Canara Bank FD Rates : 555 రోజుల FDపై అదిరిపోయే వడ్డీ.. సీనియర్ సిటిజన్లకు కెనరా బ్యాంక్ బంపర్ ఆఫర్
Canara Bank FD Interest Rates : సాధారణ కస్టమర్లతో పోలిస్తే, 60 ఏళ్లు, ఆపై వయస్సు ఉన్న సీనియర్ సిటిజన్ కస్టమర్లకు 180 రోజులు లేదా ఆపై టెన్యూర్ ఎఫ్‌డీ ఖాతాలపై కెనరా బ్యాంక్ 0.50శాతంతో అధిక వడ్డీ రేటును అందిస్తోంది.
- Sreehari A
- Published on- August 14, 2026 / 07:50 PM IST
Canara Bank FD Interest Rates
- కెనరా బ్యాంకులో ఎఫ్‌డీ ఖాతాలపై భారీ వడ్డీ రేట్లు
- 3శాతం నుంచి 7.20శాతం వరకు వడ్డీ రేట్లు
- స్పెషల్ 555 రోజుల ఎఫ్‌డీ పథకం అందిస్తోంది
Canara Bank FD Interest Rates : కెనరా బ్యాంకు కస్టమర్లకు గుడ్ న్యూస్.. ప్రత్యేకించి సీనియర్ సిటిజన్ కస్టమర్లకు అద్భుతమైన వడ్డీ రేట్లను అందిస్తోంది. ప్రభుత్వ రంగ కెనరా బ్యాంక్ తమ కస్టమర్లను ఆకర్షించేందుకు ఫిక్స్‌డ్ డిపాజిట్ (FD) ఖాతాలపై అద్భుతమైన వడ్డీ రేట్లను ఆఫర్ చేస్తోంది.
ఈ బ్యాంకు రూ.3 కోట్ల లోపు మొత్తాలతో కాల్‌బుల్ ఎఫ్‌డీ ఖాతాలపై 3శాతం నుంచి 7.20శాతం వరకు వడ్డీ రేట్లను అందిస్తోంది. 555 రోజుల ఎఫ్‌డీ పథకంపై కెనరా బ్యాంక్ ఎంత వడ్డీని అందిస్తుందో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..
555 రోజుల ఎఫ్‌డీపై వడ్డీ ఎంతంటే? :
కెనరా బ్యాంక్ తమ కస్టమర్ల కోసం స్పెషల్ 555 రోజుల ఎఫ్‌డీ పథకాన్ని అందిస్తోంది. ఈ స్పెషల్ ఎఫ్‌డీ పథకం కింద కెనరా బ్యాంక్ తమ కస్టమర్లకు 6.60 శాతం నుంచి 7.20 శాతం వరకు వడ్డీని అందిస్తోంది. 59 ఏళ్ల వయస్సు కస్టమర్లకు 555 రోజుల ఎఫ్‌డీ ఖాతాలపై కెనరా బ్యాంక్ 6.60 శాతం వడ్డీని అందిస్తోంది.
60 ఏళ్లు లేదా ఆపై ఎక్కువ వయస్సు కస్టమర్లకు 555 రోజుల ఎఫ్‌డీ పథకంపై 7.10 శాతం వడ్డీని అందిస్తోంది. 80 ఏళ్లు లేదా ఆపై వయస్సు ఉన్న కస్టమర్లకు 555 రోజుల ఎఫ్‌డీ ఖాతాలపై అత్యధికంగా 7.20 శాతం వడ్డీని అందిస్తోంది.
180 రోజులు లేదా ఆపై ఎక్కువ టెన్యూర్ ఎఫ్‌డీ ఖాతాలపై సీనియర్ సిటిజన్లు అదనపు రాబడిని పొందవచ్చు. కెనరా బ్యాంక్ 60 ఏళ్లు పైబడిన సీనియర్ సిటిజన్ కస్టమర్లకు 180 రోజులు లేదా అంతకన్నా ఎక్కువ టెన్యూర్ ఎఫ్‌డీ ఖాతాలపై సాధారణ కస్టమర్లతో పోలిస్తే 0.50 శాతం అధిక వడ్డీ రేటును అందిస్తోంది.
అంతేకాదు.. ఈ ప్రభుత్వ రంగ బ్యాంక్ 80 ఏళ్లు పైబడిన సూపర్ సీనియర్ సిటిజన్ కస్టమర్లకు 444 రోజులు, 555 రోజుల కాలపరిమితి ఎఫ్‌డీ ఖాతాలపై సీనియర్ సిటిజన్లతో పోలిస్తే 0.10 శాతం అధిక వడ్డీ రేటును అందిస్తోంది.
2026 మార్చిలో FD వడ్డీ రేట్లు సవరణ :
కెనరా బ్యాంక్ ఎఫ్‌డీ పథకం వడ్డీ రేట్లను చివరిసారిగా మార్చి 17, 2026న సవరించింది. అప్పటి నుంచి ఎఫ్‌డీ ఖాతాలపై కెనరా బ్యాంక్ అందించే వడ్డీ రేట్లలో ఎలాంటి భారీ మార్పులు చేయలేదు.
