Apple iPhone 17 Launch : భారీ అప్‌గ్రేడ్‌లతో ఆపిల్ ఐఫోన్ 17 వచ్చేస్తోంది.. మునుపెన్నడూ చూడని ఫీచర్లు..!

Apple iPhone 17 Launch : ఐఫోన్ 17 సిరీస్‌లో 48ఎంపీ ప్రో-గ్రేడ్ బ్యాక్ కెమెరా, ఫొటోగ్రఫీ ఔత్సాహికులకు అద్భుతమైన ఫీచర్లను అందించనుంది. ఫొటో, వీడియో క్వాలిటీ కోసం ఏఐ ఫీచర్‌లను ఇంటిగ్రేట్ చేయవచ్చు.

Apple iPhone 17 Launch : భారీ అప్‌గ్రేడ్‌లతో ఆపిల్ ఐఫోన్ 17 వచ్చేస్తోంది.. మునుపెన్నడూ చూడని ఫీచర్లు..!

Apple iPhone 17 Launch

Updated On : January 2, 2025 / 3:57 PM IST

Apple iPhone 17 Launch : 2025లో ఆపిల్ కొత్త ఐఫోన్ రాబోతుంది. ఆపిల్ అభిమానులు అత్యంతగా ఎదురుచూస్తున్న ఐఫోన్ 17 సిరీస్‌ను ఈ ఏడాదిలో లాంచ్ చేసేందుకు టెక్ దిగ్గజం రెడీ అవుతుందని సమాచారం. రాబోయే ఐఫోన్ 17 సిరీస్ భారీ అప్‌గ్రేడ్‌లను కలిగి ఉంటుందని కంపెనీ అంచనా. డిస్‌ప్లే టెక్నాలజీ, కెమెరా ఫీచర్లు మొత్తం పర్ఫార్మెన్స్ సహా రాబోయే మోడళ్ల గురించి వివరాలను వెల్లడిస్తూ అనేక లీక్‌లు వెలువడ్డాయి.

Read Also : iPhone 16 Pro Discount : ఆపిల్ ఐఫోన్ 16 ప్రోపై భారీ డిస్కౌంట్.. ఇదే బెస్ట్ ఛాన్స్.. డోంట్ మిస్!

ఐఫోన్ ప్రో మోషన్ డిస్‌ప్లేలు :
ఐఫోన్ 17 సిరీస్ డిస్‌ప్లే టెక్నాలజీలో భారీ అప్‌గ్రేడ్‌ను తీసుకువస్తుందని అంచనా. నివేదిక ప్రకారం.. డిజిటల్ చాట్ స్టేషన్ షేర్ చేసిన లీక్‌ల ప్రకారం.. రాబోయే సిరీస్‌లోని అన్ని మోడల్‌లు 120Hz రిఫ్రెష్ రేట్‌తో ప్రో మోషన్ ఓఎల్ఈడీ డిస్‌ప్లేలను కలిగి ఉంటాయి.

ప్రస్తుతం 60హెచ్‌జెడ్ ఎల్‌సీడీలను కలిగి ఉన్నందున బేసిక్ ఐఫోన్ 16, ఐఫోన్ 16 ప్లస్ భారీ మార్పును సూచిస్తుంది. ఆపిల్ ఈ అడ్వాన్స్‌డ్ డిస్‌ప్లేలను శాంసంగ్, ఎల్‌జీ నుంచి అందించనుంది. ఈ వేరియబుల్ 120Hz రిఫ్రెష్ రేట్‌లతో కూడిన కొత్త ఎల్టీపీఓ ప్యానెల్‌లు ఐఫోన్ 17 సిరీస్‌ను అప్‌గ్రేడ్ మాత్రమే కాకుండా 2025 ప్రథమార్థంలో రాబోయే ఐఫోన్ ఎస్ఈ 4లో కూడా కనిపించవచ్చు.

అత్యాధునిక కెమెరా, ఏఐ ఫీచర్లు :
ఐఫోన్ 17 సిరీస్‌లో 48ఎంపీ ప్రో-గ్రేడ్ బ్యాక్ కెమెరా, ఫొటోగ్రఫీ ఔత్సాహికులకు అద్భుతమైన ఫీచర్లను అందించనుంది. అదనంగా, ఆపిల్ ఫొటో, వీడియో క్వాలిటీ కోసం ఏఐ ఫీచర్‌లను ఇంటిగ్రేట్ చేయవచ్చు. వినియోగదారులకు స్మార్ట్, మరింత అడ్వాన్స్‌డ్ కెమెరా సామర్థ్యాలను అందించవచ్చు.

పవర్ ప్యాక్డ్ పర్ఫార్మెన్స్ :
హుడ్ కింద ఐఫోన్ 17 సిరీస్ ఎ19 బయోనిక్ చిప్‌సెట్ ద్వారా పవర్ పొందుతుంది. అసమానమైన పర్ఫార్మెన్స్ అందిస్తుంది. ఈ కొత్త లైనప్ 12జీబీ ఎల్‌పీడీడీఆర్5ఎక్స్ ర్యామ్‌తో కూడా వస్తుందని భావిస్తున్నారు. మల్టీ టాస్కింగ్, గేమింగ్ ఎక్స్‌పీరియన్స్ అందిస్తుంది.

ఆపిల్ సన్నని ఐఫోన్ డిజైన్ :
“ఐఫోన్ 17 ఎయిర్” లేదా “ఐఫోన్ 17 స్లిమ్” అనే ఆపిల్ ఇంకా స్లిమ్ ఐఫోన్ ప్రవేశపెట్టనుంది. రాబోయే సంవత్సరాలలో ఐఫోన్ మోడళ్లలో మొదటి డిజైన్ మార్పును సూచిస్తుంది. డిస్‌ప్లే, కెమెరా, హార్డ్‌వేర్‌లో అప్‌గ్రేడ్‌లతో ఐఫోన్ 17 సిరీస్ స్మార్ట్‌ఫోన్ టెక్నాలజీలో కొత్త బెంచ్‌మార్క్‌లను సెట్ చేయనుంది.

Read Also : iPhone 15 Discount : రూ. 25 వేల కన్నా తక్కువ ధరకే ఐఫోన్ 15 కొనేసుకోవచ్చు.. ఈ బంపర్ ఆఫర్ అసలు మిస్ చేసుకోవద్దు..!