Canara Bank ATM Rules : ఖాతాదారులకు షాకింగ్ న్యూస్.. ఈ బ్యాంకు ATMలో లిమిట్ దాటితే ఛార్జీల మోతే!
Canara Bank ATM Rules : కెనరా బ్యాంక్ కొంతమంది కస్టమర్ల నెలవారీ ఉచిత ఏటీఎం లావాదేవీల పరిమితిని సవరించింది. సాధారణ కస్టమర్లు ఇకపై నెలకు 5 ఉచిత ఏటీఎం లావాదేవీలు చేసుకోగలరు. సీనియర్ సిటిజన్ల పరిమితిలో ఎలాంటి మార్పు లేదు.
- Sreehari A
- Published on- September 5, 2026 / 08:21 PM IST
Canara Bank ATM Rules
- కెనరా బ్యాంకు ఖాతాదారులకు బిగ్ అలర్ట్
- ఏటీఎం ఉచిత లావాదేవీల పరిమితి తగ్గింది
- ఇకపై ఈ పరిమితి దాటితే అధిక ఛార్జీలు చెల్లించాలి
Canara Bank ATM Rules : మీకు కెనరా బ్యాంక్‌లో ఖాతా ఉందా? అయితే, ఈ వార్త మీ కోసమే. సెప్టెంబర్ 1, 2026 నుంచి కొత్త రూల్స్ అమల్లోకి వచ్చేశాయి. ఆ బ్యాంక్ ఉచిత ఏటీఎం లావాదేవీల పరిమితిని సవరించింది. మీరు పదేపదే ఏటీఎంల నుంచి డబ్బు విత్‌డ్రా చేస్తుంటే ఇకపై ఆపేయడం బెటర్.
ఆర్థిక లేదా ఆర్థికేతర లావాదేవీలు ఏది చేసినా ఈ కొత్త పరిమితి వర్తిస్తుంది. ఈ లావాదేవీలకు సంబంధించి ఏటీఎం పరిమితిని మించితే అధిక రుసుము చెల్లించాలి. ఇంతకీ కెనరా బ్యాంకులో ఏయే ఖాతాదారుల ఉచిత లావాదేవీల పరిమితులు తగ్గాయి? ఏయే ఖాతాలు ప్రభావితం కాలేదో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..
కెనరా బ్యాంక్ ఏటీఎం ఉచిత లావాదేవీ పరిమితిని మార్చేసింది. బ్యాంకు రెగ్యులర్ కస్టమర్ల కోసం ఆర్థిక, ఆర్థికేతర ఏటీఎం లావాదేవీల ఉచిత పరిమితిని 6 నుంచి 5కి తగ్గించింది. ఈ మార్పును ముఖ్యంగా సేవింగ్స్ ఖాతాదారుల కోసమే.. వయోవృద్ధులకు ఉచిత ఏటీఎం లావాదేవీల పరిమితి 8 అలానే కొనసాగుతోంది. ఇందులో ఎలాంటి మార్పులు చేయలేదు.
Read Also : Tata Curvv Series X : రూ.9.99 లక్షలకే టాటా కర్వ్ కొత్త సిరీస్ X కారు.. ఏ వేరియంట్‌లో ఏయే ఫీచర్లు ఉన్నాయంటే!
లావాదేవీలపై అదనపు ఛార్జీలు :
కెనరా బ్యాంక్ ఏటీఎంలలో ఉచిత పరిమితి ఉంది. అయితే, ఇప్పుడు ఆ పరిమితిని (Canara Bank ATM Rules) మించి లావాదేవీలు చేస్తే మాత్రం ఛార్జీలు చెల్లించక తప్పదు. ఆర్థికేతర లావాదేవీలపై రుసుము ఒక్కో లావాదేవీకి రూ. 5గా యథాతథంగా ఉంది.
మీరు నెలలో 5 సార్ల కన్నా ఎక్కువగా ఏటీఎం నుంచి డబ్బు విత్ డ్రా చేస్తే ఇప్పుడు ప్రతి లావాదేవీకి రూ. 23 రుసుము చెల్లించాల్సి ఉంటుంది. గతంలో రూ. 20గా ఉండేది.
ఇతర బ్యాంకు ఏటీఎం నుంచి డబ్బులు విత్ డ్రా చేసుకునే రుసుమును కూడా రూ. 23కి పెంచారు. గతంలో ఈ రుసుము రూ. 17గా ఉండేది. గ్రీన్ పిన్‌ను రీసెట్ చేసేందుకు అయ్యే రుసుమును రూ. 23 నుంచి రూ. 5కు తగ్గించారు.
ప్రభుత్వ రంగ బ్యాంకులలో ఒకటైన కెనరా బ్యాంక్ 1906లో మంగళూరులో స్థాపించారు. హెడ్ క్వార్టర్ ఆఫీసు బెంగళూరులో ఉంది. వివిధ నగరాల్లోని శాఖలతో పాటు, ఈ బ్యాంకు మొబైల్ యాప్, అధికారిక వెబ్‌సైట్ ద్వారా కస్టమర్లకు అనేక సేవలను అందిస్తోంది. సెప్టెంబర్ 1, 2026 నుంచి ఈ బ్యాంకు ఉచిత ఏటీఎం లావాదేవీల పరిమితులు, అనేక కీలక రుసుములను సవరించింది.
