Croma Republic Day Sale : ఇది కదా ఆఫర్ అంటే.. ఐఫోన్ 16 సగం ధరకే కొనేసుకోండి.. ఈ డోల్ అసలు మిస్ చేసుకోవద్దు!

Croma Republic Day Sale : క్రోమా రిపబ్లిక్​డే సేల్‌లో సరికొత్త ఐఫోన్​16పై దిమ్మతిరిగే డిస్కౌంట్​అందిస్తోంది. ఐఫోన్​ 16 రూ. 20వేల కన్నా తక్కువ ధరకే సొంతం చేసుకోవచ్చు.

Croma Republic Day Sale : ఇది కదా ఆఫర్ అంటే.. ఐఫోన్ 16 సగం ధరకే కొనేసుకోండి.. ఈ డోల్ అసలు మిస్ చేసుకోవద్దు!

Croma Republic Day Sale

Updated On : January 25, 2025 / 5:03 PM IST

Croma Republic Day Sale : కొత్త స్మార్ట్‌ఫోన్ కొనేందుకు ప్లాన్ చేస్తున్నారా? క్రోమాలో రిపబ్లిక్ డే సేల్ కొనసాగుతోంది. జనవరి 16న ప్రారంభమైన ఈ క్రోమా సేల్ జనవరి 26, 2025 వరకు అందుబాటులో ఉంటుంది. ఈ సేల్ సమయంలో ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల శ్రేణిపై భారీగా ధరల తగ్గింపును అందిస్తుంది. దుకాణదారులు ఈ డీల్‌లను క్రోమాస్, టాటా న్యూ అధికారిక వెబ్‌సైట్, స్టోర్‌లో ఆన్‌లైన్‌లో యాక్సెస్ చేయవచ్చు. ప్రముఖ టెక్ కేటగిరీలలో డిస్కౌంట్‌లు అందుబాటులో ఉంటాయి.

Read Also : iPhone 16E Launch : కొత్త ఐఫోన్ కోసం చూస్తున్నారా? చౌకైన ధరకే ఐఫోన్ 16E వచ్చేస్తోంది.. ఫీచర్లు, డిజైన్ వివరాలివే!

రిపబ్లిక్ డే సందర్భంగా క్రోమా రిపబ్లిక్​డే సేల్‌లో సరికొత్త ఐఫోన్​16పై దిమ్మతిరిగే డిస్కౌంట్​అందిస్తోంది. ఈ సేల్​సందర్భంగా ఐఫోన్​ 16 రూ. 20వేల కన్నా తక్కువ ధరకే సొంతం చేసుకోవచ్చు. ఆపిల్ ఐఫోన్ 16 ప్రస్తుత ఆఫర్ ధర రూ. 39,490 ఉండగా, 50 శాతం తగ్గింపుతో లభిస్తోంది. అన్ని క్యాష్‌బ్యాక్‌లు, ఎక్స్ఛేంజ్ ఆఫర్‌లతో సహా ధర రూ. 19,490కి తగ్గింపు పొందవచ్చు. అదనంగా, ఇంటెల్ ఐ3-ఆధారిత ల్యాప్‌టాప్‌లు రూ. 26,530 నుంచి ఆఫర్లు ప్రారంభమవుతాయి. కంప్యూటింగ్ డివైజ్‌లను అప్‌గ్రేడ్ చేయాలనుకునే వారికి సరసమైన ధరలో కొనుగోలు చేయొచ్చు.

శాంసంగ్ ఫోల్డబుల్ ఫోన్లపై దిమ్మతిరిగే ఆఫర్లు :
స్మార్ట్‌ఫోన్‌లపై ఆసక్తిగల వినియోగదారులు శాంసంగ్ గెలాక్సీ ఫోల్డ్ 5 కూడా తక్కువ ధరకే సొంతం చేసుకోవచ్చు. ఈ ఫోన్ ధరలు రూ. 98,990 నుంచి ప్రారంభమవుతాయి. ఇందులో క్యాష్‌బ్యాక్, శాంసంగ్ అప్‌గ్రేడ్ ఆఫర్‌లు ఉన్నాయి. ఈ సేల్ ఆపిల్ ఐప్యాడ్ 10వ జెన్‌తో సహా ఇతర ఆపిల్ ప్రొడక్టుల రేంజ్‌ను రూ. 34,900కి అందిస్తుంది. దీనిని క్యాష్‌బ్యాక్‌తో రూ. 29,150కి తగ్గించవచ్చు. ఆపిల్ వాచ్ సిరీస్ 10 (42ఎమ్ఎమ్ జీపీఎస్) రూ. 46,900కి అందుబాటులో ఉంది. అదే ఆఫర్‌తో ఈ శాంసంగ్ ఫోన్ ధర రూ. 42,490కి తగ్గించవచ్చు.

ల్యాప్‌టాప్, ఇతర స్మార్ట్‌ఫోన్లపై మరెన్నో డిస్కౌంట్లు :
లేటెస్ట్ ల్యాప్‌టాప్‌లపై ఆసక్తి ఉన్న వినియోగదారులు మ్యాక్‌బుక్ ఎయిర్ M3 ఎంచుకోవచ్చు. సాధారణంగా ఈ ల్యాప్‌టాప్ ధర రూ. 1,14,900, క్యాష్‌బ్యాక్, ఎక్స్ఛేంజ్ తర్వాత రూ. 75,490కి అందుబాటులో ఉంటుంది. ఈ ప్రొడక్టుల కోసం ఈఎంఐ ఆప్షన్లలో ఐప్యాడ్ కోసం రూ. 1,340, మ్యాక్‌బుక్ ఎయిర్ కోసం రూ. 3,354 నుంచి ప్రారంభమవుతాయి. ఈ సేల్‌లో వన్‌ప్లస్ 13 స్మార్ట్‌ఫోన్‌లపై మరెన్నో ఆకర్షణీయమైన ఆఫర్లు ఉన్నాయి.

భారీ తగ్గింపు ధరతో వన్‌ప్లస్ 13తో పాటు వన్‌ప్లస్ వాచ్ 2 కొనుగోలు వంటి ఆఫర్‌లు ఉన్నాయి. ఇతర వన్‌ప్లస్ మోడల్‌లు రూ. 7వేల వరకు ఎక్స్‌ఛేంజ్ వాల్యూతో వస్తాయి. ఎంపిక చేసిన ఫైనాన్స్ కంపెనీల నుంచి రూ.26వేల వరకు ఇన్‌స్టంట్ క్యాష్‌బ్యాక్‌తో ప్రత్యేక బ్యాంక్ ఆఫర్‌ల ద్వారా అదనపు సేవింగ్స్ బెనిఫిట్స్ పొందవచ్చు. వివిధ కన్స్యూమర్ ఫైనాన్స్ ప్రొవైడర్‌ల ద్వారా కూడా క్యాష్‌బ్యాక్ ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి.

Read Also : iPhone 15 Price : ఫ్లిప్‌కార్ట్‌లో భారీగా తగ్గిన ఐఫోన్ 15 ధర.. ఇదే బెస్ట్ టైమ్.. ఇప్పుడే ఆర్డర్ పెట్టేసుకోండి!