Motorola Edge 50 Pro : అమెజాన్‌లో మైండ్ బ్లోయింగ్ డిస్కౌంట్.. రూ. 36వేల మోటోరోలా ఫోన్ జస్ట్ రూ. 24,568కే
Motorola Edge 50 Pro : మోటోరోలా ఎడ్జ్ 50 ప్రో ధర భారీగా తగ్గింది. అమెజాన్‌లో ఈ మోటోరోలా ఫోన్ రూ. 12,600 డిస్కౌంట్ ఆఫర్ చేస్తోంది. ఈ అద్భుతమైన డీల్ ఎలా పొందాలంటే?

Motorola Edge 50 Pro : మోటోరోలా ఫ్యాన్స్ కోసం ఖతర్నాక్ డిస్కౌంట్. ప్రస్తుతం అమెజాన్‌లో మోటోరోలా ఎడ్జ్ 50 ప్రో ఫోన్ రూ. 12,600 కన్నా భారీ తగ్గింపుతో లభిస్తోంది. ఈ స్మార్ట్‌ఫోన్ కలర్ డిస్ప్లే, రోజువారీ పర్ఫార్మెన్స్, ఫాస్ట్ 125W ఛార్జింగ్ సపోర్టుతో వస్తుంది.

ఈ ఫోన్ రోజువారీ వినియోగానికి అద్భుతంగా ఉంటుంది. ఫాస్ట్ బ్యాటరీ టాప్ అప్ అందిస్తుంది. ఇలాంటి ఆఫర్లు ఎక్కువ రోజులు ఉండవు. ఆసక్తిగల కొనుగోలుదారులు డీల్ గడువు ముగిసేలోపు కొనేసుకోవడం బెటర్. ఈ డీల్ ఎలా పొందాలో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..

మోటోరోలా ఎడ్జ్ 50 ప్రో డీల్ : మోటోరోలా ఎడ్జ్ 50 ప్రో (12GB ర్యామ్ + 256GB స్టోరేజ్) మొదట భారత మార్కెట్లో రూ. 35,999కు లాంచ్ అయింది. ఇప్పుడు అమెజాన్‌లో రూ. 24,568కు లిస్ట్ అయింది. తద్వారా రూ. 11,431 ఫ్లాట్ డిస్కౌంట్ లభిస్తుంది.

హెచ్డీఎఫ్సీ బ్యాంక్ క్రెడిట్ కార్డులతో ఈఎంఐ లావాదేవీలపై రూ. 1,500 ఇన్స్టంట్ డిస్కౌంట్ పొందవచ్చు. అదనంగా, సేవింగ్స్ కోసం పాత స్మార్ట్‌ఫోన్ ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు.

మోటోరోలా ఎడ్జ్ 50 ప్రో స్పెసిఫికేషన్లు, ఫీచర్లు : మోటోరోలా ఎడ్జ్ 50 ప్రో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 3 ప్రాసెసర్‌తో వస్తుంది. 12GB వరకు ర్యామ్, 256GB ఇంటర్నల్ స్టోరేజ్ ఉన్నాయి. 125W వైర్డ్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 4,500mAh బ్యాటరీతో వస్తుంది.

డిస్ప్లే విషయానికి వస్తే.. 1.5K రిజల్యూషన్‌తో 6.7-అంగుళాల కర్వ్డ్ pOLED స్క్రీన్, 144Hz రిఫ్రెష్ రేట్, 2,000 నిట్స్ వరకు పీక్ బ్రైట్నెస్, HDR10+ సపోర్ట్ ఉన్నాయి.

కెమెరాల విషయానికొస్తే.. మోటోరోలా ఎడ్జ్ 50 ప్రో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌తో వస్తుంది. ఇందులో OISతో 50MP మెయిన్ కెమెరా, 13MP అల్ట్రా-వైడ్ కెమెరా, 3x ఆప్టికల్ జూమ్, 10MP టెలిఫోటో లెన్స్ ఉన్నాయి. ఫ్రంట్ సైడ్ సెల్ఫీలు, వీడియో కాల్స్ 50MP కెమెరా ఉంది.
