Interest Rates Update: మారిన వడ్డీ రేట్లు.. అధికారిక ప్రకటన చేసిన కేంద్రం.. వారికి మాత్రం బంపర్ ఆఫర్

చిన్న పొదుపు పథకాల వడ్డీ రేట్లపై (Interest Rates Update)కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ గుడ్‌‌న్యూస్ అందించింది.

Central government announced small savings schemes interest rates october december quarter

Interest Rates Update: దేశవ్యాప్తంగా సామాన్యులు, మధ్యతరగతి ప్రజలు భద్రమైన రాబడి కోసం ఎంతగానో విశ్వసించే చిన్న పొదుపు పథకాల వడ్డీ రేట్లపై కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ గుడ్‌‌న్యూస్ అందించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2026-27) మూడో త్రైమాసికానికి అంటే అక్టోబర్ 1, 2026 నుంచి డిసెంబర్ 31, 2026 వరకు అమలులో ఉండే వడ్డీ రేట్లలో ఎలాంటి మార్పులు చేయకుండా యథాతథంగా ఉంచుతున్నట్లు అధికారిక నోటిఫికేషన్ విడుదల చేసింది. మార్కెట్ తీవ్ర హెచ్చుతగ్గులకు లోనవుతున్న తరుణంలో, రిస్క్ లేని స్థిరమైన రాబడిని ఆశించే కోట్లాది మంది ఇన్వెస్టర్లకు కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయం ఎంతో ఊరటనిస్తోంది.

Telangana Free Bus: తెలంగాణ ఆర్టీసీ ప్రయాణికులకు బంపర్ ఆఫర్.. ఇక వారికి కూడా ఉచిత ప్రయాణం.. క్షేత్రస్థాయిలో సన్నాహాలు!

ప్రముఖ స్కీమ్‌ల వడ్డీ రేట్లు ఇవే.. పీపీఎఫ్, సుకన్య సమృద్ధికి ఎంతంటే?

నూతన ఉత్తర్వుల ప్రకారం సుకన్య సమృద్ధి యోజన (SSY), సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ (SCSS) లపై గరిష్టంగా(Interest Rates Update) 8.20 శాతం వడ్డీ లభించనుంది. నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్ (NSC) పై 7.7 శాతం, కిసాన్ వికాస్ పత్ర (KVP) పై 7.5 శాతం, పోస్టాఫీస్ మంత్లీ ఇన్‌కమ్ స్కీమ్ (MIS) పై 7.4 శాతం చొప్పున వడ్డీ రేట్లు కొనసాగుతాయి. అత్యంత ప్రజాదరణ పొందిన పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (PPF), మూడేళ్ల పోస్టల్ టైమ్ డిపాజిట్‌లపై 7.1 శాతం వడ్డీ రేటు వర్తిస్తుంది.

వరుసగా 10వ త్రైమాసికం.. ఇన్వెస్టర్లకు లభించనున్న స్థిరమైన రాబడి:

కేంద్ర ప్రభుత్వం ఈ వడ్డీ రేట్లను మార్చకుండా యథాతథంగా కొనసాగించడం ఇది వరుసగా పదో త్రైమాసికం కావడం విశేషం. ఈ పొదుపు పథకాలు ఏవీ కూడా షేర్ మార్కెట్ హెచ్చుతగ్గులతో ముడిపడి ఉండవు. అందువల్ల ఎలాంటి ముప్పు లేని సురక్షితమైన ఇన్వెస్ట్‌మెంట్ మార్గాలను ఎంచుకునే వారికి, పెన్షనర్లు, మహిళలకు ఇది గ్యారెంటీ రాబడిని అందిస్తుందని అధికారులు తెలిపారు.