BSNL Yatra SIM : అమర్‌నాథ్ యాత్రికులకు గుడ్ న్యూస్.. కేవలం రూ. 196కే BSNL యాత్ర సిమ్.. 15 రోజుల వ్యాలిడిటీ.. ఎక్కడ కొనాలి?

BSNL Yatra SIM : అమర్‌నాథ్ యాత్రకుల కోసం BSNL కొత్త సిమ్ కార్డును ఆఫర్ చేస్తోంది. 15 రోజుల వ్యాలిడిటీతో అన్‌లిమిటెడ్ కాల్స్ చేసుకోవచ్చు.

BSNL Yatra SIM : అమర్‌నాథ్ యాత్రికులకు గుడ్ న్యూస్.. కేవలం రూ. 196కే BSNL యాత్ర సిమ్.. 15 రోజుల వ్యాలిడిటీ.. ఎక్కడ కొనాలి?

BSNL Yatra SIM

Updated On : July 6, 2025 / 12:01 PM IST

BSNL Yatra SIM : అమర్‌నాథ్ యాత్రకు వెళ్తున్నారా? అయితే, అక్కడ యాత్ర సమయంలో డిజిటల్ కనెక్టవిటీ కోసం కొత్త సిమ్ అందిస్తోంది బీఎస్ఎన్ఎల్. ప్రభుత్వ యాజమాన్యంలోని టెలికాం ఆపరేటర్ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (BSNL) అమర్‌నాథ్ యాత్ర 2025కి వెళ్లే యాత్రికుల కోసం ప్రత్యేక యాత్ర సిమ్ కార్డును ప్రవేశపెట్టింది.

యాత్ర సమయంలో రీఛార్జ్ ప్లాన్‌ల కోసం అధికంగా చెల్లించాల్సిన అవసరం లేకుండా భక్తులు తమ కుటుంబ సభ్యులతో కనెక్ట్ అయి ఉండొచ్చు. ఈ BSNL యాత్ర సిమ్ కొత్త రీఛార్జ్ ప్లాన్ ధర రూ.196 ఉంటుంది. 15 రోజుల పాటు వ్యాలిడిటీ ఉంటుంది.

యాత్ర కొనసాగుతున్నంతవరకు వినియోగదారులకు 4G కనెక్టివిటీతో పాటు అన్‌లిమిటెడ్ కాల్స్, అన్‌లిమిటెడ్ డేటాను 15 రోజుల పాటు పొందవచ్చు. ఇంతకీ ఈ యాత్ర సిమ్ కార్డు ఎక్కడ దొరకుతుంది? ఎలా కొనాలి? అనే పూర్తి వివరాలను ఇప్పుడు చూద్దాం..

యాత్ర సిమ్ ఎక్కడ కొనాలి? :
యాత్రికులు అమర్‌నాథ్‌కు వెళ్లే మార్గంలో అనేక ప్రదేశాలలో BSNL యాత్ర సిమ్‌ను సులభంగా కొనుగోలు చేయవచ్చు. యాత్రికులు 15 రోజుల యాత్ర సిమ్ కార్డును ప్రదేశాల జాబితాను పొందవచ్చు.
లఖన్‌పూర్
పహల్గాం
బాల్టాల్
చంద్రకోట్
భగవతి నగర్
జమ్మూ కాశ్మీర్‌లో అమర్‌నాథ్ యాత్ర కోసం యాత్రికులు ఆగేందుకు కొన్ని చెక్‌పోస్టులు కూడా ఉన్నాయి.

Read Also : itel City 100 Launch : కొత్త ఐటెల్ సిటీ 100 బడ్జెట్ ఫ్రెండ్లీ ఫోన్ వచ్చేసింది.. స్మార్ట్ ఏఐ ఫీచర్లు అదుర్స్.. ధర రూ. 8వేల లోపే..!

యాత్ర సిమ్ కోసం అవసరమైన డాక్యుమెంట్లు :
సిమ్‌ను యాక్టివేట్ చేసేందుకు వినియోగదారులు తమ KYC పూర్తి చేయాలి. ఈ కింది డాక్యుమెంట్లు తప్పనిసరిగా ఉండాలి.
ఆధార్ కార్డ్ లేదా ప్రభుత్వ ID వ్యాలీడ్ ఐడీలు
శ్రీ అమర్‌నాథ్ యాత్ర స్లిప్
వెరిఫికేషన్ తర్వాత BSNL ఇన్‌స్టంట్ కనెక్టివిటీ యాక్టివ్ 4G సిమ్‌

యాత్ర మార్గంలో BSNL మాత్రమే ఎందుకు? :
అమర్‌నాథ్ యాత్ర ప్రాంతం చాలా సున్నితమైనది. ఈ మార్గంలో టెలికాం టవర్లను ఏర్పాటుకు BSNL మాత్రమే అనుమతి ఉంది. ఈ ప్రాంతంలో ఏ ప్రైవేట్ ఆపరేటర్లకు కవరేజ్ లేదు. ఈ ప్రాంతంలో బీఎస్ఎన్ఎల్ యాత్ర సిమ్ లేదా పోస్ట్‌పెయిడ్ సిమ్‌లు మాత్రమే పనిచేస్తాయి. ఇతర రాష్ట్రాల ప్రీపెయిడ్ సిమ్‌లు జమ్మూ కాశ్మీర్ ప్రాంతంలో పనిచేయవు. బీఎస్ఎన్ఎల్ సిమ్ యాత్ర అంతటా కమ్యూనికేషన్ కోసమే ఈ సిమ్ కార్డులు వర్క్ అవుతాయి.

ప్రయాణం, భద్రత, కనెక్టివిటీ అన్నీ ఒకే చోట బీఎస్ఎన్ఎల్ అందిస్తుంది. బాబా బర్ఫానీకి ప్రయాణించే భారీ సంఖ్యలో యాత్రికులు ఆధ్యాత్మికంగా మాత్రమే కాకుండా డిజిటల్‌గా కనెక్ట్ అయ్యేలా చేస్తుంది. దాంతో మారుమూల పర్వత మార్గాల్లో కూడా యాత్రికులు కనెక్టివిటీని కలిగి ఉండొచ్చు.