itel City 100 Launch : కొత్త ఐటెల్ సిటీ 100 బడ్జెట్ ఫ్రెండ్లీ ఫోన్ వచ్చేసింది.. స్మార్ట్ ఏఐ ఫీచర్లు అదుర్స్.. ధర రూ. 8వేల లోపే..!
itel City 100 Launch : సరికొత్త ఐటెల్ సిటీ 100 బడ్జెట్ ఫ్రెండ్లీ ఫోన్ లాంచ్ అయింది. స్మార్ట్ ఏఐ ఫీచర్లతో అత్యంత ఆకర్షణీయంగా ఉంది. ధర ఎంతంటే?

itel City 100 Launch
itel City 100 Launch : కొత్త ఐటెల్ ఫోన్ కొంటున్నారా? ఐటెల్ సిటీ 100 మోడల్ 5200mAh బ్యాటరీ, IP64 ప్రొటెక్షన్ కలిగి ఉంది. యూనిసోక్ T7250 ఆక్టా-కోర్ చిప్‌సెట్ (itel City 100 Launch) ద్వారా పవర్ పొందుతుంది. 128GB స్టోరేజ్‌తో వస్తుంది. ఆండ్రాయిడ్ 14 OSపై రన్ అవుతుంది. బడ్జెట్ ఫ్రెండ్లీ ఫోన్ అందించే స్మార్ట్‌ఫోన్ బ్రాండ్‌లలో ఒకటైన ఐటెల్ భారతీయ మార్కెట్లో ‘సిటీ 100’ అనే మరో బడ్జెట్ ఫ్రెండ్లీ స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేసింది.
ఈ కొత్త స్మార్ట్‌ఫోన్ IP64-రేటెడ్ ప్రొటెక్షన్‌తో వస్తుంది. డస్ట్‌ప్రూఫ్, స్ప్లాష్-రెసిస్టెంట్‌గా చేస్తుంది. ఈ ఐటెల్ ఫోన్ మరింత 7.65mm యూనిబాడీ డిజైన్‌ను కలిగి ఉంది. నేవీ బ్లూ, ఫెయిరీ పర్పుల్, ప్యూర్ టైటానియం కలర్ వేరియంట్‌లలో ప్రీమియం లుక్‌ను అందిస్తుంది.
పర్ఫార్మెన్స్, డిస్‌ప్లే :
ఐటెల్ సిటీ 100 యూనిసోక్ T7250 ఆక్టా-కోర్ చిప్‌సెట్
4GB ర్యామ్ (వర్చువల్ ర్యామ్ 12GB వరకు)
128GB ROM ఆప్షన్
90Hz రిఫ్రెష్ రేట్
700 నిట్స్ బ్రైట్‌నెస్
6.75-అంగుళాల HD+ IPS ప్యానెల్
ఏఐ ఆధారిత స్మార్ట్ ఫీచర్లు, బ్యాటరీ సపోర్టు :
ఈ ఐటెల్ ఫోన్ 5200mAh బ్యాటరీతో వస్తుంది. 18W ఫాస్ట్ ఛార్జింగ్‌తో వస్తుంది. రోజంతా వినియోగాన్ని అందిస్తుంది. ఐటెల్ అడ్వాన్స్ ఏఐ అసిస్టెంట్ Aivana 3.0 కలిగి ఉంది.
ఫొటోల నుంచి టెక్స్ట్ ఎక్స్‌ట్రాక్షన్
ఏఐ రైటింగ్, ఎడిటింగ్ (సమ్మరీ, రీప్రేషింగ్, టోన్ చేంజెస్)
మెసేజ్‌లలో అడ్రస్‌లకు నావిగేషన్
డాక్యుమెంట్ స్కానింగ్
కెమెరాలు, ఇతర బెనిఫిట్స్ :
13MP బ్యాక్ కెమెరా
8MP ఫ్రంట్ షూటర్ ఇంటెలిజెంట్ సీన్ ఆప్టిమైజేషన్
ముఖ్యమైన ఫీచర్లు :
సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్
IR బ్లాస్టర్, డ్యూయల్-బ్యాండ్ Wi-Fi
ఫేస్ అన్‌లాక్ సపోర్టు
60 నెలల పర్ఫార్మెన్స్
ఉచిత మాగ్నెటిక్ స్పీకర్, ఇతర ఆఫర్లు
ఎక్కడ కొనాలి? :
ఐటెల్ సిటీ 100 స్మార్ట్‌ఫోన్‌తో పాటు రూ.2,999 విలువైన ఫ్రీ మాగ్నెటిక్ స్పీకర్ కూడా ఉంది. కొనుగోలుదారులు 100 రోజుల్లోపు ఫ్రీ స్క్రీన్ రీప్లేస్‌మెంట్ కూడా పొందవచ్చు. ఐటెల్ సిటీ 100 ఇప్పుడు దేశవ్యాప్తంగా ఉన్న రిటైల్ స్టోర్లలో అందుబాటులో ఉంది. ఏఐ పవర్‌ఫుల్ ఫీచర్లతో అత్యంత ఆకర్షణీయంగా ఉంటుంది. రూ.8 వేల లోపు ధర (రూ.7,599)లో బెస్ట్ ఫోన్ అని చెప్పొచ్చు.