BMW Cars Price Hike : జనవరి 1 నుంచి భారీగా పెరగనున్న బీఎండబ్ల్యూ కార్ల ధరలు.. అసలు కారణం ఇదే!
BMW Cars Price Hike : కొత్త కారు కొనేందుకు ప్లాన్ చేస్తున్నారా? అయితే, ఇప్పుడే కొనేసుకోవడం బెటర్.. 2024 జనవరి 1 నుంచి బీఎండబ్ల్యూ కార్ల ధరలు భారీగా పెరగనున్నాయి. పెరుగుతున్న ఇన్‌పుట్ ఖర్చులు, మారకపు ధరలలో హెచ్చుతగ్గులతో ధరలను పెంచనున్నట్టు కంపెనీ ప్రకటించింది.

BMW cars to become more expensive from January 1
BMW Cars Price Hike : 2024 ఏడాది నుంచి కార్ల ధరలు భారీగా పెరగనున్నాయి. ఇప్పటికే పలు ఆటోమొబైల్ కంపెనీలు తమ కార్ల ధరలను పెంచనున్నట్టు ప్రకటించాయి. మారుతి సుజుకి, మహీంద్రా, టాటా, ఆడి వంటి కార్ల కంపెనీలు తమ కార్ల ధరను పెంచనున్నట్టు వెల్లడించాయి.
ఇప్పుడు అదే బాటలో ప్రముఖ ఆటోమొబైల్ లగ్జరీ కంపెనీ బీఎండబ్ల్యూ కూడా కార్ల ధరలను పెంచనున్నట్టు ప్రకటించింది. పెరుగుతున్న ఇన్‌పుట్ ఖర్చులు, మారకపు ధరలలో హెచ్చుతగ్గుల కారణంగా జనవరి 1, 2024 నుంచి తమ కార్ల ధరలను పెంచనున్నట్లు బీఎండబ్ల్యూ ఇండియా ప్రకటించింది. మొత్తం బీఎండబ్ల్యూ మోడల్ కార్ల ధరలు 2శాతం వరకు పెంచనున్నట్టు కంపెనీ వెల్లడించింది.
Read Also : MG Motor Car Price Hike : మారుతి, టాటా బాటలో ఎంజీ మోటార్.. 2024 జనవరిలో పెరగనున్న కార్ల ధరలు..!
స్థానికంగా ఉత్పత్తి చేసిన కార్ల తయారీదారుల శ్రేణిలో బీఎండబ్ల్యూ 2 సిరీస్ గ్రాన్ కూపే, బీఎండబ్ల్యూ 3 సిరీస్ గ్రాన్ లిమోసిన్, బీఎండబ్ల్యూ ఎమ్ 340ఐ, బీఎండబ్ల్యూ 5 సిరీస్, బీఎండబ్ల్యూ 6 సిరీస్, బీఎండబ్ల్యూ 7 సిరీస్, బీఎండబ్ల్యూ ఎక్స్ 1, బీఎండబ్ల్యూ ఎక్స్3, బీఎండబ్ల్యూ ఎక్స్7, బీఎండబ్ల్యూ మినీఎక్స్ 5 వంటి మోడల్స్ ఉన్నాయి.
బీఎండబ్ల్యూ జెడ్4, బీఎండబ్ల్యూ ఎమ్4 కూపే, బీఎండబ్ల్యూ ఎక్స్3 ఎం40ఐ, బీఎండబ్ల్యూ ఎక్స్4 ఎమ్40ఐ, బీఎండబ్ల్యూ ఎమ్5, బీఎండబ్ల్యూ ఎమ్8 కూపే, బీఎండబ్లయూ ఎక్స్ఎమ్, బీఎండబ్ల్యూ ఐఎక్స్1, బీఎండబ్ల్యూఐ4, బీఎండబ్ల్యూ ఐ7, బీఎండబ్ల్యూ ఐఎక్స్ వంటి ఎలక్ట్రిక్ కార్లు దేశంలో పూర్తిగా అందుబాటులో ఉన్నాయి.

BMW cars expensive
ధరల పెంపునకు ఇదే కారణం :
అభివృద్ధి చెందుతున్న డైనమిక్స్, మారకపు రేట్లలో హెచ్చుతగ్గులు, పెరుగుతున్న ఇన్‌పుట్ ఖర్చుల నేపథ్యంలో ఈ ధరలను పెంచడం తప్పడం లేదని బీఎండబ్ల్యూ గ్రూప్ ఇండియా అధ్యక్షుడు విక్రమ్ పవా అన్నారు. బీఎండబ్ల్యూ గ్రూప్ బీఎండబ్ల్యూ ఇండియాలో రూ. 520 కోట్లకు పైగా పెట్టుబడి పెట్టింది. భారత్‌లో విస్తృత శ్రేణి కార్యకలాపాలలో చెన్నైలో తయారీ ఫ్యాక్టరీ, పూణేలో విడిభాగాల తయారీ ప్లాంట్, గురుగ్రామ్‌లో ట్రైనింగ్ సెంటర్, దేశంలోని మెట్రోపాలిటన్ కేంద్రాలలో డీలర్ సంస్థ అందుబాటులో ఉంది.
మొత్తం ద్రవ్యోల్బణం పెరుగుతున్న కమోడిటీ ధరల కారణంగా పెరిగిన ధరల ఒత్తిడి నేపథ్యంలో కార్ల ధరలను పెంచుతూ నిర్ణయం తీసుకున్నట్లు ఆటోమొబైల్ కంపెనీలు వెల్లడించాయి. ఏ కార్ల తయారీ కంపెనీ ఎంత మొత్తంలో ధరలను పెంచనుందో కంపెనీ క్లారిటీ ఇవ్వలేదు. ప్రతి కారు మోడల్‌పై ధరల పెంపు ఎంత అనేది కచ్చితమైన ధరను ప్రకటించలేదు. కార్ల మోడల్ ఆధారంగా ధరల పెరుగుదల ఉండే అవకాశం కనిపిస్తోంది. కార్ల తయారీదారులు ఇప్పుడు తమ వాహనాల ధరలను సంవత్సరానికి రెండుసార్లు పెంచుతుంటాయి.
Read Also : Vivo X100 Series Launch : ఈ నెల 14న వివో ఎక్స్100 సిరీస్ వచ్చేస్తోంది.. ధర ఎంత? ఏయే ఫీచర్లు ఉండొచ్చుంటే?