు కారణం ఇదే!

కానీ, రెండింటిలో పెద్దగా తేడా లేదనే చెప్పాలి. ఫ్లిప్‌కార్ట్ ఇయర్ ఎండ్ సేల్ సమయంలో శాంసంగ్ గెలాక్సీ ఎఫ్14 ధర రూ. 11,490కి పడిపోయింది. కొన్ని బ్యాంక్ ఆఫర్లతో ధరను కొంత మేర తగ్గించుకోవచ్చు. ప్రస్తుత ధర ప్రకారం.. బడ్జెట్ శాంసంగ్ ఫోన్ దాదాపు రూ. 10వేల విలువైన ఫోన్‌గా కనిపిస్తోంది. వివరాలు ఇలా ఉన్నాయి.

శాంసంగ్ గెలాక్సీ ఎఫ్14 5జీ డిస్కౌంట్ డీల్ :
శాంసంగ్ గెలాక్సీ ఎఫ్14 5జీ ఫోన్ రూ.11,490 తగ్గింపు ధరతో అందుబాటులో ఉంది. ఈ బడ్జెట్ శాంసంగ్ ఫోన్ భారత మార్కెట్లో రూ. 12,990 ప్రారంభ ధరతో వస్తుంది. వినియోగదారులు రూ.1,500 ఫ్లాట్ డిస్కౌంట్ పొందవచ్చు. కొన్ని బ్యాంకు కార్డులపై అదనంగా 10 శాతం తగ్గింపు ఆఫర్ కూడా పొందవచ్చు. మీరు బ్యాంక్ ఆఫర్‌ని పొందకపోయినా, శాంసంగ్ గెలాక్సీ ఎమ్14 5జీతో అదే ఫీచర్‌లను కొంచెం ఎక్కువ ధరకు పొందవచ్చు.

Samsung Galaxy F14 5G gets discount and it looks to be the best phone around Rs 10,000

Samsung Galaxy F14 5G discount 

శాంసంగ్ గెలాక్సీ ఎఫ్14 5జీ కొనుగోలు చేయొచ్చా? :
మీరు శాంసంగ్ గెలాక్సీ ఎఫ్14 స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలుకు మొదటి కారణాలలో 5జీకి సపోర్టు చేయడమే. 5జీ సపోర్టుతో ఇదే ధర పరిధిలో చాలా తక్కువ ఆప్షన్లు ఉన్నాయి. ఇప్పుడు లేటెస్ట్ నెట్‌వర్క్ భారత్ అంతటా అందుబాటులో ఉంది. అందుకే ఈ 5జీ ఫోన్‌ను కొనుగోలు చేయడం బెస్ట్ అని చెప్పవచ్చు. ఈ బడ్జెట్ ఫోన్ వినియోగదారులు క్యాండీ క్రష్ వంటి కొన్ని గేమ్‌లను వేగంగా ఆడుకోవచ్చు. ఇందులో సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా ఉంది.

శాంసంగ్ గెలాక్సీ ఎఫ్14 5జీ కొనుగోలుకు మరొక కారణం బ్యాటరీ లైఫ్. ఈ డివైజ్ సగటు వినియోగంతో పూర్తిగా 2 రోజుల వరకు ఛార్జింగ్ వస్తుందని కంపెనీ వెల్లడించింది. 5జీ ఫోన్‌లో భారీ 6,000ఎంఎహెచ్ బ్యాటరీతో వస్తుంది. గెలాక్సీ ఎఫ్14 కెమెరా పర్పార్మెన్స్ కూడా బాగుంది. కొన్ని షాట్‌లలో కలర్లు కొంచెం వైబ్రెంట్‌గా అనిపించవచ్చు. వినియోగదారులు రిటైల్ బాక్స్‌లో ఛార్జర్‌ను పొందలేరు. అదనపు ఖర్చు లేకుండా ఉండేందుకు పాత ఛార్జర్‌ను వినియోగించవచ్చు.

Read Also : Kinetic Green Zulu Scooter : భారత్‌కు కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ వచ్చేసిందోచ్.. సింగిల్ ఛార్జ్‌తో 104కి.మీ దూసుకెళ్తుంది..!