×
Ad

Motorola Edge 50 Pro : అమెజాన్‌లో మైండ్ బ్లోయింగ్ డిస్కౌంట్.. రూ. 36వేల మోటోరోలా ఫోన్ జస్ట్ రూ. 24,568కే

Motorola Edge 50 Pro : మోటోరోలా ఎడ్జ్ 50 ప్రో ధర భారీగా తగ్గింది. అమెజాన్‌లో ఈ మోటోరోలా ఫోన్ రూ. 12,600 డిస్కౌంట్ ఆఫర్ చేస్తోంది. ఈ అద్భుతమైన డీల్ ఎలా పొందాలంటే?

  • Published On : February 17, 2026 / 12:29 PM IST
1/7
Motorola Edge 50 Pro : మోటోరోలా ఫ్యాన్స్ కోసం ఖతర్నాక్ డిస్కౌంట్. ప్రస్తుతం అమెజాన్‌లో మోటోరోలా ఎడ్జ్ 50 ప్రో ఫోన్ రూ. 12,600 కన్నా భారీ తగ్గింపుతో లభిస్తోంది. ఈ స్మార్ట్‌ఫోన్ కలర్ డిస్‌ప్లే, రోజువారీ పర్ఫార్మెన్స్, ఫాస్ట్ 125W ఛార్జింగ్ సపోర్టుతో వస్తుంది.
2/7
ఈ ఫోన్ రోజువారీ వినియోగానికి అద్భుతంగా ఉంటుంది. ఫాస్ట్ బ్యాటరీ టాప్ అప్‌ అందిస్తుంది. ఇలాంటి ఆఫర్‌లు ఎక్కువ రోజులు ఉండవు. ఆసక్తిగల కొనుగోలుదారులు డీల్ గడువు ముగిసేలోపు కొనేసుకోవడం బెటర్. ఈ డీల్ ఎలా పొందాలో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..
3/7
మోటోరోలా ఎడ్జ్ 50 ప్రో డీల్ : మోటోరోలా ఎడ్జ్ 50 ప్రో (12GB ర్యామ్ + 256GB స్టోరేజ్) మొదట భారత మార్కెట్లో రూ. 35,999కు లాంచ్ అయింది. ఇప్పుడు అమెజాన్‌లో రూ. 24,568కు లిస్ట్ అయింది. తద్వారా రూ. 11,431 ఫ్లాట్ డిస్కౌంట్ లభిస్తుంది.
4/7
హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ క్రెడిట్ కార్డులతో ఈఎంఐ లావాదేవీలపై రూ. 1,500 ఇన్‌స్టంట్ డిస్కౌంట్ పొందవచ్చు. అదనంగా, సేవింగ్స్ కోసం పాత స్మార్ట్‌ఫోన్‌ ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు.
5/7
మోటోరోలా ఎడ్జ్ 50 ప్రో స్పెసిఫికేషన్లు, ఫీచర్లు : మోటోరోలా ఎడ్జ్ 50 ప్రో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 3 ప్రాసెసర్‌తో వస్తుంది. 12GB వరకు ర్యామ్, 256GB ఇంటర్నల్ స్టోరేజ్ ఉన్నాయి. 125W వైర్డ్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 4,500mAh బ్యాటరీతో వస్తుంది.
6/7
డిస్‌ప్లే విషయానికి వస్తే.. 1.5K రిజల్యూషన్‌తో 6.7-అంగుళాల కర్వ్డ్ pOLED స్క్రీన్, 144Hz రిఫ్రెష్ రేట్, 2,000 నిట్స్ వరకు పీక్ బ్రైట్‌నెస్, HDR10+ సపోర్ట్ ఉన్నాయి.
7/7
కెమెరాల విషయానికొస్తే.. మోటోరోలా ఎడ్జ్ 50 ప్రో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌తో వస్తుంది. ఇందులో OISతో 50MP మెయిన్ కెమెరా, 13MP అల్ట్రా-వైడ్ కెమెరా, 3x ఆప్టికల్ జూమ్‌, 10MP టెలిఫోటో లెన్స్ ఉన్నాయి. ఫ్రంట్ సైడ్ సెల్ఫీలు, వీడియో కాల్స్ 50MP కెమెరా ఉంది.