Bombay HC PF Pension : PF పై ఉద్యోగులు పండుగ చేసుకునే వార్త.. మీ పాత కంపెనీ రికార్డులు లేవని టెన్షన్ వద్దు..

Bombay HC PF Pension : ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ (PF) పెన్షన్ పై బాంబే హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఇది పీఎఫ్ ఖాతాదారులకి పండగలాంటి వార్తే అంటున్నారు.

bombay high court on PF pension claims can not be rejected for missing employer records

Bombay HC PF Pension : ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ (PF) పెన్షన్ పై కీలక అప్డేట్ వచ్చేసింది. సాధారణంగా పీఎఫ్ విత్ డ్రా చేయాలంటే.. పాత, ప్రస్తుత కంపెనీల రికార్డులు కచ్చితంగా ఉండాలి. ఏ చిన్న డాక్యుమెంట్ లేకపోయినా.. అభ్యర్థనని తిరస్కరిస్తారు. పాత కంపెనీ రికార్డులు మిస్ అయితే.. ఆ డబ్బుల మీద ఆశ వదిలేసుకోవాల్సిందే. అయితే ఇకపై అలా జరగదు అంటున్నారు. పాత కంపెనీ రికార్డులను సాకుగా చూసి.. ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ (PF) ఆధారిత పెన్షన్ ప్రయోజనాలను నిరాకరించలేమని బాంబే హైకోర్టు తీర్పు వెల్లడించింది. కిరణ్ రాజారాం జాధవ్ వర్సెస్ EPFO కేసులో ఈ తీర్పు వెలువడింది. ఇది భవిష్యత్తులో హయ్యర్ పెన్షన్ క్లెయిమ్‌ల పరిశీలన విధానంపై ప్రభావం చూపనుంది అంటున్నారు.

కోర్టు ఏమన్నదంటే..

ఈ కేసు విచారణ సందర్భంగా కోర్టు పలు కీలక వ్యాఖ్యలు చేసింది. దీని ప్రకారం.. Form 6A వంటి చట్టబద్ధ PF రికార్డులను నిర్వహించే బాధ్యత పూర్తిగా యజమానులదే. ఉద్యోగులకు ఆ రికార్డులపై నియంత్రణ ఉండదని, వాటిని వారు నిర్వహించరని కోర్టు స్పష్టం చేసింది. పాత రికార్డులు లేవన్న కారణంతో హయ్యర్ పెన్షన్ క్లెయిమ్‌ను తిరస్కరించడం సరైంది కాదని కోర్టు అభిప్రాయపడింది.

పెన్షన్ విషయంలో Form 3A, EPF ఖాతా స్టేట్‌మెంట్‌లు, కాంట్రిబ్యూషన్ రికార్డులు, జాయింట్ ఆప్షన్ అప్లికేషన్లు, యజమాని ధృవీకరణ వంటి సమగ్ర ఆధారాలను పరిగణలోకి తీసుకోవాలని కోర్టు సూచించింది. సామాజిక భద్రత చట్టాలను కఠినంగా కాకుండా సానుకూలంగా అర్థం చేసుకోవాలని కోర్టు అభిప్రాయపడింది.

కోర్టు తీర్పు తర్వాత పీఎఫ్ విధానాల్లో మార్పు రావచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అవి:

  • ఒకే డాక్యుమెంట్‌ మీద ఆధారపడకుండా సమగ్రంగా పరిశీలించాలి.
  • అవసరమైతే యజమానుల నుంచి ఉద్యోగి వివరాలు సేకరించాలి.
  • ప్రత్యామ్నాయ ఆధారాలను పరిగణలోకి తీసుకోవాలి.
  • యజమానులకు సూచనలు చేయాలి.

ఈ తీర్పు ప్రకారం PF నిబంధనలు కేవలం చెల్లింపులతో ముగియవు. రికార్డులను సక్రమంగా నిర్వహించడం కూడా చాలా ముఖ్యం. ఈ తీర్పు ఉద్యోగుల హక్కులను రక్షించే దిశగా ఒక కీలక అడుగుగా భావిస్తున్నారు.