Croma Campus Sale : బ్యాక్ టు క్యాంపస్ సేల్.. కొత్త ల్యాప్‌టాప్ కొంటున్నారా? ఈ బ్రాండెడ్ ల్యాప్‌టాప్‌లపై అద్భుతమైన డీల్స్.. డోంట్ మిస్..!

Croma Campus Sale : క్రోమ్ క్యాంపస్ సేల్ మొదలైంది.. విద్యార్థుల కోసం అద్భుతమైన డిస్కౌంట్లతో బ్రాండెడ్ ల్యాప్‌టాప్స్ ఆఫర్ చేస్తోంది.

Croma Campus Sale : బ్యాక్ టు క్యాంపస్ సేల్.. కొత్త ల్యాప్‌టాప్ కొంటున్నారా? ఈ బ్రాండెడ్ ల్యాప్‌టాప్‌లపై అద్భుతమైన డీల్స్.. డోంట్ మిస్..!

Croma Campus Sale

Updated On : July 6, 2025 / 12:38 PM IST

Croma Campus Sale : కొత్త ల్యాప్‌టాప్ కొంటున్నారా? స్కూల్, కాలేజీ విద్యార్థుల కోసం అద్భుతమైన సేల్ మొదలైంది. ఎలక్ట్రానిక్స్ రిటైలర్ క్రోమా ఈ సమయంలో “బ్యాక్ టు క్యాంపస్” సేల్‌ను ప్రకటించింది. ఈ సేల్ కింద అనేక ల్యాప్‌టాప్‌లు కొనుగోలుకు అందుబాటులో ఉన్నాయి.

భారీ తగ్గింపులతో సొంతం చేసుకోవచ్చు. వర్క్, రీసెర్చ్ లేదా ఎంటర్‌టైన్మెంట్ కోసం కొత్త ల్యాప్‌టాప్ కొనాలని చూస్తుంటే ఇదే బెస్ట్ టైమ్.. మీకోసం కొన్ని బెస్ట్ ల్యాప్‌టాప్ డీల్స్  ఉన్నాయి.. అవేంటో ఓసారి లుక్కేయండి..

లెనోవా ఐడియాప్యాడ్ స్లిమ్ 5 :
లాంగ్ బ్యాటరీతో ల్యాప్‌టాప్ కావాలా? రూ. లక్ష లోపు ధరకే కొనుగోలు చేయవచ్చు. లెనోవా నుంచి వచ్చిన ఈ ఐడియాప్యాడ్ స్నాప్‌డ్రాగన్ ప్రాసెసర్‌తో వస్తోంది. సింగిల్ ఛార్జింగ్ ద్వారా ఒక రోజు మొత్తం వినియోగించుకోవచ్చు.

ఈ ల్యాప్‌టాప్ 14-అంగుళాల IPS LCD డిస్‌ప్లే కలిగి ఉంది. 16GB ర్యామ్, 1TB స్టోరేజ్‌తో స్నాప్‌డ్రాగన్ X ప్లస్ ప్రాసెసర్‌తో వస్తుంది. ఎలాంటి ఆఫర్ లేకుండా రూ.79,990కు కొనుగోలు చేయవచ్చు. రూ.10వేల ఇన్‌స్టంట్ బ్యాంక్ డిస్కౌంట్ కూడా పొందవచ్చు.

Read Also : BSNL Yatra SIM : అమర్‌నాథ్ యాత్రికులకు గుడ్ న్యూస్.. కేవలం రూ. 196కే BSNL యాత్ర సిమ్.. 15 రోజుల వ్యాలిడిటీ.. ఎక్కడ కొనాలి?

అసూస్ ROG స్ట్రిక్స్ G15 :
మీరు గేమింగ్ ల్యాప్‌టాప్ కోసం చూస్తుంటే.. రూ. 50వేల బడ్జెట్ ధరలో ASUS ల్యాప్‌టాప్ బెస్ట్. 15.6-అంగుళాల LCD IPS డిస్‌ప్లేతో వస్తుంది. 4వ జనరేషన్ రైజెన్ 7 4800H ప్రాసెసర్‌తో వస్తుంది. విండోస్ 11పై రన్ అవుతుంది. 8GB ర్యామ్, 512GB స్టోరేజ్‌తో రూ. 46,990కి కొనుగోలు చేయవచ్చు.

ఆపిల్ మ్యాక్‌బుక్ ఎయిర్ M2 :
2022లో వచ్చిన ఆపిల్ మ్యాక్‌బుక్ ఎయిర్ M2 కొనేందుకు ఇదే బెస్ట్ ఆప్షన్. 13.6-అంగుళాల లిక్విడ్ రెటీనా డిస్‌ప్లేతో వస్తుంది. 16GB ర్యామ్, 256GB స్టోరేజ్‌తో వస్తుంది. అనేక AI ఫీచర్లతో వస్తుంది. రూ. 8వేల తగ్గింపు తర్వాత రూ. 73,990కి కొనుగోలు చేయవచ్చు.

లెనోవా ఐడియాప్యాడ్ స్లిమ్ 3 :
గేమింగ్, మూవీలు, బ్రౌజింగ్ కోసం తక్కువ ధరకు కొనాలంటే.. ఈ ల్యాప్‌టాప్ మీకు బెస్ట్ కావచ్చు. లెనోవా ఐడియాప్యాడ్ స్లిమ్ 3 మోడల్ AMD రైజెన్ 3 7320U ప్రాసెసర్, 15.6-అంగుళాల డిస్‌ప్లేతో వస్తుంది. విండోస్ 11పై రన్ అవుతుంది.

512GB స్టోరేజ్, 16GB ర్యామ్ కలిగి ఉంది. ఈ ఐడియాప్యాడ్ స్లిమ్ 3 ల్యాప్‌టాప్ రూ. 3వేలకు తగ్గింపుతో రూ. 32,490కు కొనుగోలు చేయవచ్చు.