Chicken Prices: నాన్ వెజ్ ప్రియులకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన చికెన్ ధరలు.. కేజీ ఎంతో తెలుసా?

తెలుగు రాష్ట్రాల్లో చికెన్(Chicken Prices), కోడిగుడ్ల ధరలు భారీగా పడిపోయాయి.

Chicken and egg prices drop due to sravana masam effect

  • చికెన్ ధరల భారీగా పతనం
  • శ్రావణ మాసం ఎఫెక్ట్
  • పెరిగిన నిత్యావసర సరుకుల ధరలు

Chicken Prices: తెలుగు రాష్ట్రాల్లో చికెన్, కోడిగుడ్ల ధరలు భారీగా పడిపోయాయి. గత నెలలో కేజీ చికెన్ ఏకంగా రూ.340కి చేరగా, ప్రస్తుతం శ్రావణ మాసం ప్రారంభం కావడంతో అత్యధికులు మాంసాహారానికి దూరంగా ఉంటున్నారు. మార్కెట్‌లో సరఫరా పుష్కలంగా ఉన్నప్పటికీ కొనుగోళ్లు తగ్గిపోవడమే ఈ విపరీతమైన ధరల పతనానికి ప్రధాన కారణమని వ్యాపార వర్గాలు చెబుతున్నాయి.

Nepal Floods: నేపాల్‌లో ఘోర వరద ప్రళయం.. 105 మంది భారతీయులు గల్లంతు.. కైలాస యాత్రికులపై తీవ్ర ఆందోళన

తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుత ధరల వివరాలు:

హైదరాబాద్‌, కరీంనగర్‌ జోన్లలో స్కిన్‌లెస్ చికెన్ (Chicken Prices)రూ.222, డ్రస్స్‌డ్ చికెన్ రూ.197గా ఉంది. విజయవాడలో స్కిన్‌లెస్ చికెన్ రూ.240, డ్రస్స్‌డ్ చికెన్ రూ.212 ప‌లుకుతోంది. గతంలో రూ.8 వరకు వెళ్లి పెరిగిన కోడిగుడ్డు ధర ప్రస్తుతం రూ.6కి పడిపోయి, 12 గుడ్ల డజన్ ధర రూ.74 నుంచి రూ.75 వద్ద స్థిరంగా కొనసాగుతోంది. డిమాండ్ లేకపోవడంతో షాపులు వెలవెలబోయి చికెన్ వ్యాపారుల రాబడి గణనీయంగా తగ్గింది.

నిత్యావసరాల భారం:

ఒకవైపు చికెన్ ధరలు రూ.100కి పైగా తగ్గి మాంసప్రియులకు ఊరటనిచ్చినా, రోజువారీ సరుకుల ధరలు సామాన్యులను వేధిస్తున్నాయి. మార్కెట్‌లో కిలో ఉల్లిపాయలు, కేజీ పంచదార ధరలు రూ.60కి చేరుకోవడంతో కుటుంబ బడ్జెట్‌పై ఆర్థిక భారం పడుతోంది. రానున్న మరికొన్ని రోజుల పాటు చికెన్ ధరలు ఇవే స్థాయిల్లో తక్కువగా కొనసాగే అవకాశం కనిపిస్తోంది.