iPhone 15 Price : ఫ్లిప్‌కార్ట్‌లో భారీగా తగ్గిన ఐఫోన్ 15 ధర.. ఇదే బెస్ట్ టైమ్.. ఇప్పుడే ఆర్డర్ పెట్టేసుకోండి!

iPhone 15 Price : భారత మార్కెట్లో ఆపిల్ ధర తగ్గిన తర్వాత ఐఫోన్ 15 మోడల్ 128జీబీ వేరియంట్‌ రూ.69990కి రిటైల్ అయింది.

iPhone 15 Price : ఫ్లిప్‌కార్ట్‌లో భారీగా తగ్గిన ఐఫోన్ 15 ధర.. ఇదే బెస్ట్ టైమ్.. ఇప్పుడే ఆర్డర్ పెట్టేసుకోండి!

iPhone 15 prices

Updated On : January 20, 2025 / 4:17 PM IST

iPhone 15 Price : ఆపిల్ ఐఫోన్ మోడల్‌ కొనుగోలు చేయాలని ప్లాన్ చేస్తున్నారా? అయితే, ఇదే సరైన సమయం. లేటెస్ట్ జనరేషన్ ఐఫోన్ మోడల్‌ను కొనుగోలు చేయాలంటే భారీగా ఖర్చు చేయాల్సిందే. కానీ, పాత జనరేషన్ ఐఫోన్‌ కొనుగోలు చేయడం వల్ల భారీ మొత్తంలో డబ్బు ఆదా చేసుకోవచ్చు. ఇటీవల, ఆపిల్ ఐఫోన్ 16 మోడల్ 128జీబీ ధర రూ.79990 వద్ద విడుదల చేసింది.

Read Also : Apple iPhone 17 Launch : భారీ అప్‌గ్రేడ్‌లతో ఆపిల్ ఐఫోన్ 17 వచ్చేస్తోంది.. మునుపెన్నడూ చూడని ఫీచర్లు..!

అయితే, భారత మార్కెట్లో ఐఫోన్ 15 ధరను రూ.10వేలు తగ్గించింది. అన్ని పవర్‌ఫుల్ ఫీచర్లతో ఐఫోన్ 15 మోడల్‌ని పొందవచ్చు. ఫ్లిప్‌కార్ట్ కూడా భారీ తగ్గింపును అందిస్తోంది. కొనుగోలుదారులు ఐఫోన్ 15 కొనుగోలుపై అదనపు ప్రయోజనాలను పొందవచ్చు. మీరు 2023 ఐఫోన్ 15 మోడల్‌ను సరసమైన ధరకు ఎలా పొందవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం.

ఫ్లిప్‌కార్ట్‌లో తగ్గిన ఐఫోన్ 15 ధర :
భారత మార్కెట్లో ఆపిల్ ధర తగ్గిన తర్వాత ఐఫోన్ 15 మోడల్ 128జీబీ వేరియంట్‌ రూ.69990కి రిటైల్ అయింది. అయితే, ఫ్లిప్‌కార్ట్‌లో కొనుగోలుదారులు ఈ ఐఫోన్ 15 ధర కేవలం రూ.58999కి పొందవచ్చు. ఈ ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్‌పై 15శాతం తగ్గింపును అందిస్తుంది. ఇ-కామర్స్ డిస్కౌంట్‌లతో పాటు కొనుగోలుదారులు స్మార్ట్‌ఫోన్ ధరను మరింత తగ్గించేందుకు బ్యాంక్, ఎక్స్ఛేంజ్ ఆఫర్‌లను కూడా పొందవచ్చు.

iPhone 15 prices

iPhone 15 Price

ఫ్లిప్‌కార్ట్ లిస్టింగ్ ఆధారంగా కొనుగోలుదారులు హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ఈఎంఐ లావాదేవీలపై రూ.1500 వరకు 10శాతం తగ్గింపును పొందవచ్చు. రూ.4999 కనీస లావాదేవీపై కొనుగోలుదారులు హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ నాన్-ఈఎంఐతో రూ.1000 తగ్గింపును పొందవచ్చు. చివరగా, ఎక్స్‌ఛేంజ్ ఆఫర్‌లతో కొనుగోలుదారులు ఐఫోన్ 15పై రూ.55వేల వరకు తగ్గింపును పొందవచ్చు. అయితే, స్మార్ట్‌ఫోన్ మోడల్ వర్కింగ్ కండిషన్ ఎక్స్‌ఛేంజ్ ధరపై ఆధారపడి ఉంటుంది. ఫ్లిప్‌కార్ట్ చాలా బెస్ట్ ఆఫర్‌ను అందిస్తోంది.

మీరు ఐఫోన్ 15 కొనుగోలు చేయాలా? :
ఆపిల్ ఐఫోన్ 15 గ్లోబల్ మార్కెట్‌లో అత్యధికంగా అమ్ముడవుతున్న స్మార్ట్‌ఫోన్‌లలో ఒకటి. ఈ స్మార్ట్‌ఫోన్ పర్ఫార్మెన్స్ కెమెరాకు అత్యంత ఆకర్షణీయమైనది. ఐఫోన్ 15 ఫోన్ 60Hz రిఫ్రెష్ రేట్‌తో 6.1-అంగుళాల సూపర్ రెటినా ఎక్స్‌డీఆర్ డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్ ఎ16 బయోనిక్ చిప్‌తో ఆధారితమైనది. అద్భుతమైన పవర్‌ఫుల్ పర్ఫార్మెన్స్ అందిస్తుంది. ఐఫోన్ 15 48ఎంపీ ప్రైమరీ కెమెరా, 12ఎంపీ అల్ట్రావైడ్ కెమెరాతో కూడిన డ్యూయల్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. ఫ్రంట్ సైడ్ 12ఎంపీ సెల్ఫీ కెమెరాను కలిగి ఉంది.

Read Also : iPhone 16E Launch : కొత్త ఐఫోన్ కోసం చూస్తున్నారా? చౌకైన ధరకే ఐఫోన్ 16E వచ్చేస్తోంది.. ఫీచర్లు, డిజైన్ వివరాలివే!