AI Impact Summit 2026 : దేశీ టెక్కు మోదీ బూస్ట్.. ‘సర్వం AI కాజే’ స్మార్ట్ గ్లాసెస్‌తో ఏఐ సమ్మిట్‌లో సెన్సేషన్.. ఫొటో వైరల్
AI Impact Summit 2026 : ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ 2026 సందర్భంగా ప్రధాని మోదీ సర్వం కేజ్ గ్లాసెస్ ధరించారు. సర్వం ఏఐ సహ వ్యవస్థాపకుడు ప్రత్యూష్ కుమార్ షేర్ చేసిన ఫొటోలు, ఎగ్జిబిషన్ ఫ్లోర్లో పీఎం రియల్-టైమ్ రెస్పాన్స్ పరీక్షించారు.
PM Modi Sarvam Kaze AI Glasses
- AI హార్డ్వేర్లోకి ఎంట్రీ.. స్మార్ట్‌గ్లాసెస్ ప్రవేశపెట్టిన సర్వం ఏఐ కేజ్
- శిఖరాగ్ర సమావేశంలో ప్రధాని మోదీ ఈ గ్లాసెస్ పరీక్షించారు
- ‘సర్వం కాజే’ స్వదేశీ ఏఐ గ్లాసెస్ ధరించిన మోదీ
- సీఈఓ ప్రత్యూష్ కుమార్ పోస్టు వైరల్
- మే 2026లో సర్వమ్ ఇన్-హౌస్ ఏఐ గ్లాసెస్ లాంచ్
AI Impact Summit 2026 : భారత ఏఐ స్టార్టప్ సర్వమ్ ఏఐ, ఏఐ-ఆధారిత స్మార్ట్ గ్లాసెస్ ఆవిష్కరించింది. ఈ స్మార్ట్ గ్లాసెస్ డివైజ్ ద్వారా హార్డ్‌వేర్ రంగంలోకి ఎంట్రీ ఇస్తున్నట్టు ప్రకటించింది. ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ సందర్భంగా కంపెనీ ప్రకటించింది.
రాబోయే డివైజ్ గురించి అడ్వాన్స్ ఫీచర్లు కూడా రివీల్ చేసింది. సర్వమ్ ఏఐ సహ వ్యవస్థాపకుడు, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ప్రత్యూష్ కుమార్ కంపెనీ సర్వమ్ కేజ్ అనే ఏఐ స్మార్ట్గ్లాసెస్ను ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు ఎక్స్ వేదికగా వెల్లడించారు.
రే-బాన్ మెటా స్మార్ట్ గ్లాసెస్ మాదిరిగానే ఇంటర్నల్ కెమెరాలతో కూడిన గ్లాసెస్ పెయిర్ అద్భుతంగా ఉంది. దీనికి సంబంధించి షార్ట్ టీజర్ వీడియోను కూడా సీఈఓ కుమార్ షేర్ చేశారు. ఆ వీడియోలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ స్మార్ట్ గ్లాసెస్ ధరించినట్టుగా కనిపించారు. ఈవెంట్ ఒక ఫొటోను షేర్ చేస్తూ.. స్మార్ట్ గ్లాసెస్‌ను పరీక్షించిన మొదటి వ్యక్తి ప్రధాని మోదీ అని కుమార్ పోస్టులో రాశారు.
ఏఐ గ్లాసెస్ పరీక్షించిన ప్రధాని మోదీ :
‘సర్వం కేజ్’ను ఫిబ్రవరి 16న ప్రారంభమైన ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ 2026లో ప్రవేశపెట్టారు. ఇది వేరబుల్ ఏఐ డివైజ్. ఇతర స్మార్ట్ గ్లాసెస్ మాదిరిగానే వినియోగదారులు అన్నింటిని రియల్ టైంలో వినొచ్చు. ఈ ఏఐ గ్లాసెస్ మీ మాటలకు రెస్పాండ్ అవుతాయి.
