Citroen basalt X SUV : కొత్త కారు కొంటున్నారా? భారీగా పెరిగిన సిట్రోయెన్ SUV కార్ల ధరలు.. ఏకంగా రూ. 40వేలు పెంపు.. ఫుల్ డిటెయిల్స్..!
Citroen basalt X SUV : ఏప్రిల్ నెలలో కార్ల ధరలు భారీగా పెంచేశాయి ఆటో కంపెనీలు. అందులో సిట్రోయెన్ కంపెనీ కూడా ఒకటి. పెంచిన కార్ల కొత్త ధరలు అమలులోకి వచ్చాయి. సిట్రోయెన్ SUV కార్ల ధరలు ఎంత పెరిగాయో ఇప్పుడు తెలుసుకుందాం..
Citroen basalt X SUV
- సిట్రోయెన్ బసాల్ట్ ఎక్స్, C3, ఎయిర్‌క్రాస్ ధరల పెంపు
- సిట్రోయెన్ బసాల్ట్ X ధర రూ. 40వేల వరకు పెంపు
- బసాల్ట్ X ధర ఇప్పుడు రూ. 8.55 లక్షల నుంచి ప్రారంభం
Citroen basalt X SUV : కొత్త కారు కొంటున్నారా? సిట్రోయెన్ బసాల్ట్ ఎక్స్ ఎస్యూవీ ధరలు భారీగా పెరిగాయి. ఈ ఏప్రిల్ 2026లో కార్ల ధరలను భారీ పెంచిన కంపెనీలలో సిట్రోయెన్ ఒకటి. ఈ కొత్త ధరలు అమల్లోకి వచ్చాయి. ఈ సిట్రోయెన్ కంపెనీ అందించే 3 కార్లలో బసాల్ట్ ఎక్స్, C3, ఎయిర్‌క్రాస్‌ల ధరలను అమాంతం పెంచింది. కార్ల ధరలను (Citroen basalt X SUV) ఎంతపెంచిందో ఇప్పుడు వివరంగా చూద్దాం..
సిట్రోయెన్ బసాల్ట్ ధర ఎక్కువ :
సిట్రోయెన్ బసాల్ట్ ఎక్స్ అనేది హ్యుందాయ్ క్రెటా, మారుతి విక్టోరియా, టాటా సియెర్రా, కియా సెల్టోస్ వంటి కార్లతో నేరుగా పోటీపడుతోంది. ఈ కారును కొనడం ఇప్పుడు చాలా కాస్టలీ. ధర రూ. 40వేలు పెరిగింది. ప్లస్ 1.2 NA పెట్రోల్ MT వేరియంట్ ధర రూ. 37వేలు పెరిగింది.
మోడల్ బట్టి ధరల పెరుగుదల :
మ్యాక్స్ టర్బో పెట్రోల్ ఎంటీ డార్క్ ఎడిషన్ మోడల్ ధరలో ఎలాంటి మార్పు లేదు. మిగతా అన్ని వేరియంట్ల ధరలు రూ. 40వేలు పెరిగాయి. మీరు డార్క్ ఎడిషన్ కాకుండా వేరే ఏ మోడల్‌ను ఎంచుకున్నా సుమారుగా రూ. 40వేలు అదనంగా చెల్లించాల్సి ఉంటుంది.
సిట్రోయెన్ బసాల్ట్ ఎక్స్ కొత్త ధరలు :
ఈ కారు ధరలు ఇప్పుడు రూ. 8.55 లక్షల (ఎక్స్-షోరూమ్) నుంచి ప్రారంభమై రూ. 13.95 లక్షల (ఎక్స్-షోరూమ్) వరకు ఉంటాయి. ఈ కారు యూ, ప్లస్, మ్యాక్స్ అనే 3 మెయిన్ మోడళ్లలో వస్తుంది. రెండు 1.2-లీటర్ పెట్రోల్ ఇంజన్ల ద్వారా పవర్ పొందుతుంది. గేర్ ఆప్షన్లలో 5-స్పీడ్ మాన్యువల్, 6-స్పీడ్ మాన్యువల్, 6-స్పీడ్ ఆటోమేటిక్ ఉన్నాయి.
