BMW X1 LWB SUV : రూ. 49.90 లక్షలకే BMW లగ్జరీ SUV.. ఫ్యామిలీ ట్రిప్‌లకు X1 LWB పర్‌ఫెక్ట్ ఛాయిస్!
BMW X1 LWB SUV : బీఎండబ్ల్యూ X1 ఎల్‌డబ్ల్యూబీ భారత మార్కెట్లో రూ. 49.90 లక్షల ఎక్స్-షోరూమ్ ధరతో లాంచ్ అయింది. 2800mm వీల్‌బేస్, 109mm అదనపు నీ రూమ్, పనోరమిక్ గ్లాస్ రూఫ్, 154bhp టర్బో-పెట్రోల్ ఇంజన్ వంటి ఫీచర్లు ఉన్నాయి.
- Sreehari A
- Published on- August 23, 2026 / 11:46 AM IST
BMW X1 LWB
- వెనుక సీటు ప్రయాణికులకు పండగే..
- ఈ కారు స్టాండర్డ్ వెర్షన్ కన్నా 116 మిమీ పొడవు
- మొత్తం పొడవు 4616 మిమీ, 109 మిమీ ని-రూమ్
- 1.5L టర్బో-పెట్రోల్ ఇంజన్‌తో నడుస్తుంది
BMW X1 LWB SUV : కొత్త లగ్జరీ కారు కోసం చూస్తున్నారా? మీకు లగ్జరీ కారులో తిరగాలని ఉందా? ధర విషయలో వెనక్కి తగ్గే వారికి BMW సరికొత్త ఆప్షన్ తీసుకొచ్చింది. భారత మార్కెట్లో బీఎండబ్ల్యూ ఎక్స్1 LWB కంపెనీ లాంచ్ చేసింది. ప్రారంభ ధర రూ. 49.90 లక్షలు (ఎక్స్-షోరూమ్)కు లభిస్తుంది. ముఖ్యంగా వెనుక సీట్లో ప్రయాణించే వారికి మరింత సౌకర్యం అందించేలా ఈ SUV కారు ప్రత్యేకంగా అందిస్తోంది.
భారత మార్కెట్లో చెన్నై ప్లాంట్‌లోనే బీఎండబ్ల్యూ ఎక్స్1 ఎల్‌డబ్ల్యూబీ తయారు అవుతోంది. ఫస్ట్ టైమ్ లగ్జరీ కారు కొనే కస్టమర్లను (BMW X1 LWB SUV)కూడా ఈ మోడల్ ఆకట్టుకుంటుందని బీఎండబ్ల్యూ భావిస్తోంది. సాధారణ X1తో పోలిస్తే ఈ కారు సైజు, క్యాబిన్ స్పేస్‌లోనూ భారీ మార్పులు ఉన్నాయి.
Read Also : Tesla EVs Recall : టెస్లాకు భారీ షాక్.. 29.8 లక్షల EV కార్లు రీకాల్! చైనాలో ఏం జరిగింది? అసలు సమస్య ఇదే!
వీల్‌బేస్, పొడవు పెరిగింది :
స్టాండర్డ్ ఎక్స్1 కన్నా X1 LWB 116 మిమీ ఎక్కువ పొడవుతో 4616 మిమీగా ఉంది. వీల్‌బేస్ కూడా 108 మిమీ పెరిగి 2800 మిమీకు చేరింది. ఈ అదనపు స్పేస్ ముఖ్యంగా బ్యాక్ సీటు కూర్చొనే ప్రయాణికులకు చాలా సౌకర్యవంతంగా ఉంటుంది.
కంపెనీ ప్రకారం.. బ్యాక్ సైడ్ 109 మిమీ అదనపు నీ-రూమ్ లభిస్తుంది. అంతేకాదు.. సీటు కుషన్ పొడవును కూడా 15 మిమీ పెంచారు. లాంగ్ డ్రైవ్‌లో వెనుక కూర్చునే వారికి మరింత సౌకర్యంగా ఉండేలా క్యాబిన్‌ను డిజైన్ చేశారు. అంతేకాదు.. 9 చదరపు మీటర్ల పనోరమిక్ గ్లాస్ రూఫ్ క్యాబిన్ కూడా ఉంది. ప్రీమియం ఎక్స్‌పీరియన్స్ మాత్రం నెక్ట్స్ లెవల్..
154bhp టర్బో పెట్రోల్ ఇంజన్ :
బీఎండబ్ల్యూ ఎక్స్1 ఎల్‌డబ్ల్యూబీలో 1.5 లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజన్ ఉంటుంది. 154bhp పవర్, 230Nm టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్‌ను 7-స్పీడ్ డ్యూయల్ క్లచ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ అందించారు. ధర, లాంగ్ వీల్‌బేస్, బ్యాక్ సీటు సౌకర్యం, ప్రీమియం ఫీచర్లతో లగ్జరీ SUV సెగ్మెంట్‌లో బీఎండబ్ల్యూ ఎక్స్1 ఎల్‌డబ్లూబీ ఫ్యామిలీ కస్టమర్లకు సరైన ఆప్షన్.