సర్వం కేజ్ అంటే? :
సర్వం కేజ్ అనేది ఏఐ వేరబుల్ డివైజ్.. వినియోగదారుడు రియల్ టైమ్ చూసే వాటిని ఈ డివైజ్ వినగలదు. అర్థం చేసుకోగలదు. అడిగిన వాటికి రెస్పాండ్ కూడా అవుతుంది. అలాగే ఫొటోలు, వీడియోలను క్యాప్చర్ చేయగలదు.
మీరు వాటి ద్వారా ఏదైనా క్యాప్చర్ చేయొచ్చు. భారత్ మండపంలో జరుగుతున్న ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ 2026లో వాక్‌త్రూ సందర్భంగా ప్రధాని మోదీ ఈ గ్లాసెస్ ధరించారు. సర్వం ఏఐ సహ వ్యవస్థాపకుడు ప్రత్యూష్ కుమార్ షేర్ చేసిన ఫొటోలలో పీఎం మోదీ ఎగ్జిబిషన్ ఫ్లోర్లో రియట్ లైట్ గ్లాసెస్ రెస్పాన్స్ పరీక్షిస్తున్నట్లు కనిపిస్తుంది.
అతి త్వరలో ‘సర్వం’ చాట్ ఫీచర్ :
నివేదిక ప్రకారం.. కంపెనీ ఈ వారం చాట్ ఫీచర్‌ను కూడా ప్రవేశపెట్టనుంది. వాయిస్, విజువల్ ఇంటరాక్షన్ల ద్వారా మేధస్సును వాస్తవ ప్రపంచానికి తీసుకురావడమే ఈ డివైజ్ పని. కంపెనీ ప్రకారం.. వినియోగదారులు సర్వం ప్లాట్‌ఫామ్ ద్వారా కస్టమ్ ఎక్స్పీరియన్స్ కూడా పొందవచ్చు.
ఈ సర్వం ఏఐ డివైజ్ భారత్‌లోనే రూపొందించడం విశేషం. కంపెనీ పూర్తిగా స్వదేశీ ఏఐ టెక్నాలజీతో ప్రదర్శిస్తోంది. కంపెనీ ప్రకారం.. ఈ డివైజ్ వచ్చే మే నెలలో భారత మార్కెట్లో లాంచ్ చేయవచ్చని కంపెనీ తెలిపింది.
ఇంటర్నెట్ లేకుండా ఏఐ సేవలు :
భారతీయ స్టార్టప్ సర్వం ఏఐ ఇటీవలే సర్వం ఎడ్జ్‌ను ప్రవేశపెట్టింది. ఈ సర్వీసు స్పెషలిటీ ఏంటంటే.. ఇంటర్నెట్ లేకుండా పనిచేస్తుంది. ఈ సర్వీసుతో మీరు ఇంటర్నెట్ లేకుండా కూడా మీ ఫోన్ లేదా ల్యాప్‌టాప్‌లో ఏఐని వాడొచ్చు. బ్లాగ్ పోస్ట్ ప్రకారం.. సర్వం ఏఐ అనేది క్లౌడ్ సర్వర్ లేదా ఇంటర్నెట్ కనెక్షన్ అవసరం లేని ఆన్-డివైస్ ఏఐ ప్లాట్‌ఫామ్ అని పేర్కొంది. ఖరీదైన ఇంటర్నెట్ ప్లాన్లతో ఇక పనిలేదు.
నెట్వర్క్ కవరేజ్ లేని ప్రాంతాల్లో కూడా సర్వం ఎడ్జ్ ఏఐ అందుబాటులో ఉంటుంది. సర్వం ఎడ్జ్ ప్రత్యేకత ఏమిటంటే.. మీ డివైజ్ ప్రాసెసింగ్ పవర్ మొత్తం వాడేసుకుంటుంది. ఇంటర్నెట్ కనెక్టివిటీ లేకున్నా 100శాతం సేఫ్ అనమాట.
