Bank Lending Rates : ఈ బ్యాంకుల్లో లోన్ తీసుకున్నారా? ఇక మీ EMI మోతే! భారీగా పెరిగిన వడ్డీ రేట్లు

Bank Lending Rates : బ్యాంక్ ఆఫ్ బరోడా, కెనరా బ్యాంక్ ఎంసీఎల్ఆర్ పరిమిత కాలానికి 5 నుంచి 10 బేసిస్ పాయింట్ల మేర పెంచాయి. ఈ కొత్త రేట్లు ఆగస్టు 12, 2026 నుంచి అమల్లోకి వస్తాయి. ఎంసీఎల్ఆర్ ఆధారిత రుణాలు తీసుకునే కస్టమర్లకు భారీగా వడ్డీ రేట్లు పడనున్నాయి.

Bank Lending Rates

  • వడ్డీ రేట్లు పెంచేసిన బ్యాంక్ ఆఫ్ బరోడా, కెనరా బ్యాంక్
  • ఎంసీఎల్ఆర్ 10 బేసిస్ పాయింట్లు పెంపు
  • లోన్లపై ఈఎంఐలు భారీగా పెరిగే అవకాశం

Bank Lending Rates : లోన్లు తీసుకున్నారా? కొత్త లోన్ కోసం చూస్తున్నారా? మీకో బ్యాడ్ న్యూస్.. బ్యాంక్ ఆఫ్ బరోడా, కెనరా బ్యాంక్‌ వడ్డీ రేట్లను భారీగా పెంచేశాయి. ఈ బ్యాంకుల్లో లోన్లు తీసుకునే ముందు వడ్డీ రేట్లు చెక్ చేసుకోండి..

ఈ రెండు ప్రభుత్వ రంగ బ్యాంకులు తమ ఎంసీఎల్ఆర్ (మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ బేస్డ్ లెండింగ్ రేట్)ను పరిమిత కాలానికి (Bank Lending Rates) పెంచాయి. ఈ కొత్త రేట్లు ఆగస్టు 12, 2026 నుంచి అమల్లోకి వస్తాయి. తద్వారా ఎంసీఎల్ఆర్ లింక్ అయిన రుణాల వడ్డీ రేటు ఈఎంఐలపై తీవ్ర ప్రభావం పడవచ్చు.

ఈ నెల 5న జరిగిన ద్రవ్య విధాన కమిటీ (MPC) సమావేశంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రెపో రేటును 5.25శాతం వద్ద యథాతథంగా ఉంచింది. దాంతో ఈ మార్పు చోటుచేసుకుంది. సుమారు వారం రోజుల తర్వాత రెండు బ్యాంకులు ఎంపిక చేసిన కాలపరిమితులపై ఎంసీఎల్ఆర్ సవరించాయి.

కెనరా బ్యాంక్ ఎంసీఎల్ఆర్ 5 బేసిస్ పాయింట్లు :
కెనరా బ్యాంక్ ఎంపిక చేసిన కాలపరిమితులకు ఎంసీఎల్ఆర్ 5 బేసిస్ పాయింట్లు పెంచింది. ఒక బేసిస్ పాయింట్ 0.01 శాతానికి సమానం. బ్యాంక్ కొత్త ఎంసీఎల్ఆర్, కాలపరిమితిని బట్టి 7.95శాతం నుంచి 9.10శాతం వరకు ఉంటుంది. ఓవర్‌నైట్ ఎంసీఎల్ఆర్ 7.95శాతం వద్ద యథాతథంగా ఉంది.

ఒక నెల ఎంసీఎల్ఆర్ 8శాతం నుంచి 8.05శాతంకి, 3 నెలల ఎంసీఎల్ఆర్ 8.25శాతం నుంచి 8.30శాతంకి, 6 నెలల ఎంసీఎల్ఆర్ 8.60శాతం నుంచి 8.65శాతంకి పెరిగింది. ఒక ఏడాది ఎంసీఎల్ఆర్ కూడా 8.75శాతం నుంచి 8.80శాతంకి పెరిగింది. రెండు ఏళ్లు, 3 ఏళ్ల ఎంసీఎల్ఆర్ రేట్లు వరుసగా 9.05శాతం నుంచి 9.10శాతానికి పెరిగాయి.

Read Also : Toyota Hyryder Aero Black : కొంటే ఇలాంటి కారు కొనాలి.. టయోటా కొత్త బ్లాక్ SUV అదుర్స్, 27.97కి.మీ మైలేజ్.. ధర తెలిస్తే షాక్!

ఎంసీఎల్ఆర్ 10 బేసిస్ పాయింట్లు పెంపు :

బ్యాంక్ ఆఫ్ బరోడా ఎంపిక చేసిన కాలపరిమితులపై ఎంసీఎల్ఆర్ పెంచింది. ఈ బ్యాంకు 3 నెలల ఎంసీఎల్ఆర్ 8.20శాతం నుంచి 8.30శాతంకి (10 బేసిస్ పాయింట్లు) పెంచింది. అయితే, ఓవర్‌నైట్ ఎంసీఎల్ఆర్ 7.85శాతం వద్ద నెల ఎంసీఎల్ఆర్ 7.95శాతం వద్ద యథాతథంగా ఉంచింది.

అదేవిధంగా, 6 నెలల ఒక ఏడాది ఎంసీఎల్ఆర్ వరుసగా 8.50శాతం 8.75శాతం వద్ద ఎలాంటి మార్పు లేకుండా ఉన్నాయి. కాలపరిమితిని బట్టి బ్యాంకు కొత్త ఎంసీఎల్ఆర్ రేట్లు 7.85శాతం నుంచి 8.75శాతం వరకు ఉంటాయి.

ఎంసీఎల్ఆర్ ఏంటి? :
ఎంసీఎల్ఆర్ అంటే.. మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ బేస్డ్ లెండింగ్ రేట్. ఒక్కమాటలో చెప్పాలంటే.. సాధారణ పరిస్థితులలో ఒక రుణంపై బ్యాంకు వడ్డీని వసూలు చేయలేని కనీస వడ్డీ రేటు ఇది. ఆర్‌బీఐ 2016లో ఎంసీఎల్ఆర్ విధానాన్ని అమలు చేసింది.

ఎంసీఎల్ఆర్ లింక్ రుణాలతో వడ్డీ రేట్లలో మార్పులు వస్తాయి. లోన్ ఈఎంఐ లేదా రుణ కాలవ్యవధిపై ప్రభావం పడుతుంది. అయితే, వాస్తవ ప్రభావం అనేది మీ లోన్ టైప్, వడ్డీ రీసెట్ తేదీ బ్యాంకు నిబంధనలపై ఆధారపడి ఉంటుంది.

కస్టమర్లపై ప్రభావం ఏంటి? :
ఎంసీఎల్ఆర్ పెంపు వల్ల గృహ రుణాలు, వ్యక్తిగత రుణాలు, ఇతర రుణాలు పెరుగుతాయనే ఆందోళన కస్టమర్లలో ఉంది. సంబంధిత రుణంపై వడ్డీ రేటును రీసెట్ చేస్తే వడ్డీ భారం కూడా పెరుగుతుంది.