BMW 7 Series Bookings : లగ్జరీ కారు కావాలా? హై-టెక్ ఫీచర్లతో కొత్త BMW సెడాన్ వస్తోందోచ్.. ఇప్పుడే బుకింగ్ చేసుకోండి!

BMW 7 Series Bookings : బీఎండబ్ల్యూ భారత మార్కెట్లో సరికొత్త లగ్జరీ కారును లాంచ్ చేస్తోంది. బీఎండబ్ల్యూ ఇండియా కొత్త 7 సిరీస్ కోసం ప్రీ-బుకింగ్‌లు మొదలయ్యాయి. ఈ లగ్జరీ సెడాన్ పెట్రోల్, డీజిల్ ఇంజన్ ఆప్షన్లు, ఎలక్ట్రిక్ ఆప్షన్లలో కూడా లభ్యం కానుంది.

BMW 7 Series Bookings

  • త్వరలో భారత మార్కెట్లోకి బీఎండబ్ల్యూ నుంచి సరికొత్త లగ్జరీ కారు
  • కొత్త 7 సిరీస్ పూర్తిగా కొత్త క్యాబిన్ డిజైన్‌తో రానుంది
  • లేటెస్ట్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, అడ్వాన్స్ డిజిటల్ టెక్నాలజీ

BMW 7 Series Bookings : మీరు లగ్జరీ కారు కొనేందుకు ప్లాన్ చేస్తున్నారా? కొత్త BMW 7 సిరీస్ అతి త్వరలోనే లాంచ్ కానుంది. అంతకన్నా ముందే బీఎండబ్ల్యూ ఇండియా ప్రీ-బుకింగ్‌లను ప్రారంభించింది.

కస్టమర్లు ఇప్పుడు ఈ ప్రీమియం లగ్జరీ సెడాన్‌ను కంపెనీ డీలర్‌షిప్‌లలో లేదా బీఎండబ్ల్యూ ఇండియా వెబ్‌సైట్ ద్వారా బుక్ చేసుకోవచ్చు. కంపెనీ ఆగస్టు 1వ తేదీ మధ్యాహ్నం 12:30 గంటలకు బుకింగ్‌లను ప్రారంభించింది. కొత్త 7 సిరీస్ త్వరలో భారత మార్కెట్లో లాంచ్ కానుంది.

కొత్త BMW 7 సిరీస్ ముఖ్యమైన ఫీచర్లలో ఇంటర్నల్ కంబషన్ ఇంజిన్ (ICE) బ్యాటరీ ఎలక్ట్రిక్ వెహికల్ (BEV) వెర్షన్లలో లభించనుంది. వినియోగదారులు తమ అవసరాలను బట్టి ఇంజిన్‌తో రన్ అయ్యే కారు లేదా ఫుల్ ఎలక్ట్రిక్ మోడల్ ఏదైనా ఎంచుకోవచ్చు. ఎలక్ట్రిక్ లగ్జరీ కార్ల వైపు ఎక్కువగా మొగ్గు చూపుతున్న వినియోగదారులను ఆకర్షించేందుకు బీఎండబ్ల్యూ ఈ తరహా మోడల్స్ మార్కెట్లోకి తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకుంది.

Read Also : iQOO Z11 Launch : ఐక్యూ లవర్స్ గెట్ రెడీ.. 3D కర్వ్డ్ డిస్‌ప్లేతో కొత్త ఐక్యూ Z11 వస్తోంది.. ఫీచర్లు మాత్రం కిర్రాక్..!

ఫుల్ ప్రీమియంగా ఎక్స్ ట్రనల్ డిజైన్ :
కొత్త బీఎండబ్ల్యూ 7 సిరీస్ ఆకర్షణీయమైన డిజైన్‌తో ఆకట్టుకునేలా ఉంది. కంపెనీ స్పెషల్ గ్రిల్ రాత్రిపూట మరింత ఆకట్టుకునేలా ఉంటుంది. అదనంగా, ఈ కారులో కొత్త సన్నని క్రిస్టల్ ఎల్ఈడీ హెడ్‌లైట్లు ఉన్నాయి. చూసేందుకు ప్రీమియం ఫీచర్ రేంజ్‌లో ఉంటుంది.

క్యాబిన్‌లో హై-టెక్ ఫీచర్లు :
కారు లోపల భారీ మార్పులు ఉండనున్నాయి. కొత్త 7 సిరీస్‌లో పూర్తిగా కొత్త క్యాబిన్ డిజైన్ ఉంటుంది. ఇందులో భారీ డిజిటల్ డిస్‌ప్లే, సరికొత్త ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ అనేక అడ్వాన్స్ డిజిటల్ టెక్నాలజీలు ఉంటాయి. డ్రైవర్ బ్యాక్ ప్రయాణీకులిద్దరికీ అత్యంత సౌకర్యవంతంగా లగ్జరీగా ఉంటుందని కంపెనీ పేర్కొంది. అంతేకాదు.. క్యాబిన్‌లో ప్రీమియం-క్వాలిటీతో మెటీరియల్స్ లగ్జరీ ఫీచర్లను అమర్చారు. తద్వారా ప్రయాణం మరింత సౌకర్యవంతంగా ఉంటుంది.

లగ్జరీ స్పెషిఫికేషన్లు :
లగ్జరీతో పాటు అత్యంత మోడ్రాన్ టెక్నాలజీ అందించేలా కొత్త 7 సిరీస్‌ను రూపొందించినట్లు బీఎండబ్ల్యూ చెబుతోంది. కంపెనీ కేవలం అద్భుతమైన డ్రైవింగ్ ఎక్స్ పీరియన్స్ మాత్రమే కాదు.. ప్రయాణీకుల సౌకర్యం, కనెక్టివిటీ స్మార్ట్ ఫీచర్లపై కూడా ఫోకస్ పెడుతోంది. ఈ కొత్త 7 సిరీస్‌తో భారతీయ లగ్జరీ కార్ల మార్కెట్‌లో తన స్థానాన్ని నిలబెట్టుకోవడమే లక్ష్యంగా పెట్టుకుంది. ఇంజన్ ఆప్షన్లు, ధర ఇతర టెక్నికల్ వివరాలు రాబోయే రోజుల్లో వెల్లడి కానున్నాయి.