AI Impact Summit 2026 : వచ్చే 5 ఏళ్లలో ఆ ఐటీ జాబ్స్ మటాష్.. అంతా AI ఆధిపత్యమే.. టెక్ బిలియనీర్ సంచలన కామెంట్స్
AI Impact Summit 2026 : ఏఐ దెబ్బతో రానున్న ఐదేళ్లలో ఐటీ, బీపీఓ ఉద్యోగాలన్నీ అదృశ్యమైపోతాయని టెక్ బిలియనీర్ వినోద్ ఖోస్లో సంచలన కామెంట్స్ చేశారు.
Vinod Khosla AI IT Jobs
- రాబోయే ఐదేళ్లలో ఏఐ దెబ్బకు అన్ని ఐటీ జాబ్స్ మాయం
- ఆంథ్రోపిక్ కొత్త టూల్స్ రాకతో ఐటీ ఉద్యోగుల్లో ఏఐ గుబులు
- రానున్న 12 నుంచి 18 నెలల్లో వైట్ కాలర్ ఉద్యోగాల ఏఐ భర్తీ
- ఐటీ సర్వీసులు, BPO జాబ్స్ కనుమరుగైపోతాయంటున్న వినోద్ ఖోస్లా
AI Impact Summit 2026 : ఏఐ దెబ్బకు ఉన్న ఉద్యోగాలు ఊడే పరిస్థితి కనిపిస్తోంది. టెక్ రంగంలో రోజురోజుకీ ఏఐ మరింత దూసుకుపోతోంది. అన్ని రంగాల్లోకి వేగంగా విస్తరిస్తోంది. ఇప్పటికే చాలా టెక్ కంపెనీలు ఏఐకి మారిపోయాయి. మరికొన్ని ఏఐ స్టార్టప్ కంపెనీలు నెమ్మదిగా ఏఐ దిశగా అడుగులు వేస్తున్నాయి.
పెద్ద టెక్ కంపెనీల భాగస్వామ్యంతో సరికొత్త ఏఐ టూల్స్ తీసుకువస్తున్నాయి. మనుషులతో పనిలేకుండా దాదాపు ఏఐ టూల్స్ అన్ని పనులు చేసేస్తున్నాయి. ఏఐ కోసం భారీగా పెట్టుబడులు కూడా పెడుతున్నాయి.
ఖర్చులు తగ్గించుకునేందుకు కాస్ట్ కటింగ్ కూడా మొదలుపెట్టాయి. చాలా ఐటీ కంపెనీలు లేఆఫ్స్ బాట పట్టేశాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఐటీ ఉద్యోగుల్లో గుబులు పట్టుకుంది. ఏఐ పేరు వింటనే వణికిపోతున్నారు. దీనికి తోడు ఆంథ్రోపిక్ కొత్త టూల్స్ రావడంతో భయంతో వణికిపోతున్నారు.
18 నెలల్లో వైట్ కాలర్ ఉద్యోగాలు ఫట్ :
ఏఐతో ఉద్యోగులు ఉంటాయా? ఊడుతాయా అనే సందిగ్ధంలో పడ్డారు ఐటీ ఉద్యోగులు. ఈ నేపథ్యంలో రానున్న 12 నుంచి 18 నెలల్లో వైట్ కాలర్ ఉద్యోగాలను ఏఐ భర్తీ చేయనుందని మైక్రోసాఫ్ట్ ఏఐ హెడ్ సులేమాన్ అంచనా వేశారు.
Read Also : Motorola Edge 50 Pro : అమెజాన్లో మైండ్ బ్లోయింగ్ డిస్కౌంట్.. రూ. 36వేల మోటోరోలా ఫోన్ జస్ట్ రూ. 24,568కే
ఆయనతో పాటు మరో టెక్ బిలియనర్ వినోద్ ఖోస్లా కూడా ఏఐ ఉద్యోగాలు, ఐటీ ఉద్యోగుల భవితవ్యంపై సంచలన కామెంట్స్ చేశారు. వాస్తవానికి, టెక్ రంగంలో కొత్త ఏఐ టూల్స్ రాకతో రాబోయే 5 ఏళ్లలో ఐటీ సర్వీసులతో పాటు BPO జాబ్స్ మొత్తం మాయమైపోతాయని వినోద్ ఖోస్లా అంచనా వేశారు.
Tech leaders are now talking about what I said last year. How India will face job losses because of AI. Customer support and BPO will be the first to be hit even as IT jobs start getting shelved. In a decade, there will be very less jobs in IT & BPO like Vinod Khosla predicts. https://t.co/AOzx6W4k7f
— Aravind (@aravind) February 16, 2026
15 ఏళ్లలో ఆ ఐటీ జాబ్స్ ఉండవు :
వైద్య, విద్య సంరక్షణకు సంబంధించి అన్ని అవకాశాలను అందిస్తుందని ఆయన అన్నారు. దేశంలో ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ సందర్భంగా వినోద్ ఖోస్లో ఆయన మాట్లాడారు. 12 నుంచి 15 ఏళ్లలో స్కిల్ ఆధారిత జాబ్స్ కూడా కనుమరుగైపోతాయని హెచ్చరించారు.
‘ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై కూడా ఏఐ ప్రభావం భారీగా పెరుగుతోంది. ఎక్కువగా ఐటీ ఉద్యోగులపైనే ఏఐ ప్రభావం పడనుంది. ఇప్పటికే చాలా కంపెనీల్లో ఉద్యోగుల స్థానంలో రోబోలు వచ్చేశాయి. వాటికి అయ్యే ఖర్చు చాలా తక్కువ. దాంతో ద్రవ్యోల్బణం కూడా తగ్గుతుంది. రాబోయే 15 నుంచి 20 ఏళ్లలో చాలా వరకు ఐటీ సేవలు ఫ్రీగా అందుబాటులోకి వస్తాయి. విద్య, వైద్యం అందరికీ అందుబాటులోకి వస్తుంది.’ అని ఖోస్లా చెప్పుకొచ్చారు.
