Google Pixel 10a : పిక్సెల్ ఫ్యాన్స్ కోసం కిర్రాక్ ఫోన్.. లాంచ్‌కు ముందే కీలక ఫీచర్లు లీక్.. 2 వేరియంట్ల ధరపై భారీ అంచనాలు!
Google Pixel 10a : గూగుల్ పిక్సెల్ 10a ఫోన్ వచ్చేస్తోంది. లాంచ్ కు ముందే కీలక ఫీచర్లు లీక్ అయ్యాయి. ఈ పిక్సెల్ ఫోన్ భారత్ ధర ఎంత ఉండొచ్చంటే?
Google Pixel 10a
- పిక్సెల్ 10a ప్రీ-ఆర్డర్లు ఫిబ్రవరి 18 నుంచి ప్రారంభం
- 8GB ర్యామ్, 128GB స్టోరేజ్ బేస్ వేరియంట్ ధర రూ.49,999
- 8GB ర్యామ్, 256GB స్టోరేజీతో ధర రూ. 69,000 ఉండొచ్చు
Google Pixel 10a : గూగుల్ పిక్సెల్ అభిమానులకు పండగే.. అతి త్వరలో గూగుల్ నుంచి కొత్త పిక్సెల్ 10a ఫోన్ రాబోతుంది. ఈ కొత్త ఫోన్‌కు సంబంధించి గూగుల్ ఇటీవలే నెక్స్ట్ బడ్జెట్-ఫ్రెండ్లీ స్మార్ట్‌ఫోన్ టీజ్ చేసింది. 15 సెకన్ల టీజర్ వీడియోలో కంపెనీ ఫోన్ ఫుల్ డిజైన్‌ను డిస్ప్లే చేసింది. ఫిబ్రవరి 18న ప్రీ-ఆర్డర్లు ప్రారంభం కానున్నాయని ధృవీకరించింది.
వీడియోలో ఎలాంటి స్పెసిఫికేషన్లను వెల్లడించలేదు. కానీ, పిక్సెల్ ఫోన్ డిజైన్ ఎలా ఉంటుందో హింట్ ఇచ్చింది. గూగుల్ పిక్సెల్ 10a ఫ్లాట్ ఎడ్జెస్, రౌండ్ ఎడ్జెస్ బ్యాక్ ప్యానెల్‌తో సహా ఎ-సిరీస్ డిజైన్‌తో వస్తుందని అంచనా. ఈ మోడల్ గత ఏడాది ఆగస్టులో వచ్చిన పిక్సెల్ 10 లైనప్‌లో రానుంది. ధర అంచనా విషయానికి వస్తే.. ప్రస్తుత లీక్‌లను ఓసారి పరిశీలిద్దాం..
భారత్‌లో గూగుల్ పిక్సెల్ 10a ధర (అంచనా) :
లీక్‌ల ప్రకారం.. గూగుల్ పిక్సెల్ 10a ఫోన్ 8GB ర్యామ్, 128GB స్టోరేజ్‌తో బేస్ వేరియంట్ ధర దాదాపు రూ.49,999 కావచ్చు. అదే మొత్తంలో ర్యామ్‌తో 256GB స్టోరేజ్అందించే హైకాన్ఫిగరేషన్ ధర దాదాపు రూ.69వేలు ఉండొచ్చు.
పిక్సెల్ 10a స్పెసిఫికేషన్లు, ఫీచర్లు (అంచనా) :
గూగుల్ పిక్సెల్ 10a ఫోన్ 6.3-అంగుళాల ఫుల్ HD+ అమోల్డ్ డిస్ప్లేతో 120Hz రిఫ్రెష్ రేట్, 2,000 నిట్స్ వరకు బ్రైట్నెస్ లెవల్‌తో వస్తుందని భావిస్తున్నారు. పర్ఫార్మెన్స్ పరంగా ఈ ఫోన్ టెన్సర్ G4 చిప్‌సెట్‌పై రన్ అవుతుందని అంచనా. 8GB వరకు LPDDR5X ర్యామ్, 256GB యూఎఫ్ఎస్ 3.1 స్టోరేజ్‌తో వస్తుంది. ఇంకా, ఈ పిక్సెల్ ఫోన్ 23W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 5,100mAh బ్యాటరీని అందిస్తుంది.
ఫొటోగ్రఫీ విషయానికి వస్తే.. పిక్సెల్ 10aలో 48MP ప్రైమరీ కెమెరా ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (OIS)తో పాటు, 13MP అల్ట్రా-వైడ్ లెన్స్ కూడా ఉంటుందని భావిస్తున్నారు. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 13MP ఫ్రంట్ కెమెరా ఉంటుందని భావిస్తున్నారు.
